హోమ్ /వార్తలు /తెలంగాణ /

డిగ్రీ చదివే కుర్రాడి పావ్ బాజీ బండి.. సాయంత్రమైతే క్యూ కట్టాల్సిందే..!

డిగ్రీ చదివే కుర్రాడి పావ్ బాజీ బండి.. సాయంత్రమైతే క్యూ కట్టాల్సిందే..!

X
పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లాలో పావ్ బాజీ వ్యాపారం చేస్తున్న విద్యార్థి

మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో పావ్ భాజీ ఒక‌టి. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. తింటూ ఉంటే తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ పావ్ భాజీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India

E.Santosh, News18, Peddapalli

మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో పావ్ భాజీ ఒక‌టి. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. తింటూ ఉంటే తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ పావ్ భాజీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్ట‌ప‌డ‌తారు. ఒకప్పుడు ముంబైకి మాత్రమే పరిమితమైన పావు భాజీ ఇప్పుడు చిన్న పట్టణాల్లో కూడా విస్తరించింది. దీంతో స్థానిక యువకులకు మంచి లాభదాయకమైన వ్యాపారం నడుస్తుంది. పెద్దపల్లి జిల్లా (Peddapalli District) గోదావరి ఖనికి చెందిన సంతోష్ అనే యువకుడు స్థానికంగా పావు బజ్జి స్నాక్ పాయింట్ ఏర్పాటు చేసి మంచిరుచికరమైన రిస్పీని ఇస్తు వ్యాపారంలో రాణిస్తున్నాడు.

సంతోష్ స్థానికంగా ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. పొద్దున కాలేజీకి వెళ్లి విద్యా బోధనలు నేర్చుకుంటూనే సాయంత్రం పూట పావ్ బజ్జీ వ్యాపారం ప్రారంభించి మంచి ఆ వయసు కుర్రాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పావ్ బాజీ కావాల్సిన రిస్పిలు అన్ని వేసి ఇంట్లోనే కావల్సినంత వెజ్ ఫ్లేవర్ ను తయారు చేసుకుని వస్తారు. ఇక్కడ ఆర్డర్ రాగానే 5 నిమిషాల్లో తయారు చేసి ఇస్తారు.

ఇది చదవండి: జై భీమ్ అంబేద్కర్ దీక్షలు.. ఈ దీక్షల నియమ నిబంధనలివే..!

పెనం మీద బ‌ట‌ర్ ను వేసి బ‌ట‌ర్ క‌రిగిన త‌రువాత దానిపై పావ్ ను మ‌ధ్యలోకి క‌ట్ చేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చి ప్లేట్ లోకి తీసుకొని.. త‌యారు చేసుకున్న పావ్ భాజీని వేడి వేడిగా, బ‌ట‌ర్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం స‌మ‌యాల్లో ఈ పావ్ భాజీని స్నాక్స్ గా చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిలో ఎంత ఎక్కువ బ‌ట‌ర్ ను వేస్తే అంత రుచిగా ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు.

ప్రతిరోజు సాయంత్రమైతే చాలు ఈ యువకుడికి అదిరిపోయే వ్యాపారం నడుస్తుంది. 6 గంటలకి ఆ పాప్ భాజీ బండి ప్రారంభమై 10 గంటలకు క్లోజ్ చేసేస్తారు. ఈ నాలుగు గంటల్లోనే సుమారు రూ.2000 రూపాయల కౌంటర్ నడుస్తుందని నిర్వాహకుడు సంతోష్ తెలిపాడు. ఉద్యోగాలు లేక ఆత్మ హత్యలకు పాల్పడుతున్న వారు సంతోష్ ఆత్మ స్థైర్యాన్ని చూసి గర్వపడాలి. నిరుద్యోగ యువత ఎవరైనా సరే.. ఖాళీగా ఇంట్లో ఉండే బదులు ఇలాంటి బిజినెస్ లు కనుక ప్లాన్ చేసినట్టు అయితే లాభాలు గడించడం సులభం అవుతుంది.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు