హోమ్ /వార్తలు /తెలంగాణ /

Extramarital Affair : ఫస్ట్ వైఫ్‌కి హ్యాండిచ్చి ..సెకండ్ సెటప్ పెట్టాడు .. గుట్టు రట్టవడంతో సీన్‌ సితారైంది

Extramarital Affair : ఫస్ట్ వైఫ్‌కి హ్యాండిచ్చి ..సెకండ్ సెటప్ పెట్టాడు .. గుట్టు రట్టవడంతో సీన్‌ సితారైంది

WIFE PUNISHMENT

WIFE PUNISHMENT

Extramarital Affair: మొగుడు ముసుగు వేసుకున్న మోసగాడి బండారం బయటపడటంతో కట్టుకున్న భార్యకు కడుపు మండిపోయింది. పెళ్లి చేసుకొని బిడ్డకు తల్లిని చేసి నడిరోడ్డుపై వదిలేసిన భర్తకు తగిన గుణపాఠం చెప్పింది. ఈసంఘటన ఏ జిల్లాలో జరిగిందంటే..

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India

(P.Srinivas,New18,Karimnagar)

నూరేళ్లు తోడుగా ఉంటానని ...కష్ట, సుఖాల్లో భాగస్వామిగా నిలబడతానని..వేద మంత్రాల సాక్షిగా వివాహం చేసుకున్న భార్యనే మోసం చేశాడు. మూడు ముళ్ల పవిత్ర బంధాన్ని తన తాత్కాలిక సంతోషం కోసం తెంచుకొని గుట్టు చప్పుడు కాకుండా మరో మహిళను పెళ్లి చేసుకొని మొదటి భార్యకు అన్యాయం చేశాడు. పెద్దపల్లి(Pedpadalli)జిల్లాలో మొగుడు (Husband)ముసుగు వేసుకున్న మోసగాడి బండారం బయటపడటంతో కట్టుకున్న భార్యకు కడుపు మండిపోయింది. పెళ్లి(Marriage)చేసుకొని బిడ్డకు తల్లిని చేసి నడిరోడ్డుపై వదిలేసిన భర్తకు తగిన గుణపాఠం చెప్పింది ఆ ఇల్లాలు.

Hostel food : ఆ హాస్టల్‌లో పురుగులున్న అన్నమే పరమాన్నం.. తినలేక విద్యార్ధులు పస్తులుంటున్న వైనం

మొగుడు కాదు మోసగాడు..

పచ్చని కాపురాలు వివాహేతర సంబంధాల వల్లే కూలిపోతున్నాయి. పరాయి వ్యక్తులతో పరిచయాలు ఒకరిపై మరొకరికి ఇష్టాన్ని పెంచుతున్నాయి. అందులో భాగంగానే తాత్కాలిక సంతోషం కోసం వెంపర్లాడుతూ నమ్ముకున్న వాళ్లను మోసం చేస్తున్న ఘటనలు నిత్యం ఏదో ఒక చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం స్వర్ణపల్లి గ్రామంలో శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తికి మొదటి భార్య అఖిల దేహశుద్ధి చేసింది. నాలుగు సంవత్సరాల క్రితం బంధుమిత్రుల సమక్షంలో అఖిలను వివాహం చేసుకున్న శ్రీకాంత్‌రెడ్డి ఒక కొడుకు పుట్టగానే మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను విడిచి ఉండలేక ..భార్యను వదిలిపెట్టి రెండో వివాహం చేసుకున్నాడు. ఇదే విషయం అఖిలకు ఆలస్యంగా తెరలియడంతో రెండో భార్యతో హన్మకొండలో కాపురం పెట్టిన భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని స్వర్ణపల్లి గ్రామానికి తీసుకొచ్చారు అఖిల కుటుంబ సభ్యులు.

చెప్పుల దండతో సన్మానం..

ఊరి మధ్యలో ఉన్న కరెంట్ స్తంభానికి భర్త శ్రీకాంత్‌రెడ్డిని తాళ్లతో కట్టేసి చెప్పులతో కొట్టి దేహశుద్ధి చేసింది భార్య. నాలుగేళ్ల క్రితం 20లక్షల కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్న శ్రీకాంత్‌రెడ్డి అఖిలకు ఒక బిడ్డ పుట్టగానే వదిలించుకొని వేరే పెళ్లి చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తప్పుకు శిక్షగా చెప్పుల దండను భర్త మెడలో వేసి ఊరి జనం ముందు పరువు తీసింది అఖిల. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న శ్రీకాంత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది బాధితురాలు.

Published by:Siva Nanduri
First published:

Tags: Extra marital affair, Peddapalli, Telangana News

ఉత్తమ కథలు