హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: చిక్కరు-దొరకరు.., పీడీఎస్ బియ్యాన్ని ఎలా సైడ్ చేస్తున్నారో చూడండి..!

Peddapalli: చిక్కరు-దొరకరు.., పీడీఎస్ బియ్యాన్ని ఎలా సైడ్ చేస్తున్నారో చూడండి..!

పెద్దపల్లిలో రెచ్చిపోతున్న రైస్ మాఫియా

పెద్దపల్లిలో రెచ్చిపోతున్న రైస్ మాఫియా

ఎక్కడిక్కడే అధికారులు నిఘా ఉంచినా అక్రమాలకు మాత్రం అడ్డు కట్ట వేయలేక పోతున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో పెద్దపల్లి జిల్లా (Peddapalli District) వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Peddapalle, India

  E. Santosh, News18, Peddapalli

  పేదల కడుపు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. ఎక్కడిక్కడే అధికారులు నిఘా ఉంచినా అక్రమాలకు మాత్రం అడ్డు కట్ట వేయలేక పోతున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో పెద్దపల్లి జిల్లా (Peddapalli District) వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. పట్టుబడుతున్న బియ్యం లెక్కలు చూస్తే ఆ బియ్యం తినే వారికంటే అమ్ముకునే వారే ఎక్కువగా ఉన్నట్టున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంటే, కొందరు డీలర్లు, లబ్ధిదారులకు మాయమాటలు చెప్పి దళారులకు అమ్ముకుంటున్నారు. దళారుల నుండి ఇతర రాష్ట్రాలకు అమ్ముడు పోతున్నాయి. ఈ రాష్ట్రం బియ్యం పక్క రాష్ట్రాలకు అమ్ముడు పోతుంటే అధికారులు ఏం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

  తాజాగా పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఘటనతో అధికారుల పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి పత్రాలు లేకుండా 4 లారిల బియ్యం తరలిపోతుంటే, అధికారులు ఆ లారీలను వదిలేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పది రోజుల వ్యవధిలో 2087 క్వింటాళ్ల బియ్యం పట్టుబడగా, 46 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో బియ్యం అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలు, వాహన డ్రైవర్లు మాత్రమే పట్టుబడుతుండగా అసలు నిందితులు ఎవరనే విషయాలు వెల్లడి కావడం లేదు.

  ఇది చదవండి: పార్కింగ్‌లో ఉంచిన బైక్‌లే టార్గెట్., పోలీసులకు అలా దొరికిపోయాడు

  వేడుకలో విషాదం

  విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొని ఉత్సవమూర్తిని నిమజ్జనం చేసేందుకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు కాలువలో పడి గల్లంతైన ఘటన ఆదివారం పెద్దపల్లి పురపాలిక పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజేశ్ కథనం ప్రకారం చందపల్లి సమీపంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పనులు చేసేందుకు ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వలస కూలీలు శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఆదివారం ఉత్సవమూర్తి నిమజ్జన కార్యక్రమం కోసం దాదాపు 15 మంది కూలీలు సమీపంలోని ఎస్సారెస్పీ డి-83 కాలువ వద్దకు వెళ్లారు.

  ఈ క్రమంలో కాలువ డ్రాప్ సమీపంలో విశ్వకర్మ చిత్రపటాన్ని శుభ్రం చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు యువకులు జారి నీటిలోపడ్డారు. వీరిలో ఒకరు బయటికి రాగా కేతుసింగ్ మెరావి(27), ప్రహ్లాద్ మెరావి(35) గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్నిపరిశీలించారు. ప్రవాహం అధికంగా ఉండడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి, నీటి సరఫరాను నిలిపివేసినట్లు ఎస్సై తెలిపారు. నీటి ప్రవాహం తగ్గడానికికనీసం 6 గంటల సమయం పడుతుందని, అర్ధరాత్రివరకు పూర్తిగా తగ్గిపోయే అవకాశముందన్నారు. కాగా గల్లంతైన వారికోసం సమీపంలోని మినీ హైడల్ జాలీల వద్ద పోలీసులు, వలస కూలీల బంధువులు నిరీక్షిస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Peddapalli, Telangana

  ఉత్తమ కథలు