Home /News /telangana /

PEDDAPALLI HIGH PROFITS ON CLOTH BAG MANUFACTURING EMPLOYMENT OPPORTUNITIES FOR YOUTH ABH BRV PSE

Peddapalli: క్లాత్ బ్యాగ్ తయారీతో మంచి లాభాలు: ఉపాధి మార్గంగా ఎంచుకున్న యువకుడు

క్లాత్

క్లాత్ బ్యాగ్ తయారీ విధానం

ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడంతో చాలా వరకు వాటి ప్రత్యామ్న్యాయాలపై దృష్టి పెడుతున్నారు. దీంతో ఇటీవలి కాలంలో క్లాత్ బ్యాగ్స్‌కి గిరాకీ పెరిగింది. ఆయా బ్యాగ్స్ తయారీ కోసం ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రభుత్వాలు సైతం త్వరగా అనుమతులు ఇవ్వడమే కాకుండా

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India
    E.Santosh, News 18, Peddapalli

    ప్రస్తుతం పర్యావరణాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్‌(plastic waste) ఒకటి. ప్లాస్టిక్ కారణంగా ఎన్నో ప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ఉదయం పాల ప్యాకెట్‌తో మొదలెడితే పడుకునే వరకూ మన జీవితాల్లో భాగంగా మారింది ప్లాస్టిక్. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో కేవలం 40 ఏళ్లలో భూమిపై పెను మార్పులు సంభవించాయి. దీంతో ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ను నిషేధించాయి. అందుకు ప్రత్యామ్న్యాయంగా క్లాత్, జ్యూట్ బ్యాగులు వాడాలని పిలుపునిచ్చాయి.

    క్లాత్ బ్యాగ్స్‌కి పెరుగుతున్న గిరాకీ:
    ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడంతో చాలా వరకు వాటి ప్రత్యామ్న్యాయాలపై దృష్టి పెడుతున్నారు. దీంతో ఇటీవలి కాలంలో క్లాత్ బ్యాగ్స్‌కి (cloth bags) గిరాకీ పెరిగింది. ఆయా బ్యాగ్స్ తయారీ కోసం ఏర్పాటు చేసే పరిశ్రమలకు (industries) ప్రభుత్వాలు సైతం త్వరగా అనుమతులు ఇవ్వడమే కాకుండా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన రాయితీలతో రుణాలను అందించి ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా చేతి సంచుల అవసరం పెరిగిపోతున్న క్రమంలో ఈ క్లాత్ బ్యాగ్స్ తయారీతో మంచి లాభాలను పొందడానికి ఇదే అనువైన సమయంగా భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో పలు క్లాత్ బ్యాగ్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచే ఆర్డర్ పై క్లాత్ బ్యాగ్స్ పంపిణీ సాగుతుంది. ఇందులో మంచి లాభాలు వస్తుండడంతో క్లాత్ బ్యాగ్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా పలువురికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు తయారీదారులు.

    ముడిసరుకు కొనుగోలు:
    ఈ క్లాత్ బ్యాగ్‌ల తయారీకి అవసరమైన ముడిసరుకు జనపనార. పశ్చిమబెంగాల్ కలకత్తా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తమకు హైదరబాద్ అన్ని విధాల దగ్గరగా ఉండడంతో అక్కడి హోల్ సేల్ మార్కెట్స్ నుండి కొనుగోలు చేస్తామని పరిశ్రమ నిర్వాహకుడు నరేందర్ తెలిపాడు. హోల్ సేల్ మార్కెట్ నందు జనపనార విరివిగా అందుభాటులో ఉంటుంది. దీనిని మార్కెట్ నుండి సేకరించి.. కస్టమర్ల ఆర్డర్‌ను బట్టి అవసరమైన కొలతలలో కత్తిరించుకోవాలి. తర్వాత దానిని ఆఫ్‌సెట్ ప్రింటింగ్ ద్వారా నచ్చిన డిజైన్ దానిపై ప్రింట్ చేస్తారు. లేదా రంగు రంగుల బట్టలతో దానిపై కుట్టుమిషన్ సహాయంతో మంచి డిజైన్‌తో బ్యాగును సిద్ధం చేసుకోవచ్చు. అలా తయారైన బ్యాగులను సమీప రిటైలర్ షాపులలో అమ్మడం లేదా ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారానైనా అమ్ముకోవచ్చని నరేందర్ తెలిపారు.

    Read this also; TS Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.., ఈ జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

    మార్కెట్లో టోకు రోల్స్ రూపంలో రెడీ క్లాత్ లభిస్తుంది. మెషిన్ పై పెట్టి అనువైన సైజులోకి వచ్చాక "W" షేప్‌తో కత్తిరించి బ్యాగ్ అవుట్ పుట్ ఇస్తామని నరేందర్ తెలిపాడు. బ్యాగ్ పూర్తిగా సిద్ధం అయ్యాక లోగోలు, డిజైన్‌లు ప్రింట్ చేసి వాటిని కడిగి ఆరబెట్టాలి. తర్వాత హెవీ కుట్టుమిషన్ సహాయంతో దానిని రంగు రంగుల అద్దాల బట్టలు, జిప్‌లు, అతుకులతో కుట్టి కావాల్సిన మోడల్ తీసుకొస్తామని నరేందర్ తెలిపాడు. క్లాత్ బ్యాగ్ తయారీ కేంద్రంలో ప్రత్యక్షంగా 50 మంది వరకు, పరోక్షంగా 100 మంది వరకు ఉపాధి పొందుతున్నారని, ప్రభుత్వం మరింత సహకరిస్తే మరికొంతమందికి ఉపాధి కల్పించవచ్చని పరిశ్రమ నిర్వాహకులు అంటున్నారు. జ్యూట్ బ్యాగ్స్ తయారీదారుడు నరేందర్ కుమార్ ఫోన్ నెంబర్ : +91 84999 91621
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Bussiness Tips, Local News, Peddapalli, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు