హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: తభిత అనాధ ఆశ్రమమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ పుట్టినరోజు వేడుకలు

Peddapalli: తభిత అనాధ ఆశ్రమమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ పుట్టినరోజు వేడుకలు

X
పుట్టిన

పుట్టిన రోజు వేడుకలు

Telangana: తల్లి ఒడి బిడ్డకు తొలి బడి.. అమ్మ లేకపోతే సృష్టికి అస్థిత్వమే లేదు. ఆకలికి ఉపశమనమే లేదు.. అనురాగానికి ఉనికే లేదు.. అమ్మ ప్రేమ ఓ పూజామందిరంలా పవిత్రమైనది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : సంతోష్

లొకేషన్ : పెద్దపల్లి

తల్లి ఒడి బిడ్డకు తొలి బడి.. అమ్మ లేకపోతే సృష్టికి అస్థిత్వమే లేదు. ఆకలికి ఉపశమనమే లేదు.. అనురాగానికి ఉనికే లేదు.. అమ్మ ప్రేమ ఓ పూజామందిరంలా పవిత్రమైనది. అలాంటి అమ్మ ప్రేమకుకు చాలా మంది దూరంగా ఉంటూ అనాధ ఆశ్రమాలలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలా అమ్మ ప్రేమకు దూరమైన నాన్న లాలనకు నోచుకోని వారిని చేర తీసి అమ్మ నాన్నల ప్రేమను పంచుతూ ఆశ్రయం ఇస్తుంది తభిత ఆశ్రమం. ఈ ఆశ్రమంలో సుమారు 80 మంది చిన్నారులు ఉన్నారు. వారందరికీ అన్ని తామై అలనా పాలన అన్నీ వారే చూస్తూ పాఠాలు నేర్పిస్తున్నారు.

మరి ఏ పిల్లలకైన పుట్టిన రోజు అనేది ఒక అనుభూతితో కూడిన వేడుక. అనాధ పిల్లలు చెప్పుకోలేరు కాబట్టి వారు మనసులో ఉన్న ఆ ఆనందాన్ని చూసేందుకు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ వారు ప్రతి సంవత్సరం సామూహిక పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. తాజాగా తభిత ఆశ్రమంలో కూడా సామూహిక పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకలో పిల్లలసంతోషం, వారి ఆనందం తమకి చాలా ఆనందాన్ని ఇస్తుందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు మద్దెల దినేష్ అన్నాడు.

చిన్నారుల భావితరాల భవితవ్యం గురించి ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించి బాలల అభివృద్ధికి కొంత మేరకు మనవంతు సహాయం అందించాలనిఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నిర్వాహకులు కోరారు. మానవ జీవన పరిణామ క్రమంలో బాల్యం అతి మధురమైనది.. అమూల్యమైనది.. అపురూపమైనది. చీకు చింతా లేని బాల్యం భవిష్యత్తుకు నాంది అని వారు అన్నారు.

బాలల సంరక్షణ అత్యంత ఆవశ్యకమైనదని నేటి ప్రభుత్వం పిల్లల రక్షణ కొరకుప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు కందుల సంధ్యారాణి పాల్గొని భవిష్యత్తులో పిల్లలు సాంకేతిక పరమైన అభివృద్ధి చెందేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామని తెలిపారు. పుట్టిన రోజు వేడుకల్లో పిల్లలకి కేక్, చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ తో పాటు బోజనాలు ఏర్పాటు చేశారు. బోజనాలు ముగిశాక తమ పుట్టిన రోజూ వేడుకను ఎంతో ఆనందంగా ఆట పాటలతో ఎంజాయ్ చేశారు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు