హోమ్ /వార్తలు /తెలంగాణ /

మీకు కేఎఫ్‌సీ తెలుసు.. మరి టీఎఫ్‌సీ తెలుసా..? టేస్ట్ మాత్రం సూపర్ హిట్..!

మీకు కేఎఫ్‌సీ తెలుసు.. మరి టీఎఫ్‌సీ తెలుసా..? టేస్ట్ మాత్రం సూపర్ హిట్..!

X
పెద్దపల్లిలో

పెద్దపల్లిలో ఆకట్టుకుంటున్న టీఎఫ్‌సీ చికెన్

ప్రపంచ వ్యాప్తంగా కే ఎఫ్ సీ చికెన్ (KFC Chicken) అంటే తెలియని వారుండరు. KFC చికెన్ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలని నోరు ఊరిస్తుంది. అక్కడ దొరికే చికెన్ వెరైటీలు అన్నీ కూడా నోట్లో పెట్టగానే కరిగిపోతూ ఎంతో రుచితో అంతటి నాణ్యతతో కూడా ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle | Telangana

E.Santosh, News18, Peddapalli

ప్రపంచ వ్యాప్తంగా కే ఎఫ్ సీ చికెన్ (KFC Chicken) అంటే తెలియని వారుండరు. KFC చికెన్ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలని నోరు ఊరిస్తుంది. అక్కడ దొరికే చికెన్ వెరైటీలు అన్నీ కూడా నోట్లో పెట్టగానే కరిగిపోతూ ఎంతో రుచితో అంతటి నాణ్యతతో కూడా ఉంటుంది. ఈ చికెన్ నీ స్నాక్ ఐటమ్స్ గా మార్చే విధానంలో మెత్తటి చికెన్, శనగపిండి, ఇతర మసాలాలు దట్టించి సలసల కాగే నూనెలో వేయించుతారు. దీంతో చికెన్ ఎంతో రుచిగా మారిపోతుంది. నగరాల్లో నాన్ వెజ్ ప్రియులు కే ఎఫ్ సీ చికెన్ చూసి లొట్టలు వేయకుండా ఉండలేరు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెద్ద సంఖ్యలో కేఎఫ్సీ అవుట్ లెట్స్ ఓపెన్ చేసినప్పటికీ ఆ ఫాస్ట్ ఫుడ్ రుచులు పెద్ద నగరాల్లో నివసించే ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి చిన్న పట్టణాల్లో ఈ కేఎఫ్ సీ రెస్టారెంట్స్ ఎక్కడా కనిపించవు. పట్టణాల్లోని చికెన్ ప్రియులుఅలాంటి స్నాక్స్ తినాలనుకున్నా తినలేక పోతున్నారు. అలాంటి వారి కోసమే కేఎఫ్ సీని ఆదర్శంగా తీసుకుని పెద్దపల్లి జిల్లా (Peddapalli District) గోదావరిఖనికి చెందిన ఓ యువకుడు ఆలోచన చేసి అచ్చు గుద్దిన్నట్టు KFC మాదిరిగానే TFCని ప్రారంభించాడు. కేఎఫ్సీ రుచికి ఏ మాత్రం తీసిపోకుండా ఫ్రైడ్ చికెన్ తయారు చేసి స్థానికంగా వినియోగదారులను ఆకర్షిస్తున్నాడు.

ఇది చదవండి: యూట్యూబ్, గూగుల్ బాగుండాలంటూ పోచమ్మకు బోనాలు.. యూట్యూబర్ల జాతర..

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ముప్పిడి సత్య ప్రసాద్ స్థానికంగా లక్ష్మీనగర్ లో TFC అనే చికెన్ స్నాక్ కార్నర్ ఏర్పాటు చేశాడు. ఇక్కడికి వచ్చే వినియోగదారులను ఆకర్షించేందుకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ప్రదేశాన్నిచాలా అద్భుతంగా తయారు చేశాడు. దీంతో ప్రజలు ఇక్కడ దొరికే చికెన్ స్నాక్స్ ని ఇష్ట పడుతున్నారు.

ఇది చదవండి: ఒక్క సంతకం విలువ రూ.5 లక్షలు.. ఎక్కడో తెలుసా?

పట్టణాలు, నగరాల్లో ఫ్రైడ్ చికెన్ పై వినియోగదారుల్లో ఉన్న డిమాండ్ ను గ్రహించి గోదావరిఖని వాసులకు ఆ రుచిని అందించాలనిఇక్కడ ఈ TFC రెస్టారెంట్ ఏర్పాటు చేసినట్లు యజమాని ముప్పిడి సత్యప్రసాధ్ అన్నారు. నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన చికెన్ స్నాక్స్ అందుబాటులోకి తీసుకురావడంతో సమీప ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ ఫ్రైడ్ చికెన్ ను టేస్ట్ చేస్తున్నారని తెలిపారు. స్థానిక వినియోగదారులే కాకుండా జిల్లా వ్యాప్తంగా తమకు ఆర్డర్స్ వస్తున్నాయని చెప్తున్నారు.

ఇక్కడ దొరికే స్నాక్స్ ఇవే..

చికెన్ లాలీపాప్, చికెన్ కబాబ్, పోప్ చికెన్, చికెన్ బర్గర్, వెజ్ బర్గర్, ఫింగర్ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రైస్ తో పాటు పలురకాల డ్రింక్స్ కూడా TFCలో దొరుకుతాయి. TFC చికెన్ లో దొరికే ఐటమ్స్ పెద్ద నగరాల్లో మాత్రమే దొరుకుతాయి. TFC లేకముందు ఇక్కడ చికెన్ స్నాక్స్ అందుబాటులో లేవు. ఇక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా చికెన్ స్నాక్స్ ఆస్వాదిస్తున్నారు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు