(పి. శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా, న్యూస్ 18 తెలుగు)
ఓ వైపు భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల వ్యవహారం నడుస్తుండగా అధికార పార్డీకి చెందిన మరో నాయకుడు కనిపించడం లేదంటూ స్థానిక నాయకులు ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లా జెడ్పీచైర్మన్ పుట్టమధు జాడ గత మూడు రోజుల నుంచి తెలియకుండా పోయింది. తన ఎస్కార్ట్ ను వదిలి ఒంటరిగా సొంత వాహనంలో వెళ్లాడని సన్నిహితులు చెపుతున్నారు. ఇప్పటికిప్పడు అదృశ్యం కావడం వెనక ఆంతర్యం ఏంటో అంతుచిక్కకుండా తయారైంది . అయితే తను ఎక్కడికెళ్లాడు అన్న విషయం తెలుసుకునే పనిలో పోలీసు అధికారులు పడ్డారని సమాచారం. గన్ మెన్లకు కూడా తెలియకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది. ఐతే వరంగల్ మునిసిపల్ ఎలక్షన్ ఇంచార్జిగా వెళ్లిన పుట్టమధు ప్రచారం ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చి అదే రాత్రి వెళ్లిపోయాడని చెపుతున్నారు. ఇగ ఇదే టైం లో ఈటల వ్యవహారం బయటకు రావడం.. కూడా ఒక కారణం అని కూడా చర్చనీయాంశంగా మారింది. ఈటల కు పుట్ట మధు అత్యంత సన్నిహితుడు అని తెలుసు,పెద్దపల్లి జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఐన ఈటల ను తీసుకు వచ్చి పలు అభివృద్ధి పనులు తన చేతుల మీదిగా చేయించుకునేవాడని తన అనుచరులు చెపుతున్నారు.
ఒకవేళ ఈటలతో రహస్య మంతనాలు ఏమైనా జరుపుతున్నాడా అనేది ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా ఇంకా కొంతమంది చెపుతున్న విషయం ఏమిటంటే.. గతంలో జరిగిన గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు పై వస్తున్న ఆరోపణలు నిజమేనని కావున తనను తాను కాపాడుకోవాలని ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నాడని మరికొందరి అభిప్రాయం. ఇంకొంత మంది చెపుతున్న విషయం ఏమిటంటే పుట్టమధుకు కరోనా సోకిందని హైదరాబాద్ లో హోమ్ ఐసొలేషన్ లో ఉన్నాడని అందుకే ఎవరికీ కాంటాక్ట్ లో లేడని.. ఫోన్ స్విచ్చాఫ్ పెట్టాడని మరికొందరికి వాదన.
ఏది ఏమైనప్పటికీ ఈటల విషయం బయటకు రావడం తో ఒక్కసారిగా పుట్టమధు అజ్ఞాతములో కి వెళ్లడం ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తను అజ్ఞాతము వదిలి బయటకు వస్తేగాని అసలు విషయం తెసుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Etela rajender, Karimnagar, Leader missing, Peddapalli, Telangana