హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: గోదావరిఖని గాంధీ చౌరస్తాలో దారుణ హత్య

Peddapalli: గోదావరిఖని గాంధీ చౌరస్తాలో దారుణ హత్య

నడిరోడ్డుమీద హత్య

నడిరోడ్డుమీద హత్య

Telangana: ఆదివారం రాత్రి గోదావరిఖని 1టౌన్ పోలీస్టేషన్ పరిధిలో దారుణమైన హత్య కలకలం సృష్టించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని అంబేడ్కర్ నగర్కి చెందినమంథని సుమన్ పై పట్టణ చౌరస్తాలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : సంతోష్

లొకేషన్ : పెద్దపల్లి

ఆదివారం రాత్రి గోదావరిఖని 1టౌన్ పోలీస్టేషన్ పరిధిలో దారుణమైన హత్య కలకలం సృష్టించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని అంబేడ్కర్ నగర్కి చెందినమంథని సుమన్ పై పట్టణ చౌరస్తాలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుమన్ ను రక్తపు మడుగులో పడి ఉన్నట్టు గుర్తించిన పోలీసులు, బాధితుడ్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.

మంథని సుమన్ గాంధీ చౌరస్తాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. గతంలో సుమన్ పలు హత్య కేసుల్లో కీలకంగా ఉన్నాడు. దీంతో మంథని సుమన్ పై పలు హత్య కేసులు ఉన్నాయి. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, వన్ టౌన్ పోలీసులు పరిశీలించారు.

నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం...

మంథని సుమన్ గతంలో పలు కేసులు ఉన్నాయి. స్థానిక పోలీసులు సుమన్ పై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సుమన్ గాంధీ చౌరస్తా వద్ద నూడుల్స్ పాయింట్, బిర్యానీ పాయింట్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గాంధీ చౌరస్తా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కాగా షాపులు జనాలతో రద్దీగా ఉన్న సమయంలోనే ఒక్కసారిగా దాడి చేశారు. ఇది చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. సినిమాలో జరిగే ఫ్యాక్షన్ సీన్లకు ఏ మాత్రం తగ్గకుండా ఇలా నడి రోడ్లపై హత్య జరగడం స్థానికంగా కలకలo రేపుతుంది. అందరూ చూస్తుండగానే మృతుడిపై దాడి జరగడంతో ఖనిలో కలలకలం రేగింది. గోదావరిఖని చౌరస్తా, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున జనం గమ్మిగూడారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు