E.Santosh, News18, Peddapalli
రూపాయి మిర్చి అదిరిందోయ్ రుచి.... చూడటానికే చిన్న తోపుడు బండి కానీ తర తరాల నుండి దాని పైనే జీవన ఆధారం చేస్తున్నారు.కొడుకులు కూడా అదే వ్యాపారం చేస్తూ ఉపాధి పొందుతున్నారు. గోదావరి ఖని కళ్యాణ్ నగర్ చౌరస్తాలో గత 40 ఏళ్లుగా తోపుడు బండిలో రూపాయికేమిర్చీ విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు వీరి కుటుంబం. 40 ఏళ్ల కింద ప్రారంభమైన ఈ వ్యాపారం... మొదట్లో ఎన్నో కష్టాలలో వారి జీవన విధానం నడిచేది. మిర్చి బండి పెట్టాలనే ఆలోచన చేసినప్పుడు మొదట్లో కొన్ని కాస్త నష్టాలు ఎదుర్కొన్న ఆ తరువాత మెల్లిగా బిజినెస్ అయితే పెరిగింది అని భాస్కర్ తెలిపాడు.
40 ఏళ్ల క్రితం భాస్కర్ నాన్న ప్రారంభించిన ఈ మిర్చి ఇప్పుడు అన్నదమ్ములు ఈ మిర్చిపై జీవన ఉపాధి పొందుతున్నారు. నిత్యావసర సరుకులు పెరిగిన మిర్చి ధర పెరగదు.. నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్ని అంటాయి ఏది కొనాలన్నా ధరలు భగ్గు మంటున్నాయి కానీ ఇలాంటి పరిస్థితుల్లోనూ కూడా వీరు మాత్రం. రూ.1 కి ఒక మిర్చి బజ్జి అమ్ముతున్నారు. మీరు చదివేది నిజమే. నలభై ఏళ్ల క్రితం మొదలైన వాళ్ల వ్యాపారం ప్రతీ రోజూ సుమారు రూ. 3 వేల నుండి రూ. 4 వేల వరకు మిర్చిలు అమ్ముడవుతాయని భాస్కర్ తెలిపాడు.
ఇంటి దగ్గరే కావాల్సిన పదార్థాలు అన్ని సిద్దం చేసుకొని సాయంత్రం 5 నుండి రాత్రి 10 వరకు శ్రమిస్తారు. శనగ పప్పు, బియ్యంతో కలిపి పిండితయారీ... మిర్చిల కోసం శనగ పప్పుతో పాటు బియ్యం కలిపి గిర్నీ పట్టిస్తాడు. క్వింటాళ్ల కొద్ది పిండి పట్టించి మిర్చిల తయారీకి వాడుతున్నారు. అవసరమైన సరుకుల ధర పెరిగిన మేము మాత్రం ధర పెంచేది లేదు అని అంటున్నారు,మా కస్టమర్స్‌ను కాపాడుకోవడమే మా కర్తవ్యంగా భావిస్తున్నామని అంటున్నారు.
Politics: రాజస్థాన్ లో తీవ్రస్థాయికి పొలిటికల్ హీట్..పైలట్ ఎప్పటికీ సీఎం కాలేడన్న గెహ్లాట్
అధిక లాభాలకుపోకుండా కొంత వరకు లభాలు ఉన్న సరేపెట్టుకుంటున్నామని అంటున్నారు.ఒక్కసారి తింటే మరో సారి రావాల్సిందే.. రూపాయి మిర్చి బజ్జీ 30 ఏళ్ల నుండి రుచి చూసే వారు కూడా ఉన్నారు,ఇక్కడ స్పెషల్ అదే మరి. ఒక్కసారి రుచి చూసిన వారు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు,మూడు నాలుగు గంటలలో 10 కేజీల మిర్చి అమ్ముడు పోతుంది. ఆలస్యమైతే దొరకడం కూడా కష్టమే అని అంటున్నారు.మల్లేష్ అనే కస్టమర్30ఏళ్ల నుండి రూపాయి బజ్జీ రుచి చూస్తున్నాననిఅంటున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రుచి తగ్గలేదని అంటున్నారు.అలాగే నిత్య అవసర సరుకుల ధరలు పెరిగిన ధర పెరగలేదు,,అలా అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే సాగుతుంది అని అన్నారు మల్లేష్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana