E.Santosh, News18, Peddapalli
సింగరేణి సంస్థ (Singareni Calories) ఆర్థిక సహకారంతో రామగుండం వైద్యకళాశాల ప్రారంభం అయింది. రాష్ట్రవ్యాప్తంగా సవాల్ గా తీసుకున్న సర్కార్ ఫ్రీఫ్యాబ్ పద్దతిలో త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా విద్యాసంవత్సరం వృథా కాకుండా అడ్మిషన్లు కూడా పూర్తి చేసింది. 150 సీట్లు భర్తీ అయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వ ప్రొఫెసర్లు ఉద్యోగాల్లో చేరినప్పటికీ ఇంకా మిగిలి ఉన్న పోస్టులకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మిగిలి ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ నెల ఫిబ్రవరి 10న మొత్తం 16 ట్యూటర్ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వూ నిర్వహణ జరుగుతుందని రామగుండం వైద్య కళాశాల (Ramagundam Medical College) ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు తెలిపారు.
16 ట్యూటర్ పోస్టులకు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వాక్ ఇన్ ఇంటర్వూ నిర్వహిస్తున్నామని రామగుండం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు సింగ్ నేడోక ప్రకటనలో తెలిపారు. రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న 4 అనాటమీ, 3 ఫిజియాలజి, 4 బయో కెమిస్ట్రీ, 2 ఫార్మకాలజీ, 3 ఫోరెన్సిక్ మెడిసిన్ ట్యూటర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 10న ఉదయం 11 గంటలకు జిల్లా సమీకృత కలెక్టరేట్ లోని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సమావేశ మందిరంలో వాక్ ఇన్ ఇంటర్వూ నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు. అర్హత గల 45 సంవత్సరాల లోపు వయస్సు గలఅభ్యర్థులు విద్యార్హతలు, కుల సర్టిఫికెట్, 1వ తరగతి నుండి10వ తరగతివరకు స్టడీ సర్టిఫికెట్స్ ఒక జత జిరాక్స్ తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్ లతో హాజరు కావాలని డాక్టర్ హిమబిందు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.