హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: మానసిక వికలాంగులే కానీ.. ఆశ్చర్యపోయేలా స్టేషనరీ వస్తువుల తయారీ

Telangana: మానసిక వికలాంగులే కానీ.. ఆశ్చర్యపోయేలా స్టేషనరీ వస్తువుల తయారీ

X
పెద్దపల్లిలో

పెద్దపల్లిలో మానసిక వికలాంగులకు అండగా చైతన్య సంస్థ

వారు అమ్మ అని పిలవలేరు.. ఆకలి అవుతున్నా అడగలేరు. పుట్టుకతోనే బుద్దిమాంద్యంతో పుట్టి ఎదుగుదలలేని ఆ పిల్లలే మానసిక వికలాంగులు. ఇంట్లో అన్నం పెట్టే తల్లిదండ్రులే విసుక్కుంటారు. అలాంటిది వారిని అక్కున చేర్చుకొని కొండంత అండగా నిలుస్తుంది పెద్దపెల్లి జిల్లా (Peddapalli District) గోదావరిఖనిలోని మనో చైతన్య మానసిక వికలాంగుల కేంద్రం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India

E.Santosh, News18, Peddapalli

వారు అమ్మ అని పిలవలేరు.. ఆకలి అవుతున్నా అడగలేరు. పుట్టుకతోనే బుద్దిమాంద్యంతో పుట్టి ఎదుగుదలలేని ఆ పిల్లలే మానసిక వికలాంగులు. ఇంట్లో అన్నం పెట్టే తల్లిదండ్రులే విసుక్కుంటారు. అలాంటిది వారిని అక్కున చేర్చుకొని కొండంత అండగా నిలుస్తుంది పెద్దపెల్లి జిల్లా (Peddapalli District) గోదావరిఖనిలోని మనో చైతన్య మానసిక వికలాంగుల కేంద్రం. మానసిక వైకల్యం అనగానే ఇక ఆ వ్యక్తి ఎందుకు పనికిరాడు అని అనుకుంటాం..! కుటుంబం, సమాజం కూడా వారిని భారంగానే భావిస్తుంది. అయితే, ఎందుకు పనికిరారు అనుకున్న ఆ పిల్లలే మనో చైతన్యలో అంతా ఆశ్చర్యపోయే పనులు చేస్తుంటారు. పనిచేసే సంస్కృతిని వారికి అలవాటు చేయడం.. వారిని నిరంతరం పనులు చేయించడం ద్వారా వారిలో నూతన ఉత్సాహం నింపుతున్నారు మనో చైతన్య మానసిక వికలాంగుల కేంద్రం నిర్వాహకులు.

మానసిక వైకల్యంతో పుట్టిన కుతురిని చూసి కుమిలిపోయాడు ఓ తండ్రి. అలా అని కుంగిపోలేదు తనలాగే మనోవేదనకు గురవుతున్న తల్లిదండ్రుల కన్నీళ్లను తుడిచే మార్గం గురించి ఆలోచించాడు. ఆయన సంఘర్షణ నుండి పుట్టిందో ఆలోచన. దానికి సింగరేణి యాజమాన్యం ప్రోత్సాహం కూడా తోడైంది. ఫలితంగా మానసిక వికలాంగులకు వృత్తి విద్యను అలవరించి వారికో ఉపాధిని చూపి ఉద్యోగులుగా తీర్చిదిద్దే మహోన్నత లక్ష్యంతో మన చైతన్య కేంద్రం ఆవిర్భవించింది.

ఇది చదవండి: జై భీమ్ అంబేద్కర్ దీక్షలు.. ఈ దీక్షల నియమ నిబంధనలివే..!

మానసిక వికలాంగులకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మనోవేదన అంతా ఇంతా కాదు. తనలాగే ఏ తల్లిదండ్రులు ఈ మనోవేదనకు గురి కావద్దనే ఉద్దేశంతో మానసిక వికలాంగుల కేంద్రం స్థాపించాలని అనుకున్నాడు కృష్ణమూర్తి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కృష్ణమూర్తి ఆలోచనలకు అభినందన తెలిపిన సింగరేణి యాజమాన్యం అతనికి ప్రోత్సాహం అందించి అవసరమైతే నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో 1988వ సంవత్సరంలో మనో చైతన్య కేంద్రం ఏర్పాటు చేశారు. మానసిక వికలాంగులను ప్రయోజకులు తీర్చిదిద్ది వారి కాళ్ళపై వారు నిలబడేలా చేయడమే లక్ష్యంగా వారికి వృత్తి శిక్షణ నేర్పిస్తూ వారి జీవితాల్లో ఆనందోత్సవాన్ని నింపుతున్నారు.

ఇది చదవండి: మట్టిలో మాణిక్యాలు.. ఈ అడవి బిడ్డలు..! ట్రైబల్ స్కూల్ నేషనల్ గేమ్స్

బుక్స్, ఫైల్స్ కవర్లు, కవర్లు ప్యాడ్స్ తయారీ, బైండింగ్ శిక్షణలో ట్రైనింగ్ ఇచ్చి ఇప్పటివరకు కొన్ని వందల మానసిక వికలాంగులను ప్రయోజకులుగా మలిచింది. ఇప్పుడు ఈ కేంద్రంలో 60 మంది మానసిక వికలాంగులు వృత్తి విద్యలో పనిచేస్తున్నారు. వారికి ప్రతిరోజు వేతనం కూడా ఇస్తున్నారు. మనో చైతన్య కేంద్రం ఆవిష్కరకర్త కృష్ణమూర్తి దీక్ష, అంకితభావం ఎందరో జీవితాల్లో వెలుగు నింపడమే కాదు మానసిక వికలాంగులు ఏ పనైనా చేయగలరనే నమ్మకాన్ని కలిగించాయి. ఎంతోమంది ప్రముఖులు ఈ కేంద్రాన్ని సందర్శించి ఈ సామాజిక దృక్పథాన్ని జోహార్లు అందించారు.

కుమార్తె మానసిక వైకల్యమే తన మదిలో ఈ మన చైతన్య కేంద్రాన్ని స్థాపించేలా చేసిందని కృష్ణకుమార్ తెలిపారు. మానసిక వికలాంగులు తల్లిదండ్రులకు ఏమాత్రం భారం కాదని కొద్దిపాటి శిక్షణతో వారి లోపాల్లో నూతన ఉత్సాహాన్ని ఇవ్వచ్చని మనో చైతన్య నిరూపించింది. మనోచైతన్యలో తయారు చేయబడినవి అన్ని కూడా సింగరేణి తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మైన్ లకు ఇక్కడ తయారు చేయబడిన ఫైల్స్, బుక్స్, ప్యాడ్స్, ఎన్వలప్ కవర్లు పోతుంటాయి.

First published:

Tags: Local News, Peddapalli, Telangana