తెలంగాణలో ఎన్టీపీసీ వెలుగులు ఎందరో కార్మికుల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఎన్టీపీసీలో ఉత్పత్తి అయ్యే కరెంట్ తో దేశంలో కాంతులు విరజిమ్ముతూ దేశ కాంతిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రామగుండం ఎన్టీపీసీ ప్రాంతానికి అనుగుణంగా ఉండే అన్ని వసతులు దానికి కారణం.ఎల్లంపల్లి ప్రాజెక్ట్, సింగరేణి పక్కనే ఉండటంతో మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎన్టీపీసీలో మరో 1600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించారు.
ప్రస్తుతానికి ప్రాజెక్ట్ చివరి దశలో ఉంది. త్వరలోనే విద్యుత్ ప్రారంభానికి సిద్దంగా ఉంది. ఎన్టీపీసీ యాజమాన్యం తెలంగాణ విద్యుత్తు ప్రాజెక్ట్అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ఇందులో భాగంగా త్వరలోనే 800 మెగావాట్ల 1వ యూనిట్ ను లైటప్ చేయనున్నారు. జనవరి 7న 1వ యూనిట్ ను లైటప్ చేసే క్రమంలో బాయిలర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
రెండు నెలల పాటు నిశితంగా అన్వేషించి సాంకేతిక లోపాలను గుర్తించి మరమ్మతులు పూర్తి చేయగలిగారు. తరం టర్బైన్, జనరేటర్లను మూడు అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం విద్యుత్తును ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చి కొన్ని రోజులపాటు ట్రయల్ రన్ చేపట్టనున్నారు. అనంతరం మార్చి వారంలో కమర్షియల్ ఆపరేషన్ చివరి వారంలో డిక్లేర్ (సీవోడీ) ప్రకటిస్తారు.
దీంతో 800 మెగావాట్ల 1వ యూనిట్లో పూర్తి స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి దశలోకి తీసుకువస్తారు. మార్చి 10వ తేదీ లోగా 800 మెగావాట్ల 1వ యూనిట్ బాయిలర్ ను ప్రత్యేక ఆయిల్ తో మండించి ప్రారంభించనున్నారు. ప్రయోగాత్మకంగా ప్రారంభమైన వారం రోజుల అనంతరం బొంగుతో బాయిలర్ ను నడిపించనున్నారు.
బూడిద నిల్వ కేంద్రం పనులు 1వ, 2వ యూనిట్లకు సంబంధించి దాదాపు పూర్తయ్యాయి. ఎన్టీపీసీ జలాశయం సమీపంలో దాదాపు 200 ఎకరాల్లో బూడిద నిల్వ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టు ఆవరణలో దాదాపు 8 లక్షల టన్నుల బొగ్గును నిల్వ చేయటానికి బొగ్గు నిల్వ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో నిర్మించారు. దీనికి అనుసంధానంగా రైల్వే లైన్ ను పూర్తి చేయగలిగారు. ఇంధనం కోసం వినియోగించే బొగ్గు ఇప్పుడిప్పుడే సింగరేణి నుంచి పూర్తి స్థాయిలో ఉత్పత్తి దశలోకి తీసుకు రాగానే విడుదలయ్యే బూడిదను సమీపంలోని జలాశయంలో నిల్వ చేసి ఇతర అవసరాలకు వినియోగించనున్నారు.
మరో ఐదు నెలల్లో రెండో యూనిట్..
రెండవ యూనిట్ పనులు పూర్తి కావటానికి మరో ఐదు నెలల కాలం పట్టే అవకాశాలు ఉన్నాయి. మొదటి యూనిట్ లో ఇటీవల ఏర్పడిన బాయిలర్ లో సాంకేతిక సమస్యలను అధిగమించటానికి అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమవటంతో 2వ యూనిట్ పనులు ఆలస్యమైనట్లు తెలుస్తోంది. సెప్టెంబరులోగా పూర్తి చేసి 2వ యూనిట్ ను ఉత్పత్తి దశలోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. రామగుండం ఎన్టీపీసీ పరిశ్రమను ఆనుకొని ఉన్న 600 ఎకరాలు ప్రాజెక్టు స్థలం కాగా ప్రాజెక్టు వ్యయం రూ.10,598.98 కోట్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana