హోమ్ /వార్తలు /తెలంగాణ /

అక్షరాభ్యాసం ఎందుకు చేస్తారో తెలుసా..?

అక్షరాభ్యాసం ఎందుకు చేస్తారో తెలుసా..?

X
అక్షరాభ్యాసం

అక్షరాభ్యాసం ఎందుకు చేస్తారో తెలుసా..?

అక్షరారంభం అనేది హిందూ ధర్మ శాస్త్ర సంప్రదాయాల ప్రకారం ఒక ఆచారం. ఈకార్యక్రమం పిల్లల కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం శ్రీ లక్ష్మి దేవి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపి అక్షరాలు దిద్దించడం ప్రారంభిస్తారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle | Telangana

E.Santosh, News18, Peddapalli

అక్షరారంభం అనేది హిందూ ధర్మ శాస్త్ర సంప్రదాయాల ప్రకారం ఒక ఆచారం. ఈకార్యక్రమం పిల్లల కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం శ్రీ లక్ష్మి దేవి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపి అక్షరాలు దిద్దించడం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని సాధారణంగా ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పంచమి నాడు, వసంతపంచమి నాడు జరుపుకుంటారు. ఈ పూజా కార్యక్రమంలో పిల్లలకు విద్యాదీక్ష తీసుకోవడంతో పాటు, తద్వారా పిల్లవాడు అధికారిక విద్యను పొందేందుకు సిద్ధంగా తయారవుతాడు అని అర్థం. అందుకే పసి పిల్లలకి అక్షర అభ్యాసం చెపిస్తారు. ఈ ఆచారంలో సరస్వతీ దేవికి కూడా పూజలు నిర్వహిస్తారు.

సరస్వతి శిశు మందిర్ లో..

పెద్దపల్లి జిల్లా రామగుండం శ్రీ సరస్వతి శిశు మందిర్ లో ప్రతి ఏడాది అక్షర అభ్యస కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా బాసరలో లక్ష్మి దేవి వద్ద పూజలు నిర్వహించే కుంకుమ, అక్కడ పూజలు నిర్వహించిన లక్ష్మి దేవి ఫోటోను తీసుకొచ్చి శ్రీ సరస్వతి శిసుమందిర్ పాఠశాలలో అక్షర అభ్యాసం చేస్తారు. దేశ వ్యాప్తంగా విద్యాభారతి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలల్లోభారతీయ సంప్రదాయాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని సామూహిక అక్షరాభ్యాసాల పేరుతో ప్రతి సంవత్సరం వసంతపంచమి నాడు నిర్వహించి, పిల్లలకు అక్షర పరిచయం చేస్తారు. ఈ కార్యక్రమానికి రామగుండంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి పిల్లలకు అక్షర అభ్యాసం చేయిస్తారు.

ఇది చదవండి: కోడిపందేలు అయిపోయాయి.. ఇక పొట్టేలు పందేలు మొదలు..!

భారతీయ సంప్రదాయం..!

భారతీయ సంప్రదాయంలో శోధస సంస్కరణలు కొన్ని ఉన్నాయి. అవి గర్భధారము, శ్రీమంతం, జాతక కర్మ, నామ కారణము, అన్న ప్రాసన, చౌలం, ఉపనయనం, శ్నతకం, వివాహం, అక్షరాభ్యాసం వంటి సంస్కరణలు ఉన్నాయి. ఇందులో అక్షరాభ్యాసం కూడా మన భారతీయ సంస్కరణలో ఒక భాగమే. అక్షర అభ్యాసం చేస్తే పిల్లలకి విఘ్నేశ్వరుని, సరస్వతి చదువుల దేవతల అనుగ్రహం కలిగి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతారని శాస్త్రాలు చెపుతున్నాయి. అందుకే మన భారతీయులు పిల్లలకి అక్షర అభ్యాసం చేపిస్తారు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు