హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : పెద్దపల్లి జిల్లాలోని రెండు పట్టణాల పేరు చెబితే హడలే .. క్రైంలో టాప్‌ ప్లేస్‌ వాళ్లదే

Telangana : పెద్దపల్లి జిల్లాలోని రెండు పట్టణాల పేరు చెబితే హడలే .. క్రైంలో టాప్‌ ప్లేస్‌ వాళ్లదే

PEDDAPALLI CRIME

PEDDAPALLI CRIME

Crime cases: అక్రమ దందాలన్నీ ఆ జిల్లాలోనే నడుస్తున్నాయి. అవును ఇది అక్షరాల నిజం .పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, గోదావరిఖని పేరు చెబితే చాలు వందల సంఖ్యలో భారీ నేరాలు, వేలల్లో చోరీలు, రాబరీలు, చిన్న చితక నేరాలు గుర్తుకు వస్తాయి. అక్కడే ఎందుకిలా జరుగుతుందో తెలుసా.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India

(P.Srinivas,New18,Karimnagar)

అక్రమ దందాలన్నీ ఆ జిల్లాలోనే నడుస్తున్నాయి. అవును ఇది అక్షరాల నిజం .పెద్దపల్లి(Peddapally)జిల్లా రామగుండం (Ramagundam) గోదావరిఖని (Godavarikhani) ఎరువుల కర్మాగారం ఆర్.ఎఫ్.సి.ఎల్ (RFCL).కంపెనీలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు పెట్టిస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి వద్ద నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. RFCLతో మొదలు కొని సింగరేణి (Singareni),అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు  ఇంకా ఆన్‌లైన్‌ మోసాలు (Online scams), లవ్ ఏఫైర్స్(Love affairs), గంజాయి, రౌడీ షీటర్స్, బెట్టింగ్స్ (Betting), పేకాట,ఇలా ఒకటేంటి ఏ క్రైమ్ అయినా ఇక్కడనే మొదలు అవుతుంది.

Extramarital Affair : డబ్బు కోసమే వివాహితతో సహజీవనం .. భర్తను వదిలొచ్చినందుకు చివరికి ఏమైందంటే..?పెద్దపల్లి జిల్లా అందులో టాప్..

పెద్దపల్లి జిల్లాలోని అమాయక జనాలను చూసి జాబ్స్ పేరుతో మోసాలు, ఆన్‌లైన్‌ చీటింగ్, సైబర్ ఫ్రాడ్స్‌తో నట్టేటముంచుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉసరవెల్లి రంగులు మార్చినట్లుగా నేరాలు, మోసాలు వేర్వేరు పద్దతుల్లో జరుగుతున్నా వసూల్ రాజాలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడం రామగుండం ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నది. మరోవైపు దుర్మార్గులు దోచుకుంటూనే ఉన్నారు. అక్రమ ఉద్యోగాల పేరుతో దందాలు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయని తెలిసిన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎవరు ఏం చేయడం లేదని ఇక్కడి ప్రజలు మండిపడుతున్నారు.

క్రైమ్ కేసులకు కేరాఫ్ ..

ఉద్యోగాల పేరుతో ఇక్కడ జకరుగుతున్న అవినీతి అంత ఇంత కాదు. కోట్లలో స్కాం ఇక్కడ జరిగినట్లుగా ప్రజలు, బాధితులు లబోదిబోమంటూ రోడ్డెక్కుతున్నా ప్రభుత్వానికి మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరించడం  మొదట నుండి అలవాటుగా మారింది. మార్కెట్‌లో కొత్తరకం మోసం జరిగిందంటే అది ఖచ్చితంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలోనే మొదలవుతుందనే విధంగా తయారైంది పరిస్థితి. ఇల్లీగల్‌ వ్యవహారాలకు రామగుండం, గోదావరిఖనే ఎందుకు నెలవుగా మారిందంటే ఇక్కడికి ట్రైన్ సౌకర్యాలు అలాగే రవాణా మార్గం చుట్టూ గోదావరి ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.అంతే కాదు రామగుండం అంటేనే పారిశ్రామిక పట్టణంగా పేరు పొందింది. ఇక్కడకి ఎక్కడెక్కకడి నుండే వలస కార్మికులు వచ్చి పనులు చేస్తుంటారు. అలా ఇక్కడ క్రైమ్ ఎక్కువగా జరుగుతుంది.

BJP vs TRS : దుబ్బాకైనా.. సిద్దిపేటైనా నేను రెడీ నువ్వు పోటీకి సిద్ధమా హరీష్‌రావుకు రఘునందన్‌రావు సవాల్స్కాంలకు అనేక కారణాలు..

దేశంలోనే రెండో అతిపెద్ద థర్మల్ విద్యుత్ ఉండటం ఒక కారణమైతే కొత్తగూడెం తర్వాత రెండో అతిపెద్ద సింగరేణి మైనిగ్స్ ఉండటం మరో కారణంగా చూడాలి. జన సామర్ద్యంతో పాటు కొత్త వాటర్ సోలార్ ప్లాంట్ పెట్టడంతో ఇక్కడ డబ్బుకు కొదవలేదన్నట్లుగా మారింది. దీంతో కొంతమంది దళారులు డబ్బులు సొమ్ము చేసుకోవడానికి ఉద్యోగాల పేరుతో భారీ మోసాలకు తెర తీస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటివి మోసాలను అరికట్టాలని పోలీసులకు ప్రజలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. నెలకు క్రైమ్‌కి సంబంధించి సుమారు 10 కేసులకుపైగా నమోదువుతూనే ఉంటాయి. అడుగడుగున అరాచకాలు జరుగుతున్నాయంటే ఇక్కడ క్రైమ్ రేట్ ఏ రేంజ్‌లో జరుగుతుందో ఇట్టే ఆర్ధం చేసుకోవచ్చు. భారీ స్కామ్‌లు, మోసాలు, అరాచకాలు,సెటిల్‌మెంట్‌లు, దందాలు నాణానికి ఓవైపు అయితే చిన్న చితక చోరీలు, రాబరీలు, చైన్ స్నాచింగ్‌లు, దాడులకు సంబంధించిన కేసులైతే లెక్కే లేదంటున్నారు జిల్లా ప్రజలు. ఇవన్నీ నాణానికి ఇవి రెండో వైపుగా చూడాలంటున్నారు.

First published:

Tags: Peddapalli, Telangana crime news

ఉత్తమ కథలు