హోమ్ /వార్తలు /తెలంగాణ /

గంజాయి మత్తులో యువతి హల్ చల్.. బూతులు తిడుతూ రోడ్డుపై హంగామా..!

గంజాయి మత్తులో యువతి హల్ చల్.. బూతులు తిడుతూ రోడ్డుపై హంగామా..!

గంజాయి మత్తులో యువతి హల్ చల్

గంజాయి మత్తులో యువతి హల్ చల్

గంజాయి మత్తులో యువతి హల్ చల్,, బూతులు తిడుతూ రోడ్డుపై హంగామా.. సృష్టించింది. అంతటితో ఆగకుండా అక్కడున్న వారిపై రాళ్లతో దాడికి దిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India

మద్యం, గంజాయి మత్తులో ఓ యువతి హల్ చల్ చేసింది. అడ్డు వచ్చిన వారి పై బూతులు తిడుతూ,రాళ్ళతో దాడికి దిగింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  కరీంనగర్ కు చెందిన యువతి కరీంనగర్ లో ఆటో కిరాయి తీసుకొని గోదావరిఖనిలోని తన బందువుల ఇంటికి వచ్చింది. చౌరస్తా లో దిగిన ఆ యవతిని ఆటో డ్రైవర్ డబ్బులు అడిగాడు. దీంతో డ్రైవర్ పై ఆమె  బూతుపురాణం మొదలు పెట్టింది.

అంతటితో ఆగకుండా అక్కడ చుట్టుపక్కల ఉన్న రాళ్లతో దాడికి దిగింది. అక్కడ పడి ఉన్న రాళ్లు తీసి ఆటో డ్రైవర్‌పైకి విసిరింది. అడ్డువచ్చిన వారి పై కూడ దాడి చేసింది. అమ్మాయి కావడంతో పాపం ఆ ఆటో డ్రైవర్ ఏం చేయలేక సైలంట్ అయిపోయాడు, చుట్టుపక్కల వాళ్లు వచ్చిన కూడా అమ్మాయిని కంట్రోల్ చేయలేకపోయారు.  దీంతో అక్కడి నుండి మళ్లీ గోదావరిఖని బస్టాండ్ కు వెళ్లింది. అక్కడ కూడ ముగ్గురు ఆటో డ్రైవర్ల పై దాడి చేసింది.  ఆటో డ్రైవర్లు గోదావరిఖని వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.,పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతి బ్యాగును పరిశీలించగా మద్యం సీసా లభ్యమైంది.యువతి బ్యాగులో మద్యం బాటిళ్లు చూసి అంతా అవాక్కయ్యారు.

అయితే ఆ యువతి మద్యంతో పాటు గంజాయి సేవించిన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో గమ్యాన్ని చేర్చిన ఆటో డ్రైవర్ కు డబ్బులు ఇవ్వకపోగా,బూతులు తిడుతూ ,దాడికి పాల్పడి యువతి హల్ చల్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు. ఆమె తల్లిదండ్రులకు, బంధువులకు కాల్ చేసి విషయం చెప్పారు.

First published:

Tags: Ganja case, Karimnagar, Local News

ఉత్తమ కథలు