E.Santosh, News18, Peddapalli
విద్యార్థులతో కళకళలాడాల్సిన పాఠశాల.. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేక వెలవెలబోతుంది. పెద్దపల్లి జిల్లా (Peddapalli District) ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ స్కూల్ లో ఒకే ఉపాధ్యాయుడు, విద్యార్థి పాఠశాలకు హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. ఒక్కో క్లాస్ పూర్తి కాగానే ఆ విద్యార్థి బడి గంట కొట్టడం, తిరిగి మరో క్లాస్ సబ్జెక్టు వినడం జరుగుతుంది. ఉపాధ్యాయులు లేక పిల్లలని పాఠశాలకు పంపించడం లేదని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు రేపటి దేశ భవిష్యత్‌కు దివిటీలు లాంటి వారు. ఒక విద్యార్థికి ప్రాథమిక విలువలు నేర్చుకునేది ఇక్కడే. అతడు ఏ గమ్యం వైపు వెళ్లాలి. ఎటువంటి కెరీర్‌ను ఎంచుకోవాలి అనే అంశాలన్నీంటికి ఇక్కడే దారులు మొదలవుతాయి. పాఠశాల విద్య వ్యక్తులపై, సమాజంపై ఊహించని ప్రభావం చూపుతుంది.
అంతలా విద్యార్థలును తీర్చిదిద్దే పాఠశాలలు చిన్నబోవడం ఆర్చర్య పరుస్తోంది. కనీసం ఒక టీచర్ ను కూడా కేటాయించలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మారుతున్నా మారుమూల ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలను మాత్రం మార్చుకోలేకపోతున్నాయి. విద్యను నేర్చుకునే ప్రాథమిక హక్కును కూడా కోల్పోయే ప్రమాదంలోకి కనీస సౌకర్యాలు, వసతులు లేని పాఠశాలలు నెట్టివేసేలా కనిపిస్తున్నాయి. నేతలు ఎన్నికల్లో హామీలు ఇస్తారు.. ఆ తర్వాత ఐదేళ్లు వాటిని పట్టించుకునే నాథుడే లేడని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇక్కడి ప్రజలు పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించి వసతులు కల్పించాలని వేడుకుంటున్నారు.
నిజానికి ఈ స్కూల్ లో విద్యార్థులు దాదాపు 30 మంది వరకు ఉన్నారు. కానీ కొందరు బడికి రావడం కొంచం ఆలస్య మవుతుంటే.. పల్లె కావడంతో ఇంట్లో తల్లి దండ్రులు పొలం పనులకు వెళ్ళేసరికి మరికొందరు పిల్లలు బడికి రావడం ఆలస్యం అవుతుంది. కొంత మంది స్కూల్ కి రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు. స్కూల్లో సౌకర్యాలు ఇంకా మెరుగు పరిచి.. పిల్లల్లో కూడా అవగాహన కల్పిస్తామని అడవి శ్రీరాంపూర్ సర్పంచ్ తుంగాని సమ్మయ్య చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana