(P.Srinivas,New18,Karimnagar)
ప్రతి ఒక్కరికి సమాజం పట్ల బాధ్యత ఉండాలి. పరిసరాల శుభ్రతపై అగాహన పెంచుకోవాలి. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలి. కాని జీవన పోరాటంలో ప్రతి ఒక్కరూ తలమునకలైపోతున్నారు. అందుకే పరిసరాల శుభ్రతను పట్టించుకునే వారే కరువయ్యారు. అపరిశుభ్ర వాతావరణం కారణంగా తన కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఓ పదేళ్ల బాలుడు అధికారులకు తమ గోడు చెప్పుకున్నాడు. పెద్దపల్లి (Peddapalli) జిల్లాకు చెందిన ఐదో తరగతి స్టూడెంట్(Fifth class student) తమ కాలనీలో సరైన రోడ్డు లేదని నివాస ప్రాంతాల దగ్గర మొలసిన పిచ్చి చెట్లను తొలగించాలని వేడుకోవడం అందర్ని ఆలోచింపజేస్తోంది. అసలు అతనికి ఈ ఆలోచన రావడానికి కారణం ఏమిటంటే.
బాలుడిలో సామాజిక బాధ్యత..
పెద్దపల్లి జిల్లా రామగుండం బల్దియాలోని ఎన్టీపీసీ గౌతమీనగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీకి చెందిన పదేళ్ల బాలుడు కేశవ ఉదయం తెల్లవారు జామునే తమ కాలనీలోని రోడ్డుపై భైటాయించాడు. వేకువ జామునే నిద్ర లేచి నిత్యం రన్నింగ్ చేసే అక్క ఆసుపత్రి పాలు కావడం తట్టుకోలేకపోయిన కేశవ..తమ ప్రాంతంలో చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగినా తొలగించే వారు లేరంటూ దాని వల్ల తన సోదరికి వాకింగ్ చేస్తుండగా విష కీటకం కరిసి అనారోగ్యం పాలైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తన ఒక్కడి సమస్య కాదని కాలనీ వాసులంతా ఎదుర్కొంటున్నారని గమనించగలరంటూ బల్దియా అధికారులతో తన గోడు చెప్పుకున్నాడు.
అధికారులు పట్టించుకోండి..
రోడ్డు బాగా లేకపోవడంతో కేవలం తమ కుటుంబమే కాదని కాలనీలో నివాసం ఉంటున్న చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని వెంటనే రోడ్డును బాగు చేయించాలని కోరుతున్నాడు కేశవ. కనీసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలనయినా తొలగించినా బావుంటుందని అంటున్నాడు. దీనివల్ల కీటకాలు మొక్కల మధ్య అవాసం ఏర్పాటు చేసుకుని కాలనీ వాసులకు ప్రాణాపాయంగా మారినందున మొక్కలనయినా తొలగిస్తే బావుంటుందని కాలనీ వాసులు కూడా చెప్తున్నారు.
స్థానిక సమస్యలపై పోరాటం..
ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీకి చెందిన వేదశ్రీ రోజూ తెల్లవారుజామున కాలనీ రోడ్లపై రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటోంది. ఈ క్రమంలో ఓ రోజు విష కీటకం కుట్టడంతో అనారోగ్యానికి గురైన వేదశ్రీని ఆసుపత్రిలో చేర్పించి చికిత్సం అందించాల్సి వచ్చింది. అందుకే అదే రోడ్డుపై కూర్చొని నమస్కారం చేస్తూ తన నిరసన వ్యక్తం చేశాడు కేశవ. ఇప్పటికైనా బల్దియా స్పందించి తమ రోడ్డును అయినా బాగు చేయాలని కనీసం రోడ్డు పక్కన మొలచిన మొక్కలైనా తొలగించి స్వచ్ఛ రహదారిగా అయినా మార్చాలని కోరాడు.
అధికారులు చలిస్తారా ..
బుధవారం చిన్నారి చేపట్టిన నిరసన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇంత వరకు పట్టించుకోని రామగుండం బల్దియా అధికారులు బాలుడి వినూత్న నిరసనతోనైనా మేల్కొంటారని ఆశిస్తున్నారు. అయితే ఐదో తరగతి చదువుతున్న ఓ బాలుడు స్థానిక సమస్యలపై ఈవిధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. కేశవ ఆవేదనను విన్న తర్వాతైనా అధికార యంత్రాంగంలో మార్పు వస్తుందో లేదు మనమూ చూద్దాం..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Peddapalli, Telangana News