రిపోర్టర్ : సంతోష్
లొకేషన్ : పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ ప్రాంతంలో ప్రతి రోజూ భూకంపం సంభవిస్తుంది. ఈ సమయంలో ప్రజలు ప్రతిరోజూ పరుగులు తీయాల్సిందే. ప్రతి రోజూ భూకంపం ఏంటి?.. ప్రతి రోజూ ప్రజల పరుగులు ఏంటి అనుకుంటున్నారా?. ప్రజా అభిప్రాయ సేకరణ అనంతరం ఓసీపీ5 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఓసీపీ5 ఇప్పుడు గోదావరిఖని ప్రాంత ప్రజలను వణికిస్తోంది.
ఓసీపీలో ప్రతి రోజూ మూడున్నర గంటల ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ తో సుమారు 500 మీటర్ల పైకి దుమ్ము లేసి ఇండ్లపైన పోస్తుంది. బాంబ్ బ్లాస్ట్ జరిగిన కాసేపు ఈ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా వణుకుతుంది. ఈ సమయంలో ప్రజలు బిక్కు బిక్కు మంటూ రోడ్లపైకి వచ్చి నిల్చుంటున్నారు. బాంబ్ బ్లాస్ట్ దెబ్బకి ఇండ్ల గోడలు పగులుతున్నాయి.. ఇంట్లో సామానులు ఊగుతున్నాయి. దుమ్ముతో చిన్న పిల్లకి వ్యాధులు వస్తున్నాయి. వృద్దులు శ్వాశ కోశ ఇబ్బంది పడుతున్నారు.
బొందల గడ్డగా మార్చేశారు కదా..
గోదావరిఖని ప్రాంతం మొత్తం కూడా కాలుష్య కోరల్లో చిక్కుకున్నది. ఓసిపిలు 5 గుట్టలుప్రాంతాలను చుట్టి మట్టి నగరాల చుట్టూ వెలవడంతో కాలుష్యం ఇంకా పెరింగింది. ఓసిపి నుండి బాంబ్ బ్లాస్టింగ్, బొగ్గు రవాణా చుట్టుప్రక్క ప్రాంతాలపై దుమ్మెత్తి పోస్తుంది. అయితే ఇంత జరుగుతున్నా వాటిని నియంత్రించే వారు కానీ.. శ్రద్ద తీసుకునే వారు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అనాడు ప్రజా అభిప్రాయ సేకరణలో అధికారులు ఎటువంటి దుమ్ము ధూళి రాకుండా.. శబ్ధం కూడా రాకుండా హై టెక్నాలజీతో చేస్తున్నామని నమ్మబలికి ఓసీపీని ప్రారంభించి.. ఇప్పుడు ప్రజలు తినే అన్నంలో కూడా దుమ్ము పడుతున్నా కనీస పర్యవేక్షణ కూడా లేదంటూ స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇలా చేస్తే బ్రతోకచ్చు..
ఎయిర్ క్వాలిటీ మానిటర్స్ ఓపెన్ కాస్టు పరిధిల్లో, పరిసరాల్లో ఏర్పాటుచేసి వాతావరణ కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన బాధ్యతను సింగరేణి, కాలుష్య నియంత్రణ మండలి విస్మరించాయి. గుట్టపై మట్టిని డంప్ చేస్తున్న సమయంలో నీళ్లు చల్లిపట్టణ నివాస ప్రాంతాలపై పడుతున్న మట్టి దుమ్మును నియంత్రించాలి. ఇక్కడ కోట్ల రూపాయల బొగ్గును తవ్వుతూ వెళుతున్న సింగరేణి తద్వారా ఏర్పడుతున్న కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యతను తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
భయంతో వణుకుతున్న ప్రజలు..
ఓసీపీ మట్టి నివాస ప్రాంతాలపైకి రాకుండా ప్రాజెక్టు పట్టణం వైపు పరదాలు కట్టినప్పటికీ ఆ పరదాలు పది మీటర్ల ఎత్తుదాటి లేవు. కానీ మట్టిమాత్రం500ఫీట్ల పైన లేస్తుంది. దీంతో దుమ్ము సరాసరిగా గోదావరిఖని లక్ష్మీనగర్, విఠల్నగర్, రాంనగర్, సీతానగర్, జనగామ, సీఎస్పీ కాలనీ, తిలక్నగర్, పవర్ హౌసరాలనీ వరకు దుమ్ము ధూళి పోస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana