ప్రతి యేటా ఉచితంగా మట్టి గణపతులు పంపిణీ చేయడం సంతోషకరమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన.. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో అమర్నాథ్ అన్నదాన సేవ సమితి ఆధ్వర్యంలో మోహినిపురాలో, ఆ తర్వాత రావిచెట్టు హనుమాన్ దేవాలయంలో గణపతి మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథికా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవ సమితి సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని అన్నారు.
అమర్ నాథ్ లో దక్షిణాది నుంచి అన్నదాన సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ మనదని కొనియాడారు. దక్షిణాది వాళ్లే కాదు.. ఉత్తరాది వాళ్లు మన భోజనానికి, రుచులకు ఫిదా అవుతున్నారని మంత్రి అన్నారు. వరదలు, కొండ చరియలు విరగడం వంటి ప్రమాదాలు జరిగినా.. భయపడకుండా సేవలు మనవాళ్లు సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. కాగా, సంస్థ అధ్యక్షులు ఉప్పల భూపతి దంపతులు గడ్డ కట్టే చలిలో కూడా 25రోజులు అక్కడే ఉండి సేవలు అందించడం గర్వకారణమని అన్నారు. పర్యావరణ పరిరక్షణలోనూ భాగస్వాములు అయ్యారని మంత్రి హరీష్ రావు కొనియాడారు. గ్రామాల్లో అందరూ కలిసి.. ఒక విగ్రహాన్ని పెట్టుకుని.. పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా చేసుకోవాలని నిర్వాహకులను మంత్రి కోరారు.
కేవలం ఇలాంటి సేవా కార్యక్రమాలకే పరిమితం కాకుండా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారని అన్నారు. అమర్నాథ్ యాత్ర విధులు ముగించుకుని.. తిరిగి వెళ్తున్న క్రమంలో సైనికుల బస్ లోయలో పడిపోయి.. 8 మంది చనిపోవడం బాధాకరమని మంత్రి వెల్లడించారు. చనిపోయిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. యాత్రలో తమకు రక్షణగా నిలిచిన సైనికుల కుటుంబాలకు మేము అండగా ఉంటాం అని మన సభ్యులు ముందుకు రావడం సంతోషంగా ఉంది. చనిపోయిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేలా చెక్కును త్వరలో ఐటీబీపీ డీజీకి అందివ్వబోతున్నామని మంత్రి వెల్లడించారు.
ఇంతకు ముందు యాత్ర పర్మిట్ల కోసం హైదరాబాద్, సంగారెడ్డికి పోవాల్సి ఉండేది. ఈ సదుపాయాన్ని సిద్దిపేటకు తెచ్చుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు యాత్ర పర్మిట్ల కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి సిద్దిపేటకు వస్తున్నారు. త్వరలో ఫిట్ నెస్ సర్టిఫికెట్ జారీ చేసే అవకాశం సిద్దిపేటతో పాటు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు వచ్చేలా కృషి చేస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.
,
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ganesha Pooja, Harish Rao, Telangana News