హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: పూజించిన చోటే వినాయకుడికి నిమజ్జనం అయితే ఆ మట్టిని ఏం చేస్తారో తెలుసా?

Peddapalli: పూజించిన చోటే వినాయకుడికి నిమజ్జనం అయితే ఆ మట్టిని ఏం చేస్తారో తెలుసా?

పెద్దపల్లి

పెద్దపల్లి గణేశ్​ ఉత్సవాలు

ఇటీవలి కాలంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా విగ్రహాల నిమజ్జనం సవాలుగా మారుతుంది. ఈక్రమంలో విగ్రహాన్ని ప్రతిష్టించి, తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించిన చోటే నిమజ్జనం చేస్తున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Peddapalle, India

  (E. Santosh, News 18, Peddapalli)

  దేశ వ్యాప్తంగా ఢిల్లీ నుండి గల్లీ దాకా వినాయక నవరాత్రి ఉత్సవాలు (Ganesh Chaturthi celebrations) ఘనంగా జరుగుతున్నాయి. వినాయకుడిని పూజిస్తే విఘ్నాలను తొలగించి విజయాలే లభిస్తాయనేది ప్రజల విశ్వాసం. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే వినాయకుడి పూజలో ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. నవరాత్రుల అనంతరం వినాయక విగ్రహ నిమజ్జనం Gnesh Statue Immersion) చేస్తారు. వినాయకుడి నిమజ్జనం అంటే ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. భారీ శోభా యాత్రతో డప్పు వాయిద్యాలతో వినాయకుడిని ఊరేగిస్తూ ఉత్సాహంగా వేడుక నిర్వహిస్తారు. అయితే ఇటీవలి కాలంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వినాయక విగ్రహాలు (Ganesh Statues) ఏర్పాటు చేస్తున్నారు. ఆయా విగ్రహాల నిమజ్జనం సవాలుగా మారుతుంది. ఈక్రమంలో విగ్రహాన్ని ప్రతిష్టించి, తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించిన చోటే అటువంటి భారీ గణనాథుడికి నిమజ్జనం చేస్తున్నారు.

  పెద్దపల్లి (Peddapalli) జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతూన్నాయి. జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజుల తరువాతే వినాయక నిమజ్జనం చేయడానికి ఇష్టపడతారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి గోదావరిఖని చేరుకునే విగ్రహాలు (Statue) గోదావరిలో నిమజ్జనం చేస్తుంటారు. ఏ ఏడాది పెద్దపల్లి పట్టణంలో భారీ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

  Bhadrachalam: లోగుట్టు పెరుమాళ్ళకెరుక: రూ. 100 కోట్ల చేరువలో భద్రాచల ఆలయ ఆడిట్ అభ్యంతరాలు?

  స్థానిక ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 45 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. కలకత్తా నుంచి వచ్చిన కళాకారులు సుమారు 50 రోజుల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు అందుకున్న విఘ్నేశ్వరునికి.. పూజలు అందుకున్న చోటే నిమజ్జనం (Nimajjanam) నిర్వహించనున్నారు.

  Rajanna Sircilla: అయోధ్య రామ మందిరంలో కొలువైన గణేశుడు: సిరిసిల్ల కళాకారుడి అద్భుత ప్రతిభ 

  పర్యావరణం పై అవగాహన కల్పిస్తూ గత 5 సంవత్సరాలుగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడి నిమజ్జనం నిమిత్తం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫైర్ ఇంజన్లతో నీటిని తెచ్చి..విగ్రహంలోని మట్టిని కరిగిస్తు నిమజ్జనం (Immersion) నిర్వహిస్తారు. విగ్రహం పూర్తిగా కరిగి మట్టి రూపంలోకి మారిన అనంతరం ప్రజలు ఆ మట్టిని స్వీకరించి పంట పొలాల్లో, ఇళ్లలోని మొక్కలకు వేసుకుంటారు. ఇలా చేయడం వలన మొక్కలను, పర్యావరణాన్ని రక్షించిన వారమౌతామని స్థానికులు అంటున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Ganesh Chaturthi​ 2022, Local News, Peddapalli

  ఉత్తమ కథలు