(E. Santosh, News 18, Peddapalli)
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వ్యక్తిగతంగా కంటెంట్ (Content) ఉంటే చాలూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఇది నిరూపితమైనా మనకు తెలిసిన వారు ఆ స్థాయిలో లేకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రముఖ ఫోర్బ్స్ (Forbes) మ్యాగజైన్ ఇటీవల విడుదల చేసిన "టాప్ 100 డిజిటల్ స్టార్స్" జాబితాలో మన పెద్దపల్లి (Peddapalli) జిల్లా కుర్రాడు చోటు సంపాదించాడు. యూట్యూబ్, సోషల్ మీడియా చానెల్స్ లో తమ ప్రతిభతో ఆకట్టుకుంటూ యువతను ఆకర్షిస్తున్న వారి వివరాలతో ఫోర్బ్స్ మ్యాగజైన్ (Forbes Magazine) ఈ "టాప్ 100 డిజిటల్ స్టార్స్" (Top 100 digital Stars)జాబితా రూపొందించింది. ఆ జాబితాలో మన గోదావరిఖనికి చెందిన హాఫిజ్ (Hafeez) అనే యువకుడు 32వ స్థానంలో నిలిచాడు. యైటింక్లయిన్ కాలనీకి చెందిన హాఫిజ్ 'తెలుగు టెక్ టట్స్' అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ (Youtube Channel)నిర్వహిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తనకున్న కొద్దిపాటి సాంకేతిక విజ్ఞానాన్ని నలుగురితో పంచుకుంటూ, తాను కూడా రోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాడు హాఫిజ్.
యూట్యూబ్‌కి ముందు హాఫిజ్:
గోదావరిఖని (Godavarikhanai) యైటింక్లయిన్ కాలనీకి చెందిన ఒక సామాన్య సింగరేణి కార్మిక కుటుంబానికి చెందిన హఫీజ్(Hafeez)..మొదట్లో స్థానికంగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ పై ట్రైనింగ్ తరగతులు ప్రారంభించాడు. పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ, ఎంఎస్ ఆఫీస్ వంటి సాఫ్ట్ వేర్స్ పై శిక్షణ ఇచ్చేవాడు. టాలీ, ఆటోక్యాడ్ పైనా పట్టు సాధించాడు. తాను నేర్చుకుంటూనే ఇతరులకు నేర్పే హాఫిజ్... తనకు ఏదైనా సందేహం వస్తే గూగుల్ లో వెతికేవాడు. అయితే గూగుల్, యూట్యూబ్ లో టెక్నాలజీకి సంబంధించి వీడియోల (Videos) కోసం వెతుకుతుండగా.. ఇంగ్లీష్, హిందీ భాషలకు సంబంధించినవే ఎక్కువగా ఉండడంతో అప్పుడే తెలుగులోనూ ప్రారంభించాలని హాఫిజ్ నిర్ణయించుకున్నాడు. "అలా నా మొదట యూట్యూబ్ ఛానెల్ 2014లో "telugu tech tuts" పేరుతో ప్రారంభించి టాలీ, ఆటోక్యాడ్ సంబంధించిన వీడియోస్ ఎక్కువగా చేసేవాడిని. అలా చేస్తున్న సమయంలోనే కొందరు సబ్స్క్రయిబర్స్.. ఫోన్ సమస్యలపై వీడియోలు చేయమని కోరేవారు. అప్పుడు కంటెంట్ మార్చి.. ఫోన్స్, గాడ్జెట్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రారంభించా" అని హాఫిజ్ తన యూట్యూబ్ ప్రయాణం గురించి న్యూస్ 18తో పంచుకున్నాడు.
కెరీర్ ప్రారంభంలో కొన్ని కష్టాలు:
తెలుగు టెక్ టట్స్ యూట్యూబ్ ఛానెల్ (Telugu tech tuts youtube channel) పెట్టె ముందు హాఫిజ్ ప్రతి రోజూ సుమారు 12 గంటలు కష్టపడే వాడు. అప్పుడు ఇంటర్నెట్ తక్కువగా ఉపయోగంలో ఉండగా.. ఆ తరువాత ఆండ్రాయిడ్ మొబైల్స్, ఉచిత ఇంటర్నెట్ సేవలు ఎక్కువగా పెరగడంతో ఛానల్ ఎక్కువగా ప్రాముఖ్యత వచ్చింది. మొదటి మూడు సంవత్సరాలూ ఒక లక్ష సబ్స్క్రయిబర్స్ మాత్రమే ఉండగా క్రమంగా పెరుగుతూ ప్రస్తుతానికి 16 లక్షల చేరువలో ఉన్నట్లు హఫీజ్ తెలిపాడు. యూట్యూబ్ వీడియోలతో రూ.7 వేలు తన మొదటి వేతనం అందుకున్న హాఫిజ్, కంటెంట్ పై శ్రద్ధ పెట్టి ఛానెల్ అభివృద్ధి చేశాడు. ఇప్పటికీ ప్రతి రోజూ 12 గంటల పాటు తన ఛానల్ కోసం పని చేస్తానని తెలిపాడు.
హఫీజ్ ప్రతిభకు పురస్కారాలు:
హాఫిజ్ తన యూట్యూబ్ వీడియోల (YouTube videos) ద్వారా ఎంతో మందికి సాంకేతిక విషయాలు చేరవేశారు. ప్రజలకు ఉపయోగపడే కంటెంట్ వీడియోలు చేస్తూ... పెద్దగా చదువురాని వారికి కూడా అర్ధం అయ్యేలా వివరంగా వీడియోలు చేస్తున్నాడు హాఫిజ్. ఇది గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు ఉత్తమ ప్రతిభ అవార్డ్ అందించిందని, యూట్యూబ్ నుండి కూడా ఎన్నో అవార్డులు అందుకున్నట్టు హఫీజ్ తెలిపాడు. ఇప్పుడు ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన "టాప్ 100 డిజిటల్ స్టార్స్" జాబితాలో దేశ వ్యాప్తంగా 32వ స్థానంలో నిలిచి శెభాష్ అనిపించుకున్నారు..
యువతకు హఫీజ్ ఇచే సందేశం:
ఇప్పుడు ఉన్న టెక్నాలజీని (Techonoly) సరిగా వినియోగించు కోవాలని దీని కోసం వారిని చైతన్యవంతం చేసేలా అనేక వీడియోలు తయారు చేసినట్లు హాఫిజ్ (Hafeez)పేర్కొన్నాడు. ఇప్పటి పిల్లలు టిక్ టాక్, వీడియో గేమ్స్ పట్ల ఆకర్షితులై విలువైన జీవితాన్ని నష్టపోతున్నారని సరైన సమయంలో టెక్నాలజీ వినియోగించుకుంటే ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నాడు. "యూట్యూబ్లో ప్రత్యేక చానెల్ ఎలా ఏర్పాటు చేయాలో అనే వీడియో తయారు చేయడంతో దాన్ని చూసి చాలా మంది కొత్తగా యూట్యూబ్లోకి ఎంటరై రూ. లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ విషయం వారు ఫోన్ చేసి చెప్పేవరకు నాకు తెలియలేదు. నాకు చాలా సంతోషంగా ఉందని" హఫీజ్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Forbes, Local News, Peddapalli, Youtube stars