(santosh,News18,Peddapalli)
ప్రపంచ వ్యాప్తంగా కేఎఫ్‌సీ చికెన్(kfc Chicken) అంటే తెలియని వారుండరు. విదేశాల్లో ఎంతో పాప్యులర్ అయిన ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కొన్నేళ్ల క్రితమే మన దేశంలోకి వచ్చింది. మెత్తటి చికెన్‌పై శనగపిండి, ఇతర మసాలాలు దట్టించి సలసల కాగే నూనెలో వేయించుతారు. దీంతో చికెన్ ఎంతో రుచిగా మారిపోతుంది. నగరాల్లో నాన్ వెజ్ ప్రియులు కేఎఫ్‌సీ చికెన్ చూసి లొట్టలు వేయకుండా ఉండలేరు. ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెద్ద సంఖ్యలో కేఎఫ్‌సీ అవుట్ లెట్స్ ఓపెన్ చేసినప్పటికీ ఆ ఫాస్ట్ ఫుడ్ రుచులు పెద్ద నగరాల్లో నివసించే ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉండేది. చిన్న నగరాల్లో ఈ కేఎఫ్‌సీ రెస్టారెంట్స్ దాదాపుగా కనిపించవనే చెప్పాలి. ఇక కేఎఫ్‌సీని ఆదర్శంగా తీసుకుని పెద్దపల్లి(Peddapalli)జిల్లాకు చెందిన ఓ యువకుడు తానే స్వయంగా ఫ్రైడ్ చికెన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. కేఎఫ్‌సీ రుచికి ఏ మాత్రం తీసిపోకుండా ఫ్రైడ్ చికెన్(Fried Chicken Center) తయారు చేసి స్థానికంగా వినియోగదారులను ఆకర్షిస్తున్నాడు.
గోదావరిఖనిలో ఫ్రైడ్ చికెన్ రుచులు:
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సతీష్ అనే యువకుడు స్థానికంగా ఐఎఫ్‌సీ అనే చికెన్ స్నాక్ పాయింట్ ఏర్పాటు చేశాడు. పట్టణాలు, నగరాల్లో ఫ్రైడ్ చికెన్ పై వినియోగదారుల్లో ఉన్న డిమాండ్‌ను గ్రహించి గోదావరిఖని వాసులకు ఆ రుచిని అందించాలని సతీష్ ఇక్కడ ఈ ఐఎఫ్‌సీ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన చికెన్ స్నాక్స్ అందుబాటులోకి తీసుకురావడంతో సమీప ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ ఫ్రైడ్ చికెన్ ను టేస్ట్ చేస్తున్నారు. స్థానిక వినియోగదారులే కాకుండా జిల్లా వ్యాప్తంగా తమకు ఆర్డర్స్ వస్తున్నాయని చెప్తున్నారు ఐఎఫ్‌సీ నిర్వాహకులు. చికెన్ లాలీపాప్, చికెన్ కబాబ్, పోప్ చికెన్, చికెన్ బర్గర్, వెజ్ బర్గర్, ఫింగర్ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రైస్ తో పాటు పలురకాల డ్రింక్స్ కూడా ఐఎఫ్‌సీలో అందుబాటులో ఉన్నాయి.
\"నాకు తెలిసినంత వరకు ఐఎఫ్‌సీ చికెన్‌లో దొరికే ఐటమ్స్ పెద్ద నగరాల్లో మాత్రమే దొరుకుతాయి. ఐఎఫ్‌సీ లేకముందు ఇక్కడ చికెన్ స్నాక్స్ అందుబాటులో లేవు. ఇక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా చికెన్ స్నాక్స్ ఆస్వాదిస్తున్నారు. మాకు స్థానికంగానూ, జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి చికెన్ స్నాక్స్ కొరకు ఆర్డర్స్ వస్తుంటాయి\" అని ఇక్కడ చెఫ్‌గా పనిచేస్తున్న అశోక్ వివరించారు.
\"నేను మా పిల్లల కొరకు స్నాక్ తీసుకెళ్లడానికి ఇక్కడికి వస్తాను. ఐఎఫ్‌సీ చికెన్ ఎంతో రుచిగా ఉంటుంది. దాదాపు ఇలాంటి స్నాక్స్ హైదరాబాద్ వంటి నగరాల్లోనూ, పేరొందిన హోటల్స్‌లో మాత్రమే దొరుకుతాయి. కానీ గోదావరిఖని ఐఎఫ్‌సీ ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు రుచికరమైన చికెన్ స్నాక్స్ అందిస్తున్నారు\" అని సత్యనారాయణ అనే వినియోగదారుడు తెలిపారు.
ఐఎఫ్‌సీ స్నాక్స్, గోదావరిఖని. ఫోన్ నెంబర్ 9133290350.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chicken, Local News, Peddapalli