Home /News /telangana /

PEDDAPALLI GRAND CHILDREN SEVERELY BEAT GRANDPARENTS GRANDFATHER DIED POLICE FILED CASE ABH BRV PSE

Peddapalli: సొంత మనవళ్ళే తాతను కాటికి పంపారు!..

grand children beaten grand father for sake of property

grand children beaten grand father for sake of property

ఉన్న ఆస్తి మొత్తం తమకే దక్కాలంటూ అమ్మమ్మతాతయ్యలపై సొంత మనవళ్లు దాడి చేశారు. ఈఘటనలో తీవ్రంగా గాయపడ్డ తాత మృతి చెందగా, అమ్మమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురై యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది

ఇంకా చదవండి ...
    (E.Santosh, News 18, Peddapalli)

    పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలో దారుణ సంఘటన జరిగింది. ఉన్న ఆస్తి మొత్తం తమకే దక్కాలంటూ అమ్మమ్మతాతయ్యలపై సొంత మనవళ్లు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తాత మృతి చెందగా, అమ్మమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఎస్సై ఉపేందర్రావు, స్థానికుల కథనం ప్రకారం... సుల్తానాబాద్ పట్టణంలోని గడిమహల్‌కు చెందిన జంగ లింగయ్య(85), ఓదెమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారికి వివాహాలు చేసి పంపించడంతో ప్రస్తుతం వృద్ధులు ఇద్దరే వేరే నివాసం ఉంటున్నారు. కాగా తమకున్న రెండు ఎకరాల పొలాన్ని కూతుళ్లు రాజమ్మ, వరలక్ష్మిలకు రాసిచ్చారు. ఈక్రమంలో మొత్తం ఆస్తి తమకే కావాలంటూ కొంతకాలంగా పెద్దకూతురు రాజమ్మ కొడుకులు పట్టుబడుతుండటంతో కుటుంబ సభ్యుల మధ్య వివాదం నడుస్తోంది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. ఈక్రమంలో బుధవారం రాత్రి అమ్మమ్మ ఇంటికి వచ్చిన రాజమ్మ కొడుకులు, నర్ల రవి, సంతోష్‌లు తాతా, అమ్మమ్మలతో గొడవ పడ్డారు. కర్ర దుంగతో ఇద్దరిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. స్థానికులు గమనించి గాయపడిన వృద్ధులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లింగయ్య మృతి చెందగా, ఓదెమ్మ చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురై యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రం పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... కరీంనగర్ కిసాన్ నగర్ కు చెందిన పాములపర్తి నరేందర్ అనే యువకుడు పీజీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. గతంలో చిన్న ఉద్యోగాలు చేసినా జీవితంలో నిలదొక్కుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈక్రమంలో ఇంతకు మంచి ఉద్యోగం దొరక్కపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. జులై 26న ఇంటి నుంచి బయటకు వెళ్లిన నరేందర్.. చీకటి పడినా ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల గాలించి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో బుధవారం నాడు కరీంనగర్ రూరల్ ఎలబోతారం గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నరేందర్ మృతదేహం లభించింది. పురుగుల మందు సేవించి నరేందర్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Peddapalli, Telangana

    తదుపరి వార్తలు