హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddpalli: పోలీస్టేషన్​కి తాగొచ్చిన నాటు సారా తయారీదారుడు.. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే..

Peddpalli: పోలీస్టేషన్​కి తాగొచ్చిన నాటు సారా తయారీదారుడు.. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే..

పెద్దపల్లి పోలీస్టేషన్​

పెద్దపల్లి పోలీస్టేషన్​

పెద్దపల్లిలో మద్యం మత్తులో ఎక్సైజ్ సిబ్బందిపై దాడి చేశారు ముగ్గురు వ్యక్తులు, తాము నాటు సారా కాసే విషయం స్టేషన్ సిబ్బంది ఉన్నతాధికారులకు చేరవేశారని దాడి చేయడం కలకలం సృష్టించింది.

(E. Santhosh, News 18, Peddapalli)

మద్యం మత్తులో ఎక్సైజ్ (Excise) సిబ్బందిపై దాడికి యత్నించిన ముగ్గురు నిందితులకు గోదావరిఖని కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రామగుండం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ కాలనీకి చెందిన అజ్మీరా సారయ్య అక్రమంగా నాటు సారా తయారుచేసి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టి సారయ్యను జూలై 16న అరెస్టు చేశారు. అనంతరం తాహసిల్దార్ ఎదుట బైండోవర్ చేయడానికి నిందితుడిని రామగుండం ఎక్సైజ్ స్టేషన్ పిలిపించగా అతను మరో ఇద్దరిని వెంట తీసుకొని వచ్చాడు. ముగ్గురు మద్యం మత్తులో ఉన్నారు. తాము నాటు సారా కాసే విషయం స్టేషన్ డ్రైవరే ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించాడంటూ డ్రైవర్ పై దాడికి పాడ్పడ్డారు. అడ్డుకునేందుకు యత్నించిన సెంట్రీను కూడా పక్కకు తోసి వేశారు. విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడికి పాల్పడడంతో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి గోదావరిఖని మొదటి కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ నిందితులు ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వారిని కరీంనగర్ (Karimnagar) జిల్లా జైలుకు తరలించారు.

జీవితం మీద విరక్తితో..

ఇక మరో ఘటనలో జీవితం మీద విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలోని పాలకుర్తిలో వెలుగు చూసింది. పాలకుర్తి చెందిన బూడిద బుగ్గయ్య (69) మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బసంత్ నగర్ ఎస్సై మహేందర్ కథనం ప్రకారం బుగ్గయ్య కేశోరాం కార్మాగారంలో పదవీ విరమణ పొందినప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. గతంలో మొదటి భార్యను కత్తితో పోడవడంతో జైలుకు వెళ్లి ఇటీవలే వచ్చాడు. బంధువులు, కుటుంబ సభ్యులు దూరమవడంతో జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పాలకుర్తి మండలం ఎల్కలపల్లికి చెందిన సుభాషిణి(38) మంగళవారం రాత్రి పాముకాటుతో మృతి చెందింది. ఇంటి ఆవరణలో పని చేస్తున్న సమయంలో పామును గుర్తించలేకపోవడంతో ఆమెను పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు సుభాషిణిని హుటాహుటిన గోదావరిఖని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆమె మృతిచెందింది. మృతురాలికి భర్త, కూతురు, కొడుకు ఉన్నారు.

విస్తృతంగా వాహనాల తనిఖీలు..

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదావరిఖనిలో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కూడళ్ళతోపాటు, శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని వాహనదారులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ.....రహదారి నియమాలు, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధ్రువీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సరుకు రవాణా వాహనాలలో ప్యాసెంజర్లను ఎక్కించుకోవడం వంటివి చట్ట వ్యతిరేకమైన చర్యలని, అటువంటి వాహనాల పై కేసులు నమోదు చేసి సీజ్ చేయడంతో పాటు, వాహన యజమానుల పై కూడా కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

First published:

Tags: Crime news, Local News, Peddapalli, Snake bite

ఉత్తమ కథలు