Home /News /telangana /

PEDDAPALLI MUNICIPAL STAFF NEGLECT PARK DEVELOPMENT IN PEDDAPALLI DISTRICT RAMAGUNDAM SNR PSE BRV

Peddapalli: కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పార్కు .. ఇప్పుడెలా ఉందో ..అక్కడేం జరుగుతుందో తెలుసా

(పార్కుని

(పార్కుని పట్టించుకోండి)

Peddapalli: అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా పార్కులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. రూ. కోట్లు ఖర్చు చేసి పార్కులు ఏర్పాటు చేసినా, నిర్వహణ లేక పార్కులు ఆదరణకు నోచుకోవడంలేదు. పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలో ఉన్న ఒక పచ్చని పార్కు అద్వాన్న స్థితికి చేరుకుంది.

ఇంకా చదవండి ...
    (santosh,News18,Peddapalli)
    అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా పార్కులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. రూ. కోట్లు ఖర్చు చేసి పార్కులు ఏర్పాటు చేసినా, నిర్వహణ లేక పార్కులు ఆదరణకు నోచుకోవడంలేదు. పెద్దపల్లి (Peddapalli)జిల్లా రామగుండం(Ramagundam)పరిధిలో ఉన్న ఒక పచ్చని పార్కు (Park)అద్వాన్న స్థితికి చేరుకుంది.పట్టణాలు, నగరాలలో నివసించే ప్రజలు సాయంత్రం వేళ, సరదాగా గడిపేందుకు పచ్చని పార్కులు ఎంతగానో ఉపయోగపడుతాయి. చిన్నారుల కేరింతలు, పెద్దల ముచ్చట్లతో పార్కుల్లో సాయంత్రం వేళ ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ప్రభుత్వం సైతం పార్కుల అభివృద్ధికి కృషి చేస్తుంది. అయితే అధికారుల అలసత్వం, బాధ్యతారాహిత్యం కారణంగా పార్కులు ఎంత మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి పార్కులు ఏర్పాటు చేసినా, నిర్వహణ సరిగా లేక పార్కులు ఆదరణకు నోచుకోవడంలేదు. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణ పరిధిలో ఉన్న ఒక పచ్చని పార్కు అద్వాన్న స్థితికి చేరుకుంది. మునిసిపల్ సిబ్బంది(Municipal staff)పట్టించుకోకపోవడంతో పార్కు అభివృద్ధికి నోచుకోవడంలేదు.

    50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన గ్రీన్ పార్కు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయం:
    బొగ్గు గనులు, విద్యుత్తు కేంద్రాలు, ఇతర పరిశ్రమల కాలుష్యంతో నిత్యం రామగుండం నగర ప్రజలు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి. ఈక్రమంలో 2016లో అటవీశాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన "నగర వన ఉద్యాన యోజన" కింద రూ.1.20 కోట్ల అంచనా వ్యయంతో కుందనపల్లి ఐవోసీఏల్ సమీపాన రాజీవ్ రహదారికి ఆనుకొని ఈ పచ్చని ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలనీ భావించారు. అందుకు స్థానిక ఎన్టీపీసీ సంస్థ సైతం తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు రాగా, మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో పార్కు ఏర్పాటు చేశారు.

    ఇది చదవండి: ఆ వేషం వేస్తూనే ప్రభుత్వ ఉద్యోగం కొట్టాడు .. పిట్టలదొరా మజాకా



    ఏడేళ్లుగా పార్కుకు తాళం..
    పార్కును సుందరంగా తీర్చి దిద్దిన అధికారులు.. వెంటనే సందర్శకులను మాత్రం అనుమతించలేదు. పూర్తి స్థాయిలో పార్కు ఏర్పాటు కాలేదని, నిధులు సమీకరణ అనంతరం మరికొంత అభివృద్ధి చేయాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. పార్కుకు తాళాలు వేసిన అటవీశాఖ అధికారులు, దాని సంరక్షణ మాత్రం మరిచారు. ఇలా ఏడేళ్లు గడిచాయి. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన నగర ఉద్యానవనం ప్రారంభంకాలేదు. పార్కు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. పార్కులోకి అక్రమంగా ప్రవేశించిన కొందరు అక్కడే మద్యం సేవిస్తూ, పార్కులోని కట్టడాలను, పరికరాలను ధ్వంసం చేశారు.

    మధ్యలోనే ఆగిపోయిన పార్కు అభివృద్ధి:
    రామగుండం నగర శివారుకు 3 కిలోమీటర్ల దూరంలో కుందనపల్లి ఐవోసీఏల్, హెచ్పీసీఏల్ ఇంధన నిల్వల కేంద్రాల పక్కన 50 ఎకరాల స్థలంలో ఈ పార్కును ఏర్పాటు చేశారు. నగరవన ఉద్యాన యోజన, పాలనాధికారి, ఎన్టీపీసీ సీఎస్సార్, అటవీశాఖలు మంజూరు చేసిన రూ.50 లక్షలతో మొదటగా పనులు చేపట్టారు. ఉద్యానవనాన్ని మరింత అభివృద్ధి చేయాలని, పార్కులో వాకర్స్ ట్రాక్, వుడెన్ షెడ్, పగొడా, పర్క్యులేషన్ ట్యాంకు, బోటింగ్, ఫౌంటెయిన్, నీటి కొళాయిలు, విద్యుత్తు దీపాలు, ఆట పరికరాలు వంటివి ఏర్పాటుకు రూ.4 కోట్లతో అంచనాలు రూపొదించి నిధులు మంజూరు చేయాలని నాలుగేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపించారు. ఇంతవరకు నిధులు మంజూరు కాకపోవడంతో పార్కు అభివృద్ధికి నోచుకోలేదు.

    ఇది చదవండి : జాతకాలు చెప్పుకునే వాడిని అమ్మాయి పేరు అడ్డుపెట్టుకొని చంపారు .. హత్య వెనుక పెద్ద కథే ఉందా



    అరకొర వసతుల మధ్యనే సందర్శకుల అనుమతి:
    ఇక చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా టికెట్టు ద్వారా సందర్శకులను పార్కులోకి అనుమతిస్తున్నారు అధికారులు. అయితే పార్కులో చూసేందుకు ఏమీ లేకుండాపోవడంతో సందర్శకులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్కులో చిన్నారులు ఆడుకునేందుకు ఆట సామగ్రి, క్రీడా పరికరాలు, పర్వతారోహణ(క్లైంబింగ్) టవర్, ప్రధాన ద్వారం ఎదుట రాక్ గార్డెన్ వంటివి గతంలోనే ఏర్పాటు చేశారు. వీటితో పాటు క్లైంబింగ్ రోప్స్, పరికరాలు, శిక్షణ సిబ్బందిని నియమించారు. సందర్శకులను ఆకర్షించేందుకు కలపతో నిర్మించిన విశ్రాంతి భవనం (వుడెన్ హౌస్), పగొడా, వెదురుతో చేసిన కుటీరాలు, విడిది షెడ్లు కూడా నిర్మించారు.

    అన్నీ అస్తవ్యస్థంగా..
    పార్కులో మూడు బోరుబావులు, మినీ ట్యాంకులతో తాగునీరు, కొళాయిలు, విద్యుత్తు, మరుగుదొడ్లు, ఎన్టీపీసీ అందజేసిన సోలార్ దీపాలు,సేద దీరేందుకు బెంచీలు వంటి సౌకర్యాలు కల్పించారు. పక్కనే నర్సరీ ఏర్పాటు చేసి 10 వేల మొక్కలు నాటారు. పార్కు నిర్వహణ, పర్యవేక్షణ చేపట్టేందుకు నిర్వాహకులు, సిబ్బందిని కూడా నియమించారు. ఇంత చేసినా పార్కును తెరవడంతో జరిగిన జాప్యం కారణంగా ఈ సౌకర్యాలన్నీ ఇప్పుడు ధ్వంసం అయ్యాయి. పార్కులో పనిచేసే సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందంటే పరిస్థితి ఎంతలా ఉందొ అర్ధం చేసుకోవాలి.

    పార్కు ప్రవేశ రుసుము:
    పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10లుగా పార్కు రుసుము నిర్ణయించారు. జూన్ 18 నుంచి టికెట్ కొనుగోలు ద్వారా ప్రజల సందర్శనార్ధం పార్కును తెరిచారు. గత 3 రోజుల్లో రోజుకు 30 మందికి పైగా సందర్శకులు పార్కును వీక్షిస్తున్నారు. నిర్వహణ, పర్యవేక్షణ కోసం ముగ్గురు వాచ్‌మాన్, ఒక టికెట్ కలెక్టర్ను నియమించారు. సందర్శకులు పెరిగి ఆదాయం వస్తేనే ఉద్యానవనాన్ని నిర్వహించే అవకాశం ఉంటుంది.

    నిర్వహణ కరువై అసంఘీక కార్యకలాపాలకు అడ్డాగా:
    కరోనా సంక్షోభ సమయం నుంచి జీతాలు అందక, వాచ్‌మెన్‌లు విధులు నిర్వహించక, పార్కు అసంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పర్కులో ఎటు చూసినా ఖాళీ మద్యం సీసాలు, వాడిపడేసిన వాటర్ బాటిల్స్ దర్శనమిస్తున్నాయి. ఎంతో అద్భుతంగా ఉండే ఉడెన్ హౌజ్, రెండేళ్ళ క్రితం వరకూ ఫోటో షూట్‌లతో కళకళలాడింది. ఇప్పుడు ఆ ఉడెన్ హౌస్ తలుపులు, కిటికిలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కరోనా సమయంలో మూతపడ్డ పార్కు ఎట్టకేలకు తిరిగి ప్రారంభం అయినా, సందర్శకులు మాత్రం ఈ ఉద్యానవనానికి రావడం లేదు.

    ఇది చదవండి : మంత్రి కేటీఆర్‌ వస్తున్నారంటే .. వాళ్లు పోలీస్ స్టేషన్‌లో ఉండాల్సిందే ..ఇదెక్కడి విడ్డూరం


    Published by:Siva Nanduri
    First published:

    Tags: Local News, Peddapalli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు