హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: బస్సు క్లీనింగ్ కోసం సరికొత్త టెక్నాలజీ

Peddapalli: బస్సు క్లీనింగ్ కోసం సరికొత్త టెక్నాలజీ

X
అద్దంలా

అద్దంలా మెరిసే బస్సులు

Peddapalli: అర నిమిషం చాలు ఆర్టీసి బస్సుకు పట్టిన దుమ్ము కడిగేస్తూoది. ఇక నుండి ఆర్టీసిలో ఆరోగ్యకరమైన ప్రయాణం . ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖవంతం గమ్యస్థానానికి చేరడం క్షేమం.. ఇదీ ఆర్టీసి సంస్థ నినాదం. కరోనా తర్వాత రానురాను ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే కొంత నిరాధరణ ఎదురవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

santosh, News18, Peddapalli

అర నిమిషం చాలు ఆర్టీసి బస్సుకు పట్టిన దుమ్ము కడిగేస్తూoది ఇక నుండి ఆర్టీసిలో ఆరోగ్యకరమైన ప్రయాణం . ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖవంతం

గమ్యస్థానానికి చేరడం క్షేమం.. ఇదీ ఆర్టీసి సంస్థ నినాదం. కరోనా తర్వాత రానురాను ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే కొంత నిరాధరణ ఎదురవుతోంది. మరీ ముఖ్యంగా పల్లెల్లో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలా రోడ్డు మీద నిలబడగానే అలా ఆటో ఎక్కి వెళ్లిపోతుంటారు. కాసేపు ఆగి బస్సులో వెళ్లామన్నా సదుపాయాలు లేక కిక్కిరిసిన ఆటోల్లోనే సగం కూర్చుని సగం నిల్చుని వెళ్తున్నారు.

ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఆర్టీసి ప్రయాణం చాలా వరకు తగ్గిందని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు అలా కాదు ప్రయాణికుల ఆలోచనలకు తగ్గట్టుగా వారిని ఆకర్షించేందుకు ఆర్టీసి వసతులను కల్పిస్తూ ప్రయాణికుల కోసం కొత్త కొత్త ఆలోచనలతో ఆర్టీసి ముందడుగు వేస్తుంది.

ప్రతి రోజు ఆర్టీసి బస్సు క్లీనింగ్ ...

ఇక ప్రతి రోజూ బస్సును శుభ్రం చేశాకే బయట మార్గానికి బయదేరనుంది. ఇంతకు ముందు బస్సు మనుషులతో కడిగించే వారు. కానీ ఇప్పుడు మనుషులు కడగాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఆర్టీసి సంస్థ కొత్త విధానం తీసుకొచ్చింది. బస్సు వచ్చి అక్కడ ఆటో వాష్ మెషిన్ వద్ద ఆగిందంటే అర నిమిషంలో బస్సును కడిగేస్తుందు..ఇదివరకు మాన్యువల్ గా బస్సును కడిగితే సుమారు 30 నిమిషాల పాటు సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఆ సమయం కాస్తఅర నిమిషం చాలు. మిగితా సమయం ప్రయాణికులకు సమయానికి అనుకూలంగా చేరేందుకు ఉపయోగ పడే విధముగా ఉండేందుకు ఈ సదుపాయం కల్పించారు ఆర్టీసి యాజమాన్యం.

ఆటో మేటిక్ వాష్ మెషిన్ ఎలా పనిచేస్తుంది అంటే....

గోదావరిఖని బస్ డిపోలో ఏర్పాటు చేసినఆటోమేటిక్ వాష్ పాయింట్ ఎలా పని చేస్తుంది అంటే నాలుగు వైపుల ఏర్పాటు చేసిన పై నాలుగు మోటర్లు పెట్టారు. పైపులకు ప్రెషర్ లింక్ ద్వారా హెవీ ప్రేషర్ తో వాటర్ కొడుతుంది. అక్కడే ఏర్పాటు చేసిన బ్రష్ లు వాటర్ కొడుతున్న సమయం బస్సుకు పట్టిన దుమ్మంత క్లీన్ చేస్తుంది. ఇదివరకు మాన్యువల్ గా చేస్తే అరగంట వరకు టైం వెచ్చించాల్సి వచ్చింది. ఇప్పుడు అర నిమిషంలో పూర్తవుతుంది. ప్రయాణికుల సంరక్షణ కోసం ఏ విధమైన సౌకర్యాలు అందిచడానికి అయినా ఆర్టీసి సంస్థ సిద్దంగా ఉందని గోదావరిఖని డిపో మేనేజర్ పి,మల్లేశం అన్నారు. ఇందులో భాగంగానే సుమారు ఐదు లక్షలు వెచ్చించి ఆటో సర్వీస్ పాయింట్ ఏర్పాటు చేశామని అన్నారు. ఆర్టీసి సంస్థ పరిశుభ్రతతో పాటు సురక్షితమైన ప్రయాణానికి సానుకూలంగా ఉంటుందని చెప్పారు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు