Home /News /telangana /

PEDDAPALLI IN PEDDAPALLI THE SON IN LAWS FATHER WAS KILLED BECAUSE HE WAS OBSTRUCTING THE DAUGHTERS MARRIAGE ABH BRV PSE

Peddapalli: అల్లుడి తండ్రిని హతమార్చి, ఆపై దొంగల పనిగా చిత్రీకరించి: పోలీసులు ఎలా పట్టుకున్నారంటే!!

స్వాధీనం చేసుకున్న నగదు చూపిస్తున్న పోలీసులు

స్వాధీనం చేసుకున్న నగదు చూపిస్తున్న పోలీసులు

కూతురు కాపురానికి అడ్డొస్తున్నాడని అల్లుడి తండ్రిని హత్య చేశాడు ఓ తండ్రి. రామగుండం కమిషనరేట్ సీసీసీ నాస్పుర్ కాలనీలో బుధవారం జరిగిన ఈ హత్య, సినిమా కథను తలపిస్తుంది. పోలీసులు వెల్లడించిన వివరాలు మేరకు...

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India
    (E.Santosh, News 18, Peddapalli)

    కూతురు కాపురానికి అడ్డొస్తున్నాడని అల్లుడి తండ్రిని హత్య చేశాడు ఓ తండ్రి. రామగుండం కమిషనరేట్ సీసీసీ నాస్పుర్ కాలనీలో బుధవారం జరిగిన ఈ హత్య, సినిమా కథను తలపిస్తుంది. పోలీసులు వెల్లడించిన వివరాలు మేరకు... హన్మకొండ హాసన్‌పర్తి మండలం జయగిరి గ్రామానికి చెందిన లింగాల రాజు ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు సాయితేజను సీసీసీ నాస్పుర్ కాలనీకి చెందిన పిడిషెట్టి శ్రీధర్‌కు ఇచ్చి వివాహం చేశాడు. కొంత కాలానికి శ్రీధర్, సాయితేజల మధ్య మనస్పర్ధలు ఏర్పడి గొడవలకు దారి తీయడంతో సాయితేజ పుట్టింటికి వెళ్లిపోయింది.



    ఈక్రమంలో శ్రీధర్... సాయి తేజ నుండి విడాకులు కోరుతూ కోర్టులో కేసు నమోదు చేయగా కేసు విచారణలో ఉంది. కాగా, తన కూతురు కాపురం చెడిపోవడం జీర్ణించుకోలేకపోయిన లింగాల రాజు... అల్లుడి కుటుంబాన్ని అంతమొందించాలనుకున్నాడు. తన కొడుకు, కూతురుతో కలిసి హన్మకొండ నుండి సీసీసీ నాస్పుర్ వచ్చి... ముగ్గురు కలిసి అనుకున్నట్లే శ్రీధర్ తండ్రిని గొంతు నులిమి హత్య చేశారు. ఇందులో ఎవరికీ అనుమానం రాకుండా ఇంటిలో దొంగలు పడినట్లు నమ్మించేలా ఇంట్లోని బంగారం, డబ్బులు మాయం చేసి, దుండగులే ఇలా చేశారని నమ్మే విధముగా చిత్రీకరించారు. అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళ్ళిపోయారు.

    తదుపరి రోజున ఏమి ఎరుగని వారిలా అంత్యక్రియలకు యధావిధిగా హాజరయ్యారు. అప్పటికే వీరి పై అనుమానం ఉండగా, చావు ఇంట మరి కాస్త హడావిడి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ఎంక్వైరీ చేయగా నిందితులు నిజాలను ఒప్పుకున్నట్లు డీసీపీ మహాజన్ తెలిపారు. ఈ కేసులో నిందితులు దోచుకున్న 119 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

    Read this: Rajanna Sircilla: పరిమళాలు వెదజల్లే పట్టుచీర… చేనేత కార్మికుడి అద్భుత ప్రతిభ
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Peddapalli, Telangana

    తదుపరి వార్తలు