(E. Santosh, News 18, Peddapalli)
డబ్బులు సంపాదించాలని అన్న ఆశ ఎవరికి ఉండదు? ఉద్యోగం చేసో లేక వ్యాపారం చేసో డబ్బు సంపాదించి జీవితంలో ఎదగాలని అందరూ భావిస్తుంటారు. కానీ ఓ యువతీ మాత్రం దురాశతో, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఏకంగా గంజాయి స్మగ్లింగ్ (Ganja Smugling) ప్రారంబించింది. చివరికి పోలీసులకి చిక్కి కటకటాల పాలైంది. రామగుండం కమిషనరేట్ మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతీ (Woman) గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. ఈ మేరకు మంచిర్యాల బస్టాండ్‌లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆకుల అశోక్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఆది మధుసూదన్ తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. గంజాయి తరలిస్తూ యువతీ (Woman) పోలీసులకు చిక్కింది.
అనంతరం ఆమెను విచారించగా, మహారాష్ట్రలో గంజాయిని కొనుగోలు చేసి మంచిర్యాలలో యువతకి అమ్ముతున్నట్లు వివరించింది. యువతి వద్ద నుండి 4 కేజీల గంజాయి,సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం యువతిని మంచిర్యాల (Mancherial) పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
ఇద్దరు యువకుల అరెస్ట్..
రామగుండం (Ramagundam) పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి (Peddapalli) జోన్ ఏన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలకలపల్లి గేట్ ప్రాంతంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులను ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ గిరిప్రసాద్ వెల్లడించారు. ఖాజీపల్లికి చెందిన మేకల అభినవ్ యాదవ్, పెయింటింగ్ పనిచేస్తూ జీవిస్తున్నాడు. గతంలో ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. ఇతని మిత్రుడు కర్నూల్ సొల్మాన్ రాజ్‌తో కలిసి జల్సాలకు అలవాటు పడ్డారు. వచ్చే డబ్బులు జల్సాలకి సరిపోక పోవడంతో ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలని ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి తీసుకువచ్చి, చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఒక్కొక్క ప్యాకెట్ రూ. 500లకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుండి 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ganja smuggling, Local News, Peddapalli, Police arrest, Ramagundam, WOMAN