E.Santosh, News18, Peddapalli
సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం ఉండాలి. అలా అయితేనే ఏదో ఒక దశలో ఎదుగుతారు. ముందు టాలెంట్ ని ఏదొక ప్లాట్ ఫామ్ లో నిరూపించుకుని మంచి మంచి అవకాశాలు కొట్టేయాలి. అలా ముందు యూట్యూబ్ (YouTube) లాంటి చిన్న ఫ్లాట్ ఫామ్ లో తమ టాలెంట్ ని నిరూపించుకుని ఆ తర్వాత వెండితెరపై మెరుస్తున్నారు. అలాగే తాజాగా పెద్దపల్లి జిల్లా (Peddapalli District) గోదావరిఖనికి చెందిన కొమ్ము సుజాత ఇటీవల విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న బలగం సినిమా (Balagam Movie) లో హీరో తల్లి పాత్రలో జీవించి తెలుగు ప్రజల చేత శబాష్ అనిపించుకున్నారు.
స్థానిక గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడు రొడ్డ రాజయ్య లక్ష్మి దంపతులకుమార్తె కొమ్ము సుజాత స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో 7వ తరగతి వరకు మాత్రమే చదువుకుంది. ఆ తర్వాత తన తండ్రి అనారోగ్యానికి గురికావడంతో సుజాతకు మేన కుటుంబం వారితో పెళ్లి చేశారు. అయితే, పెళ్లి అనంతరం బ్యూటీషియన్ కోర్స్ చేసిన సుజాత.. సినిమాలపై ఉన్న మక్కువతో స్థానికంగా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. ఎలాగైనా సినిమా ఇండస్ట్రీలో రాణించాలనే ఉద్దేశంతో 2015లో భాగ్యనగరానికి చేరింది. సాధారణంగా సినిమా అవకాశాలను పట్టాలంటే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతటి కష్టమో మనకు తెలిసిందే. అలాంటిది ఒక మహిళ సినిమా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే ఎంతటి సహసమో చెప్పలేనిది.
ఎన్నో సవాళ్లను, ఎన్నో ఒడిదుడుకులను, పూటకు పస్తులు, ఇంట్లో వారితో ఇబ్బందులు అన్ని ఎదుర్కొని సినిమా ఇండస్ట్రీలో రాణించింది సుజాత. మొదట్లో వెబ్ సిరీస్ లోకొత్త పొరల్లు, వైఫ్ ఆఫ్ రామ్, ఇష్టం వంటి వాటిలో నటించింది. బంగారు గాజులు, రక్త సంబంధం సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. అలా బలగం అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా విషయానికి వస్తే ఇటీవల జబర్దస్త్ ఫేం సిరిసిల్ల వేణు (Jabardhasth Venu) దర్శకత్వంలో విడుదలైన బలగం సినిమాలో హీరోకు తల్లి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో ముద్ర వేసుకుంది.
సుజాతకు స్థానికంగా సన్మానాలు..
సుజాత బలగం సినిమా సక్సెస్ అయి మంచి పేరు రావడంతో స్థానికంగా ఉన్న వారు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, గోదావరిఖనిలో సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుజాత జర్నలిస్ట్ లు, రాజకీయ నాయకులతో కలిసి సినిమాను చూశారు.
వీరంతా జిల్లా వారే..
సినిమా ఇండస్ట్రీలో పెద్దపల్లి జిల్లా నుండి అన్ని క్యాటగిరిలలో రాణిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అందులోడై రెక్షన్ డిపార్ట్మెంట్ లో రచ్చ సినిమా డైరెక్టర్ సంపత్ నంది (Director Sampath Nandi) ఓదెల గ్రామానికి చెందిన వారు కాగా.. దసరా సినిమా (Dasara Movie) డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Director Srikanth Odela) గోదావరిఖనికి చెందిన వారు. ఆర్టిస్ట్ లు గా తాగుబోతు రమేష్ (Thagubothu Ramesh), మిమిక్రీ శివాజీ, బిగ్ బాస్ ఫేం సోహైల్ (Big Boss Sohail) గోదావరిఖని చెందిన వారు కాగా.. ఆర్టిస్ట్ లుగా సినిమా ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు మహిళా నటిగా సినిమా ఇండస్ట్రీలో గోదావరిఖని నుండి నటి కొమ్ము సుజాత మంచి పేరు సంపాదించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balagam Movie, Local News, PEDDAPALLI DISTRICT, Telangana