(Santosh, News18, Peddapalli)
అత్యంత పేదరికం, రవాణా సౌకర్యాల కొరత కారణంగా మారుమూల గ్రామాల్లో నివసించే చాలా మందికి వైద్యుడి వద్ద చికిత్స పొందే అవకాశం లేదు. జబ్బుపడిన వారిలో చాలామందికి అనారోగ్యం వచ్చినప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లి ఆరోగ్య సమస్యలకు చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ఇప్పుడు అలాంటి ప్రాంతాలకి ఎన్టీపీసీ సంస్థ మొబైల్ క్యాంప్ ద్వారా ఉచిత ప్రాథమిక చికిత్స అందిస్తుంది. ఎన్టీపీసీ CRSCD ఆధ్వర్యంలో ఇలాంటి దూరంగా ఉండే గ్రామాలకు అర్హత కలిగిన వైద్యులు, నర్సులతో కూడిన బృందాలను నిరంతరం పంపుతోంది. ఆయా గ్రామాల్లో జనాభా సమాచారం, ఆహారపు అలవాట్లు, పరిశుభ్రత పరిస్థితులు, జీవనశైలి మొదలైనవి తెలుసుకుంటోంది. వ్యాధులు రావడానికి, పెరగడానికి కారణాలను అన్వేషిస్తోంది. దీని కోసం షెడ్యూల్ ప్రకారం నిర్ణీత ప్రదేశాలలో కాలానుగుణ మొబైల్ వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది.
ఇంటి వద్దకే ఆరోగ్యం
రామగుండం ఎన్టీపీసీ CRSCD ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సమస్యలు తీర్చేందుకు మొబైల్ హెల్త్ ప్రారంభించింది. ప్రతి రోజూ ఒక ఊరులో ఇక హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులు, ఇద్దరు ఫార్మసీస్ట్ లు ఈ మొబైల్ క్యాంప్ లో పాల్గొంటారు.
ప్రతి ఒక ఊరులో ఆరోగ్య కేంద్రాలు...
ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల మొత్తం 40 ఊర్లు, రోజుకో ఒక ఊరిలో మొబైల్ ఆరోగ్య ఉచిత క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఊరిలో వెళ్ళే ముందే ఆ ఊర్లో ఎటువంటి వ్యాధులు ఎక్కువగా సంభవిస్తయో వాటికి సంబంధించిన మెడిసిన్ తో పాటు ఇతర జనరల్ వ్యాధులు , సీజనల్ వ్యాధులు వంటివి క్యాంపులో చూస్తారు. క్యాంప్ లో ప్రాథమిక చికిత్స మాత్రమే చేస్తారు. ప్రెగ్నెన్సీ మహిళలకు ప్రత్యేక చికిత్స తో పాటు ప్రోటీన్ సంబంధించిన మందులు, పౌడర్ ఇస్తారు. మొబైల్ క్యాంప్ ద్వారా పేద ప్రజలకు మంచి ఆరోగ్యం అందించడంమే లక్ష్యంగా ఎన్టీపీసీ అడుగులు వేస్తుందని డాక్టర్ సరళి అన్నారు. మొబైల్ క్యాంప్ అందిస్తున్న ఉచిత వైద్య సేవలు ప్రజలు అందరూ ఉపయగించుకోవలని అన్నారు, ప్రెగ్నెంట్ తో ఉన్న మహిళలకు ప్రత్యేక చికిత్సతో పాటు అవగాహాన మరియు ప్రోటీన్ పౌజర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా లబ్ధి చేసుకోవాలని డాక్టర్ సరళి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli