Home /News /telangana /

PEDDAPALLI GARBAGE COLLECTING VEHICLES ARE NOT IN USE IN RAMAGUNDAM MUNICIPALITY BRV PSE ABH

Peddapalli: చెత్తకుప్పకు చేరిన చెత్త సేకరణ వాహనాలు, వాటిలో పార్ట్స్ కూడా మాయం: చోద్యం చూస్తున్న అధికారులు

రామగుండం

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్

ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా రామగుండం కార్పొరేషన్‌కు చెత్త సేకరణ వాహనాలను కేటాయించింది. అధికారుల నిర్లక్ష్యం వలన కేటాయించిన వాహనాల నిర్వహణ సరిగా లేక కార్పొరేషన్లోని చెత్త సేకరణ వాహనాలు ములన పడుతున్నాయి

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India
    E.Santosh, News 18, Peddapalli

    స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా సేకరించేందుకు ఆటోలను అందజేసి కార్పొరేషన్లకు నిధులు కూడా కేటాయించింది. ఆ ఆటోలో రెండు మూడు రకాలుగా క్యారేజీ ఏర్పాటు చేసి తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించాల్సి ఉంటుంది పారిశుధ్య సిబ్బంది.

    మొదట్లో అలాగే సేకరించిన సిబ్బంది ఇప్పుడు మాత్రం ఇష్టానుసారంగా చెత్తను సేకరిస్తున్నారు. అదికూడా రెండు మూడు రోజులలో ఒకసారి మాత్రమే వచ్చి చెత్త సేకరిస్తారు. మిగితా రోజుల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసనకు కారణం అవుతున్నాయి. వీధుల్లో చెత్త, ఇళ్ల మధ్యన చెత్త, రోడ్ల పక్కన చెత్త.

    ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా రామగుండం కార్పొరేషన్‌కు చెత్త సేకరణ వాహనాలను కేటాయించింది. అధికారుల నిర్లక్ష్యం వలన కేటాయించిన వాహనాల నిర్వహణ సరిగా లేక కార్పొరేషన్లోని చెత్త సేకరణ వాహనాలు ములన పడుతున్నాయి. గతంలో కూడా చెత్త సేకరణ నిమిత్తం రామగుండం మున్సిపల్ పాలకవర్గం ఆటోలను కొనుగోలు చేసింది. గత పాలకవర్గంలో చెత్త సేకరించడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి దాదాపు 50 రిక్షాలను కూడా కొనుగోలు చేసింది. అయితే కొద్ది రోజులకే ఆ రిక్షాలు మూలకు చేరుకోగా ఆటోలు స్క్రాప్‌గా మారి చెత్త కుప్పల్లోకే చేరుకున్నాయి

    కొత్తగా ఏర్పడ్డ పాలకవర్గంలో కూడా రామగుండం కార్పొరేషన్లో 50 డివిజన్లకు 50 చెత్త సేకరణ ఆటోలను పంపిణీ చేశారు. ప్రతి రోజూ ఆయా డివిజన్లలో చెత్త సేకరించేందుకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. మొదట్లో బాగానే ఉన్నా ఆ ఆటోలలో సగంకు పైగా ఆటోలు ఇప్పుడు కనిపించడం లేదు. నిర్వహణ లేక కొన్ని ఆటోలు మూలన పడగా, మిగిలిన కొన్ని ఆటోలలో మాత్రమే చెత్త సేకరణ జరుగుతుంది. దీంతో డివిజన్లలో పారిశుధ్యపనులు సక్రమంగా సాగక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

    మూలన పడ్డ చెత్త ఆటోల టైర్లు, ఇంజన్లు మాయం:
    రామగుండం కార్పొరేషన్లో చెత్త సేకరణ ఆటోలు నిర్వహణ లేక మూలన పడ్డాయి. అయితే అలా పేరుకుపోయిన ఆటోలలో టైర్లు, బ్యాటరీలు, ఇతర విడిభాగాలు, ఇంజిన్లు కూడా మాయం అవుతున్నాయి. ఇది ఇంటి దొంగల పనా? బయట దొంగల పనా? అనే విషయం తెలియాల్సి ఉంది. అయిన మున్సిపాలిటీ పరిధిలో ఇది కొత్తేం కాదు. గత ఆరు నెలల క్రితమే రూ. కోట్ల విలువైన స్క్రాప్ మాయం చేసిన చరిత్ర రామగుండం కార్పొరేషన్ అధికారులకు ఉందని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.

    Read This Also; Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో పెరుగుతున్న పాముకాటు ఘటనలు: పాము కాటుతో మహిళ మృతి



    చెత్త వాహనాలు వినియోగంలోకి తేవాలి:
    రామగుండం కార్పొరేషన్లో రూ. కోట్ల నిధులు కేటాయించి కొనుగోలు చేసిన వాహనాలను తిరిగి ఉపయోగంలోకి తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే వాహనాలు మూలన పడుతున్నాయని, మూలాన పడ్డ వాహనాల టైర్లు, బ్యాటరీలు చోరీకి గురవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతుందని కాంగ్రెస్ కార్పొరేటర్ ముస్తాఫ్ ఆరోపించారు. సుమారు రూ. 50 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన జెట్టింగ్ మెషిన్ కూడా ఎనిమిది నెలలుగా నిరుపయోగంగా ఉందని, ప్రజా ధనాన్ని వృధా చేతున్నారంటూ ముస్తఫా మండిపడ్డారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Peddapalli, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు