Home /News /telangana /

PEDDAPALLI INDANE GAS INTRODUCES LIGHT WEIGHT FIBER GAS CYLINDER IN MARKETS FULL DETAILS HERE PSE BRV PRV

Peddapalli: మార్కెట్‌లోకి ఫైబర్‌ సిలిండర్‌ వచ్చేసింది.. బరువు తక్కువ.. మన్నిక ఎక్కువ..!

ఫైబర్‌

ఫైబర్‌ గ్యాస్‌ సిలిండర్‌

వంటింట్లోకి సరికొత్త సిలిండర్‌ వచ్చేసింది. సిలిండర్‌ ఎప్పుడైపోతుందో అనే భయం లేదు..ఎప్పుడు అయిపోతుందో మీ కంటికే కనిపిస్తుంది. అంతేకాదు ఈ స్మార్ట్‌ సిలిండర్‌ను మీరే ఒంటి చేత్తో మోసుకెళ్లొచ్చు. ఇంతకీ ఈ సరికొత్త స్మార్ట్‌ సిలిండర్ విశేషాలేంటి..?

ఇంకా చదవండి ...
    (E. Santhosh, News 18, Peddapalli)

    మార్కెట్లోకి కొత్త వంట గ్యాస్ (Gas) వినియోగంలోకి వచ్చింది. ఈ గ్యాస్ సిలెండర్ వినియోగదారులకు వాడటానికి ఎంతో సులభంగా మరియు అతి తక్కువ బరువుతో ఉంటుంది. అంతే కాకుండా ఈ సిలిండర్‌లో గ్యాస్ ఎక్కడి వరకు ఉంది అని కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్‌ (gas cylinder)ను మోయాలంటే చాలా ఇబ్బంది.. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లో ఉండే వాళ్లు, పై అంతస్థుల్లో ఉండే వాళ్లు సిలిండర్‌ను పైకి తీసుకెళ్లాలంటే చెమటోర్చాల్సిందే.. అయితే ఇప్పుడు ఆ బాధల నుంచి విముక్తి దొరకనుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఇనుముతో తయారు చేసిన ఎల్‌పీజీ సిలిండర్ల స్థానంలో.. ఫైబర్‌ సిలిండర్లు (Fiber Cylinders) వచ్చేశాయి. ఇండేన్‌ సంస్థ (Indane company) వీటిని అందుబాటులోకి తీసుకొచ్చి విక్రయిస్తోంది. అయితే ఇందులో కేవలం 10 కిలోలు, 5 కిలోలు మాత్రమే ఉన్నాయి. వీటి ధర కూడా కొంచెం ఎక్కువగానే ఉంది.

    బరువు తక్కువే..కానీ ధరే…!

    10 కిలోల ఫైబర్ సిలిండర్‎కు రూ.3,350 ఉండగా.. 5 కిలోల సిలిండర్‎కు రూ.2,150 అడ్వాన్స్ చెల్లించాలి. వినియోగదారులు ఇప్పటికే వాడుతున్న పాత సిలిండర్లను తిరిగి ఇచ్చి వీటిని తీసుకోవచ్చని శ్రీ మయి గ్యాస్ ఏజెన్సీ సంస్థ ప్రతినిధులు (Representatives of Shree Mai Gas Agency Company) తెలిపారు. బుకింగ్‌ చేసుకున్న గంటల వ్యవధిలోనే ఇళ్లకు సరఫరా చేస్తామన్నారు. రూ.670 చెల్లించి 10 కిలోల సిలిండర్‌, రూ.330 చెల్లించి ఐదు కిలోల సిలిండర్‌లో గ్యాస్‌ (gas) నింపించుకోవచ్చని చెప్పారు.

    ఇనుముతో పోలిస్తే ఫైబర్‌ బెటరే..!

    ఇనుముతో తయారు చేసిన సిలిండర్ (Cylinder) పైకి ఎత్తడం కష్టం.. కానీ ఫైబర్ సిలిండర్ పైకి సులభంగా ఎత్తుకోవచ్చు. ఖాళీ ఇనుప సిలిండర్ బరువు 16 కిలోలు ఉండగా.. ఫైబర్ సిలిండర్ 6.3 కిలోలే ఉంటుంది. మామూలు సిలిండర్‎లో గ్యాస్ కనిపించదు. కానీ ఫైబర్ సిలిండర్‎లో గ్యాస్ కనిపిస్తుంది.

    ఇనుప సిలిండర్ మంటలు అంటుకుంటే పేలిపోయే ప్రమాదం ఉంది. కానీ ఫైబర్ సిలిండర్ పేలదు. ఇనుప సిలిండర్ తుప్పు పడుతుంది, మరలు ఏర్పడతాయి. కానీ ఫైబర్ సిలిండర్ (Fiber cylinder) ఎలాంటి మరకలు ఉండవు. వచ్చే కొన్ని రోజుల్లో పూర్తిగా ఫైబర్ గ్యాస్‌లు మాత్రమే వినియోగంలోకి వస్తాయని చెప్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Gas, Indane Gas, Local News, Lpg Cylinder Price, Peddapalli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు