రిపోర్టర్ : సంతోష్
లొకేషన్ : పెద్దపల్లి
జనవరి మాసంలో.. చలి గజగజ వణికిస్తున్న సమయంలో వేడి వేడి మిర్చి బజ్జీలు తినాలని మనసు లాగేస్తూ ఉంటుంది. బయట ప్రపంచాన్ని చూస్తూ తినాలని చూసే వాళ్ళు కొంతమంది.. ప్రకృతిని ఆస్వాదిస్తూ వేడి వేడి మిర్చి తినాలనుకొనే వాళ్ళు కొంతమంది ఇలా రకరకాలుగా ఉంటారు. అందునా మంచి టేస్టీ బజ్జీ దొరుకుతుందంటే.. కాస్త దూరమైనా పర్లేదు అక్కడికి వెళ్లి తినాలని భావిస్తారు. టేస్ట్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ కూడా ఉందంటే ఇంకెందుకు ఆగుతారు!ఇదిగో ఈ స్టోరీ అలాంటిదే.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రాయల్ మిర్చి పాయింట్ లో మాస్టర్ గా పనిచేసేకిషోర్ అనే వ్యక్తి ఒకపక్క బజ్జీలు వేస్తూనే వింత వింతగా డాన్స్ లు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ప్రతి రోజు సాయంత్రం కాగానే మిర్చి దుకాణంలో పాటలు పెట్టి డీజే స్టెప్పులు వేసుకుంటూ ఆకర్షిస్తూ మిర్చి బజ్జీలు అమ్మకం సాగిస్తున్నాడు. తలపై టోపీ పెట్టుకుని కొత్త కొత్త పాటలు పెడుతూ డాన్స్ చేస్తూ పని కూడా ఆడుతూ పాడుతూ స్పీడ్ గా చేస్తాడు.
రుచికరమైన మిర్చీలు..
రాత్రి ఏడు గంటలైతే చాలు ఆ ప్రాంతమంతా కమ్మని సువాసనలు వెదజల్లుతుంది. అటుగా వెళ్తున్నవారంతా ఆ వాసన ఏంటా అనుకుంటూ అక్కడకు వస్తారు.ఏ సీజన్‌లో అయినా ఆ బజ్జీల రుచి చూడాల్సిందే. స్వచ్ఛమైన మిర్చి బజ్జీ రుచి చూడటం కోసం ఇక్కడ కస్టమర్లు బారులు తీరతారు. గోదావరిఖని వాసులకు, బజ్జీ ప్రియులకు 30 సంవత్సరాలుగామిర్చి విందు చేస్తూ వ్యాపారాన్నిసాగిస్తూ అక్కడే ఉపాధి పొందుతున్నాడు. ఇక్కడి బజ్జీల కోసం గంటల తరబడి క్యూలో నిలబడి మరీ కొని తింటారు. వ్యాపారం చిన్నదే అయినప్పటికీ చేసే పద్ధతిలో తన పని తనాన్ని చూపుతూ ప్రతి రోజూ 25 కిలోల పిండి మిర్చి బజ్జీలు అమ్మకం సాగిస్తాడు.
బాధ్యతలో కూడా ఆకర్షణీయంగా..
ఓ వైపు పని చేస్తూనే మరో వైపు డీజే స్టెప్పులతో ఆకర్షిస్తారు కిషోర్. ఈ మాస్టర్ గత 30 ఏళ్లుగా మిర్చి బజ్జీ మాస్టర్ గా జీవనం సాగిస్తున్నాడు. చేసే పనిని ఆనందంగా, ఉత్సాహంగా చేస్తే ఆరోగ్యం కూడా ఉంటుంది అంటున్నారు కిషోర్. కిషోర్ బజ్జీల టేస్ట్ కి, కిషోర్ డాన్స్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana