హోమ్ /వార్తలు /తెలంగాణ /

అధిష్టానం ఈ ఎమ్మెల్యేని పక్కన పెట్టిందా?.. అయోమయంలో బీఆర్ఎస్ క్యాడర్!..

అధిష్టానం ఈ ఎమ్మెల్యేని పక్కన పెట్టిందా?.. అయోమయంలో బీఆర్ఎస్ క్యాడర్!..

కీలకంగా మారుతున్న రాజకీయాలు..

కీలకంగా మారుతున్న రాజకీయాలు..

Telangana: టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారి దేశ రాజకీయాలలో అరగ్రేటం చేసినా.. సొంత పార్టీలో మాత్రం నేతలు ఒకే తాటిపై లేకపోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో ఎవరికి వారే యమునా తీరే అన్న తీరుగ మారడంతో కింది స్థాయిలో క్యాడర్అయోమయం పడింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారి దేశ రాజకీయాలలో అరగ్రేటం చేసినా.. సొంత పార్టీలో మాత్రం నేతలు ఒకే తాటిపై లేకపోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో ఎవరికి వారే యమునా తీరే అన్న తీరుగ మారడంతో కింది స్థాయిలో క్యాడర్అయోమయం పడింది. రామగుండం బీఆర్ఎస్ పార్టీలో క్యాడర్ అంతా అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.

అధిష్టానం అధికారికంగా చెప్పకపోయినా ఆయనను పక్కన పెట్టారంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆయనకు ఇవ్వరు అని అనుకుంటున్నారు. మరి కొందరైతే టికెట్ తమకే ఇవ్వాలంటూ పావులు కదుపుతున్నారు. అసలా ఈ నియోజికవర్గంలో ఏం జరుగుతోంది? ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణుల పరిస్థితి ఏంటి అనేది అర్థం కాక సామాన్య క్యాడర్ అయోమయంలో పడిపోతుంది.

రామగుండం నియోజకవర్గం పార్టీ తీరు,ఇటీవల కాలంలో జరిగిన ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగాల కుంభకోణం నేపథ్యంలో ఇక్కడ నేతపై అధిష్టానం గుర్రుగా ఉందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. ఆయన ఎవరో కాదు.. ఎమ్మెల్యే కోరుకుంటి చందర్. నియోజకవర్గంలో ఆయన అసమ్మతి వర్గం కూడా ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు.

అయితే, ఎమ్మెల్యే కొరుకoటి చందర్ కు ఇటీవల నామినేటెడ్ పదవులు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇందులో ఎమ్మెల్యే కోరుకుంటికి జిల్లా పార్టీ బాధ్యత అప్పగించారు. ఒక వేళ అధిష్టానంఆయన్ను పక్కన పెట్టినట్టయితే జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించే వారు కాదని అయన వర్గం సమర్ధించుకుంటున్నారు. మరో వైపున అధిష్టానం మెప్పు కోసం మాత్రం ప్రగతి భవన్ పెద్దలను మచ్చిక చేసుకునే పనిలో మరికొంతమంది నాయకులు నిమగ్నం అయ్యారు.

ఆశావాహుల ప్రచారం మొదలు.. అసమ్మతీయులు ప్రచారం...

అదిష్టానం వ్యవహారం తీరుతో సామాన్య కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారన్నది వాస్తవం. రామగుండం నియోజికవర్గంలో సాధారణ కార్యకర్తల పరిస్థితి ఎలా తయరైందంటే.. కరవమంటే కప్పకు కోపం..విడువమంటే పాముకు కోపం అన్నట్టుగా కాలం వెల్లదీస్తున్నారు.

మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉన్న సామాన్య కార్యకర్తల పరిస్థితి గురించి కూడా పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. రామగుండం నియోజకవర్గంముఖ చిత్రాన కొత్త ముఖానికే అవకాశం ఉంటుందో లేక కొరుకంటి చందర్ కే మరో అవకాశంఉంటుందో వేచి చూడాలి. అయితే, అధిష్టానం నాన్చుడు ధోరణి వల్ల ప్రతిపక్ష పార్టీలను బలోపేతం చేసినట్టు అవుతున్నదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కోరుకంటి చందర్ పై అధిష్టానం వైఖరి ఏంటో స్పష్టత ఇస్తే క్యాడర్ కూడా పార్టీ కోసం పనిచేసే అవకాశాలు ఉంటాయి. లేదంటే రామగుండం నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని భావిస్తున్నారు.

ఎమ్మెల్యేకి పాజిటివ్/నెగటివ్ లు ఇవే...

ఎమ్మెల్యే కోరుకుంటికి కలిసొచ్చే అంశాలు మెడికల్ కాలేజీ, సంక్షేమ పథకాలు ఇంటింటా చేరవేయడం, ప్రజలతో కలిసి పోవడం, అందరినీ వరస కలిపి మాట్లాడటం కాగా.. ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగ దందాలో ఎమ్మల్యే అనుచరులు ఉండడం ప్రజల్లో గట్టిగా నాటుకుపోయాయి. ఎందుకు పనికి రాని బూడిదను కూడా దందాగా మార్చి కొన్నివందల కోట్లు వెనక వేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి, సొంత పార్టీ నేతలకే చురకలు అంటిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. కష్టపడ్డ వాళ్లకు గుర్తింపు ఇవ్వకుండా కొత్తగా పార్టీలో చేరే వారికి ప్రాధాన్యత ఇస్తారన్న ఆరోపణలు ఉన్నాయి.

First published:

Tags: BRS, Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు