E.Santosh, News18, Peddapalli
ఈ రోజుల్లో ఆత్మరక్షణ విద్యకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్య ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ నేపథఅయంలో అమ్మాయిలు కర్ర సాము, కత్తి సాముపట్ల ఎంతో దృష్టి పెడున్నారు. ప్రతి విద్యార్థికి ముఖ్యంగా ఆడపిల్లలకు ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న అఘాయిత్యాలకు సమాధానం చెప్పాలంటే ఇటువంటి ప్రాచీన విద్య ఎంతో అవసరం. తమను తాము రక్షించుకోవడంతో పాటు శారీరకంగా కూడా దృఢంగా ఉండవచ్చు.. ధైర్యాన్ని కూడా ఇస్తుంది. కర్ర సాము, కత్తి సాము, నాన్ చాక్ కళలకు ఇప్పుడు ప్రాధాన్యత పెరుగుతోంది. అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలను చూసి తల్లి దండ్రులు ఈ కళలు నేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆత్మ రక్షణ కోసం ఎంతో ఉపయోగపడే ఈ కర్ర సాము, కత్తి సాము, నాన్ చాక్ విద్యలను పెద్దపల్లి జిల్లా (Peddapalli District) రామగుండంలో పాత ఈఎస్ఐ హాస్పిటల్ గ్రౌండ్ లో సురేష్ అనే మాస్టర్ శిక్షణ ఇస్తున్నాడు. ఇక్కడ కళ నేర్చుకునేందుకు విద్యార్థిని, విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ నైపుణ్య విద్య నేర్చుకోవాలనే ద్యేయంగా తాను శిక్షణ ఇస్తున్నానని సురేష్ అన్నారు. ఆత్మ రక్షణకు ఎంతో ఉపయోగకరమైన ఈ కళ పట్ల ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, ముఖ్యంగా విద్యార్థినులు, ఆడవారు ఈ విద్యను నేర్చుకుంటే తమకు తాము ఆకతాయిల నుంచి కానీ, కొన్ని సంఘటనల నుంచి రక్షించుకోవచ్చని సురేష్ అంటున్నారు. చేతిలో కర్ర పట్టుకొని గిరగిరా తిప్పుతూ ఎంతటి వారినైనా తృణప్రాయంగా ఎదుర్కోవచ్చునని సురేష్అంటున్నాడు. కర్ర సాముకు, కత్తి, నాన్ చాక్ వంటి విద్యలో ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని సురేష్ కోరుతున్నారు.
కర్ర సాము ప్రాచీన విద్య అయినప్పటికీ ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న కరాటే, కుంఫు, బాక్సింగ్ వంటి శారీరక విద్యలకు ధీటుగా ఉంటుందని, ప్రస్తుత పరిస్థితులలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే కర్ర సాము నేర్చుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థినిలు అంటున్నారు. అంతరించిపోతున్న ఈ విద్యను ప్రభుత్వం కూడా ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఉపయోగంగా ఉంటుందని కోరుతున్నారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో మహిళలకు, విద్యార్థినిలకు, ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్లి వస్తున్న మహిళలకు ఈ కర్ర సాము విద్య చాలా ఉపయోగం.ఇది ఒక్క రామగుండంనగరానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాలని ప్రభుత్వం దీనిపై దృష్టిసారించాలన్నారు. రానున్న కాలంలో ప్రతి మహిళకు ఆత్మరక్షణగా ఈ కర్ర సాము ఉపయోగపడుతుందని విద్యార్థినిలు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana