Home /News /telangana /

PEDDAPALLI DISEASES SPREADING AMONG STRAY DOGS IN GODHAVARIKHANI LOCALITES FEAR FOR LIFE PSE BRV PRV

Peddapalli: బీ అలెర్ట్​.. వీధి కుక్కలకు వింత రోగాలు: మనుషులకు వ్యాపిస్తుందా? 

వీధి

వీధి కుక్కలు

వీధి కుక్కలు వ్యాధుల బారిన పడుతున్నాయి. కుక్కల ఒంటిపై బొచ్చు ఊడిపోయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వ్యాధులు వీధి కుక్కలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఈ వ్యాధులకు గురైన వీధి కుక్కలు సంచారం ఎక్కువగా ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India
    (E. Santosh, News 18, Peddapalli)

    వీధి కుక్కలు (Street Dogs) వ్యాధుల బారిన పడుతున్నాయి. కుక్కల ఒంటిపై బొచ్చు ఊడిపోయి, చర్మ వ్యాధులు (Skin Diseases) వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వ్యాధులు వీధి కుక్కలోనే ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దపల్లి  (Peddapalli) జిల్లా గోదావరిఖని ప్రాంతంలో వ్యాధులకు గురైన వీధి కుక్కలు సంచారం ఎక్కువగా ఉంది. ఆ వ్యాధుల తీరుతెన్నులు తెలియని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కుక్కల నుంచి ఆ వ్యాధులు మనుషులకు సంక్రమిస్తాయన్న భయం పట్టణ ప్రజలను వెంటాడుతుంది. మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల (Stray dogs) సంచారాన్ని అడ్డుకోవాలని, వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాగా, వీధి కుక్కలు వ్యాధుల భారిన పడడం, ఆ వ్యాధులు మనుషులకు సోకుతుందా అన్న అంశాలపై గోదావరిఖని పట్టణ పశువైద్యాధికారి రామస్వామి పలు సూచనలు చేశారు.

    "వీధి కుక్కలకు సాధారణంగా వర్షాకాలం వాతావరణ మార్పుల వల్ల శరీరంలో కొంత మార్పు ఏర్పడి వాటి జుట్టు ఊడిపోవడం సహజం. తిరిగి కొద్ది రోజుల్లో బొచ్చు దానంతట అదే పెరుగుతుంది. దాని వల్ల ప్రజలు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సినిమాల్లో చూపించినట్లు ఉండదు" అని డాక్టర్ రామస్వామి తెలిపారు.



    మనం వీధి కుక్కను ముట్టుకుంటే ఏమవుతుంది?

    వీధి కుక్కను ముట్టుకుంటే రేబిస్ (Rabis) బారిన పడే అవకాశం ఉంటుంది. మనుషులకు, పెంపుడు జంతువులకు సంక్రమించే ఇతర వ్యాధులను కూడా వీధి కుక్కలు కలిగి ఉండవచ్చు. సాధారణంగా కొందరు వీధి కుక్కలకు ఆహారం అందిస్తూ వాటిని చేతితో నిమురుతుంటారు. అటువంటి సమయంలో వెంటనే వేడి నీటితో శుభ్రంగా స్నానం చేసుకుంటే వాటిని నుండి మనుషులకు సోకిన క్రిముల నుండి ఉపశమనం లభిస్తుంది.

    కుక్కల నుండి కరోనా వ్యాపిస్తుందా?:

    వీధి కుక్కలకు కరోనా వచ్చే అవకాశం లేదని డబ్ల్యూ.హెచ్.ఓ తెలిపిందని, వీధి కుక్కలనే కాదు ఏపశువుకైనా కరోనా వచ్చే అవకాశం లేదని దాని వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ రామస్వామి వివరించారు. వీధి కుక్కలను తాకడం వలన వ్యాధులు సంక్రమించే అవకాశం లేనప్పటికీ మనుషులు తమ జాగ్రత్తల్లో ఉండాలని పశువైద్యాధికారి సూచిస్తున్నారు.

    హైకోర్టు ఆదేశాలతో చెక్ ..

    కుక్కలను క్రూరంగా చంపకుండా వాటి సంతతిని నియంత్రించే ప్రక్రియను 150 రోజుల్లో పూర్తి చేయాలని హై కోర్ట్ (High Court) తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు రామగుండం నగర పాలక సంస్థ అధికారులు ప్రణాళికలు రూపొందించి, అందులో భాగంగా యానిమల్ బర్త్ కంట్రోల్‌ను ఏర్పాటు చేసి, కుక్కల సంతతి నియంత్రణకు చర్య లు చేపడుతున్నారు. కుక్కలు పట్టణాల్లోని వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కుక్క గాట్ల వల్ల రాబిస్ వ్యాధితో పాటు అనేక వ్యాధులు సక్రమించి ప్రాణపాయస్థితి కూడా వస్తుంది. ఈ విధంగా ప్రజలకు తీవ్ర సమస్యగా మారిన కుక్కల నియంత్రణకు రామగుండం శ్రీనగర్ కాలనీలో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Local News, Peddapalli, Stray dogs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు