హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: స్వయంభువుగా వెలిసిన బ్రహ్మ సూత్ర శివలింగం.. ఎక్కడంటే?

Peddapalli: స్వయంభువుగా వెలిసిన బ్రహ్మ సూత్ర శివలింగం.. ఎక్కడంటే?

X
భక్తులకు

భక్తులకు కొంగు బంగారంగా మారిన శివయ్య

Telangana: భూమి మీద చాలా అరుదుగా స్వయంభువుగా వెలిసే బ్రహ్మ సూత్ర శివలింగం. తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఓ అరుదైన శివలింగం ఒకటి ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

santosh, News18, Peddapalli

భూమి మీద చాలా అరుదుగా స్వయంభువుగా వెలిసే బ్రహ్మ సూత్ర శివలింగం. తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఓ అరుదైన శివలింగం ఒకటి ఉంది. బ్రహ్మ సూత్ర శివ లింగం రూపంలో కనిపించే ఈ స్వయంభు శివలింగం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని అధాభి రామగుండంలో ఉంది. ఈ శివలింగాన్ని కనుగొనడం, ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం వెనుక ఒక ఆసక్తికరమైన కధ ఉంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని అదాభి రామగుండం అనే గ్రామంలో శాతహవనుల కాలంలో స్వయంభూ గా వెలసిన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం లో బ్రహ్మ సూత్ర శివ లివలింగం స్వయంభు వెలసింది. ఆ సమయంలో ఆలయలో కేవలం గర్భ గుడి మాత్రమే ఉండేది. ఆ కాలం నాటి నుండి ప్రత్యేక పూజలు జరుగుతుండడం విశేషం.

శాతాహనుల నుండి ఉన్నఈ ఆలయ నిర్వాహణ, కాల క్రమేణా గ్రామస్థులు బాధ్యతలు స్వీకరించిఆలయ కమిటీ వేసి అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇక్కడ గ్రామస్తులు శివలింగాన్ని స్వయంగా తాకి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ అవకాశాన్ని వారు తమ అదృష్టంగా భావిస్తుంటారు. బ్రహ్మ సూత్ర శివ లింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివ లింగంపై గీతలు ఉంటాయి.

అలా ఉన్న శివ లింగాన్ని బ్రహ్మ సూత్ర శివ లింగము అంటారు. బ్రహ్మ సూత్ర శివలింగము దర్శించుకుంటే ఒక వెయ్యి సార్లు శివుడిని దరించుకున్నట్లుగా పురాణాలు చెప్తున్నాయని ఆలయ పూజారి శ్రీనివాస శర్మ అంటున్నారు. అంతటి విశిష్టత ఉన్నది కాబట్టి ఈ ఆలయ దర్శించుకోవాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు వస్తారని అన్నారు. ఈ ఆలయంలో నెలలో ఒక రోజు అన్న దాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ అన్నదానంలో పాల్గొన్నవారికి అష్ట ఐశ్వర్యాలు సుఖసంతోషాలతో జీవిస్తారని ప్రజలకు అశేష నమ్మకం.

ఈ ఆలయంలో నైరుతి భాగంలో స్వయంగా వెలసిన సంతాన నాగేంద్ర స్వామి పుట్ట ఉంది. ఆ పుట్టకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. సంతాన లేక బాధపడే వారు ఆ పుట్టలో పాలు పోస్తే సంతానం కలుగుతుందని అక్కడి ప్రజల అపార నమ్మకం. ప్రతి మంగళ వారం పుట్టకు పూజలు చేసి పాలు పోస్తుంటారు. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే అప్పుడప్పుడు పుట్టలో నుండి నాగు పాము దర్షణమిస్తుందట. పుట్టలోకి పాము వచ్చి అక్కడ ఉన్న పాలు త్రాగి పోతుందని చెపుతున్నారు పూజారి. నాగు పాము దర్శనంతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిస్తుంటారు భక్తులు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు