హోమ్ /వార్తలు /తెలంగాణ /

Petrol: మీ బండిలో పెట్రోల్ మంచిదేనా? లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

Petrol: మీ బండిలో పెట్రోల్ మంచిదేనా? లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

పెట్రోల్ క్వాలిటీ తెలుకోవడం ఎలా..?

పెట్రోల్ క్వాలిటీ తెలుకోవడం ఎలా..?

ఈ మధ్య రోజుల్లో పెట్రోల్ (Petrol) లేదా డీజిల్ (Deisel) వ్యాపారం అధికంగా పెరిగిన సంగతి తెలిసిందే. అన్నిటి లాగే ఇది కూడా మార్కెట్లో భారీగా డిమాండ్ ఉన్న వ్యాపారం. దీంతో ఈ వ్యాపారం లో అనేక మోసాలు జరుగుతుంటాయి. వాహన దారులు ఆ మోసాల నుండి తప్పించుకోవాలంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India

E.Santosh, News18, Peddapalli

ఈ మధ్య రోజుల్లో పెట్రోల్ (Petrol) లేదా డీజిల్ (Deisel) వ్యాపారం అధికంగా పెరిగిన సంగతి తెలిసిందే. అన్నిటి లాగే ఇది కూడా మార్కెట్లో భారీగా డిమాండ్ ఉన్న వ్యాపారం. దీంతో ఈ వ్యాపారం లో అనేక మోసాలు జరుగుతుంటాయి. వాహన దారులు ఆ మోసాల నుండి తప్పించుకోవాలంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. పెట్రోల్ లేదా డీజిల్ నాణ్యతను తనిఖీ చేసే హక్కు వాహనదారులకు ఉంటుంది. నాణ్యతను చెక్ చేయడానికి ఫిల్టర్ పేపర్ టెస్ట్ కోసం పెట్రోల్ పంప్‌లోని మేనేజర్ లేదా సిబ్బందిని అడిగే హక్కు ప్రతి వినియోగదారులకి ఉంటుంది. సరైన మొత్తంలో పెట్రోల్ లేదా డీజిల్ ఇస్తున్నారా.. లేదా అని మీరు చెక్ చేసుకోవచ్చు.ప్రతి పెట్రోల్ పంపులో పెట్రోల్ లేదా డీజిల్ పరిమాణాన్ని కొలవడానికి 5 లీటర్ల జార్ ఉంచాలి.

మీ ట్యాంక్ ‌లో పెట్రోల్ క్వాంటీటిని చెక్ చేసుకుని మోసాలకు దూరంగా ఉండవచ్చు.పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసిన తరువాత బిల్‌ ప్రింట్ తీసుకునే హక్కు వాహనదారులకు ఉంటుంది. మీరు కొనుగోలు చేస్తున్న పెట్రోల్ లేదా డీజిల్ సాంద్రత గురించి కూడా తెలుసుకోవచ్చు. అది పెట్రోల్ వెండింగ్ మెషిన్‌పై కూడా రాసి ఉంటుంది.అంతేకాకుండా పెట్రోల్ బంకుల్లో కొన్ని ఉచిత సేవలను పొందొచ్చు. ఖచ్చితంగా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. తాగునీటి సౌకర్యం లేకపోతే.. చమురు మార్కెటింగ్‌ సంస్థకు కంప్లైంట్ చేయవచ్చు. వాహనాల టైర్లలో ఉచితంగా గాలి నింపాలి. ప్రథమ చికిత్స పెట్టెను అందుబాటులో ఉంచాలి. పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. పెట్రోల్ లేదా డీజిల్‌ కొనుగోలు చేస్తున్న దాంట్లో 4 నుంచి 8 పైసల వరకు వీటి నిర్వహణకు చెల్లిస్తున్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో ఉచితంగా ఫోన్ చేసుకునే సదపాయం కూడా కల్పించాలి.

ఇది చదవండి: ఈ సాఫ్ట్‌వేర్ రైతు ఐడియా అదుర్స్.. సేంద్రియ సాగుతో లాభాల పంట

పెట్రోల్, డీజిల్ కొట్టించేటప్పుడు ఇవి చూసుకోవాలి..!

మీరు మీ బండిలో పోయించే పెట్రోల్ లేదా డీజిల్ నాణ్యమైందేనా అనేది తెలుసుకోకపోతే మీ వాహనం తొందరగా మూలన పడే ప్రమాదం పొంచి ఉన్నట్లే. మరి.. మీరు నింపుకొనే ఇంధనం వాటి క్వాలిటీ తెలుసుకోవడం ఎలా అంటే.. దానికి సమాధానం చాలా సింపుల్. మీరు బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకునేటప్పుడు మీటర్లో డెన్సిటీ అని ఉంటుంది. డెన్సిటీ అంటే సాంద్రత. పెట్రోల్ అయితే 730-770 kg/m3.. డీజిల్ అయితే 820-860 kg/m3 ఉండాలి. ఇంతకంటే తక్కువ విలువ ఉన్న పెట్రోల్ లేదా డీజిల్ మీ వాహనంలో పోయిస్తే.. త్వరగా వాహనం పాడైపోయే ప్రమాదం ఉంటుంది. మన దగ్గర చాలా చోట్ల బంకుల్లో ఈ వాల్యూ పెట్రోల్, డీజిల్ రెండింటికీ ఒకేలా ఉంటుంది. అది కరెక్ట్ కాదు. కాబట్టి.. ఈసారి మీరు పెట్రోల్, డీజిల్ పోయించేటప్పుడు దాని డెన్సిటీ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి.

First published:

Tags: Local News, Peddapalli, Petrol, Telangana

ఉత్తమ కథలు