హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: 65 ఏళ్ల వయసులో బొమ్మలు గీస్తున్న బామ్మ!

Peddapalli: 65 ఏళ్ల వయసులో బొమ్మలు గీస్తున్న బామ్మ!

X
అందమైన

అందమైన బొమ్మలు గీస్తున్న బామ్మ

Telangana: 65 ఏళ్ల వయసులో ఆ బామ్మ బొమ్మలు గీస్తుంది. ఆ బామ్మకి బొమ్మలు గీయడం అంటే ఇష్టం. అందుకే 65 ఏళ్ల వయసులో బొమ్మలు గీస్తుంది. ఈ వయసులో బొమ్మలు ఏంటి అని అడిగితే హుషారుగా సమాధానం చెబుతుంది బామ్మ.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

santosh, News18, Peddapalli

65 ఏళ్ల వయసులో ఆ బామ్మ బొమ్మలు గీస్తుంది. ఆ బామ్మకి బొమ్మలు గీయడం అంటే ఇష్టం. అందుకే 65 ఏళ్ల వయసులో బొమ్మలు గీస్తుంది. ఈ వయసులో బొమ్మలు ఏంటి అని అడిగితే హుషారుగా సమాధానం చెబుతుంది బామ్మ. చాలా మంది ఉన్నది ఉన్నట్లు,గీగేస్తుంటారు.. లేదా చూసింది చూసినట్లు బొమ్మలు వేస్తుంటారు. కానీ, ఈ బామ్మ మాత్రం అందుకు భిన్నంగా బొమ్మలను గీస్తోంది. మనసులో అనుకున్న బొమ్మలను గీస్తూ అందరి మనసు దోచుకుంటుంది. ఈ బామ్మకి గురువు కూడా లేరు.. కానీ బొమ్మలు గీయడంలో ఎన్ని పద్దతులు ఉంటాయి.. ఆ పద్ధతులన్ని తూచా తప్పకుండా కొంచం కూడా మిస్టేక్స్ కాకుండా బొమ్మలు గీయడం బామ్మ టాలెంట్.చాలామంది చెప్పే 'అవుట్ ఆఫ్ ది బాక్స్' అనే మాటను బామ్మకి తెలియక పోయినా తప్పులు అనేవి కనబడకుండా తన చేతిలో పెన్సిల్ పట్టి బొమ్మలకు అందాన్ని తెస్తుంది.

ఆ బామ్మ పై ప్రత్యేక కథనం ఇది...

పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం స్వప్న కాలనీకి చెందిన యాదగిరి రామలక్ష్మి భర్త యాదగిరి వైకుంఠం. వీరికి నలుగురు సంతానం కాగా వారందరికీ పెళ్లిలు చేసి వారికి పిల్లలు, అందరి బాధ్యతలు తీరాయి. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే మనసు ఒప్పక, ప్రతి రోజూ ఏదో ఒక బొమ్మ గీస్తూ ఆ బొమ్మలకు రంగులు దిద్దుతు అందంగా మరచడం ప్రారంభించింది.

బామ్మకు చిన్న నాటి నుండేచిత్రలేఖనం అంటే చాలా ఆసక్తి. అందరూ గీసే వాటిలా కాకుండా తన బొమ్మలు కొత్తగా ఉండాలని అనుకుంటుంది. అలా అనుకుంటుంది కాబట్టే.. తన బొమ్మలు అందంగా కనిపిస్తున్నాయి. చిన్ననాటి నుండే ఉన్న అలవాటు బామ్మకి క్రమంగా ఆ అలవాటే ఇష్టంగా మారింది. అలాతాను గీసిన చిత్రాలతో వారి ఇంట్లో ఫ్రెములతో అందంగా తయరు చేసింది. బామ్మ బొమ్మలు ప్రశాంతమైన ముఖంతో చూడగానే ఓ మంచి భావన కలిగించేలా ఉంటుంది.

బామ్మ ఖాళీగా ఉండే సమయంలో తన మసును ప్రశాంతంగా, విలాసవంతంగా మలుచుకునేందుకు తన మనసులో ఏ బొమ్మ వేయాలని అనిపిస్తే ఆ బొమ్మ గీస్తూ అందంగా పెయింటింగ్ చేసి తన ఇంట్లోనే కబోర్డులో పెట్టుకుంటుంది. తాను వేసిన బొమ్మలకు చుట్టుపక్కల వారు అర్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోవడమే కాకుండా వారు నచ్చిన బొమ్మలు గీసి ఇవ్వమని అడిగి మరి బామ్మ చేత బొమ్మలు వేయించుకొని వారి ఇంట్లో గోడలపై పెట్టుకుంటున్నారు. బామ్మ గీసిన బొమ్మలలో రాధ కృష్ణుడి, తెలంగాణ తల్లి, ఆవుతో వాటి పిల్లలు పాలు తాగుతూ ఉన్న బొమ్మ, ఓ పాపను ఎత్తుకుని అమ్మ ఆడిస్తున్న బొమ్మఅలా ఎన్నో అందమైన బొమ్మలు గీస్తూ బామ ఈ వయసుని కాలక్షేపం చేస్తుంది. ఇలా బొమ్మలతో కాలం గడవడంతో ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉండొచ్చని తెలిపింది.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు