(సంతోష్, న్యూస్ 18, పెద్దపల్లి జిల్లా)
ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌కి ఎంత క్రేజ్ ఉందనేది మనం చూస్తూనే ఉన్నాం. ఏ గల్లిలో చూసిన రీల్స్, ఏ రోడ్డు మీద చూసిన వ్లాగ్స్, ఎక్కడికి వెళ్ళినా షార్ట్ ఫిల్మ్స్ కనబడుతూనే ఉన్నాయి. అయితే యూట్యూబ్ నుండి వ్యూవర్ షిప్ వచ్చిన వారికి సంపాదన కూడా వస్తుండడంతో ఎంత ఖర్చు అయినా చేసి షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. 10 నుండి 15 నిమిషాల సినిమా అయినప్పటికీ అనుకున్నది అనుకున్నట్టు తీయడానికి క్యారెక్టర్ అనుగుణంగా తయారు అవుతూ వ్యూయర్ లను మెప్పిస్తున్నారు.ప్రస్తుతం రామగుండం, గోదావరిఖని ప్రాంతాల్లో షార్ట్ ఫిల్మ్స్ మేకింగ్ పోటా పోటీగా నడుస్తుంది. దీంతో మేకింగ్ ఆధారంగా చేసుకొని మరి కొంత మంది ఉపాధి కూడా పొందుతున్నారు.
గోదావరిఖనికి చెందిన సతీష్ కుమార్ పులియాల కాస్ట్యూమ్ షాప్ నిర్వహిస్తున్నాడు. దీంతో రామగుండం, గోదావరిఖని ప్రాంతాలకు చెందిన యూట్యూబ్ ఆర్టిస్టులు వారికి కావాల్సిన మొత్తం కాస్ట్యూమ్స్, విగ్స్, మేకప్ కిట్స్ అద్దెకి తీసుకెళ్తుంటారు. దీంతో ఇలా యూట్యూబ్ నుండి పరోక్షంగా వేతనం పొందుతున్నాడు. గోదావరిఖని ప్రాంతానికి చెందిన సతీష్ పులియాల సింగరేణి కార్మికుడు కాగా.. ఒకవైపు కళాకారుడిగా రానిస్తునే కాస్ట్యూమ్స్ తో బిజినెస్ చేస్తున్నాడు. సింగరేణి కళాకారుల ఐక్యవేదిక ద్వారా ఆర్జీ 1 కల్చరల్ కెప్టెన్ గా సింగరేణి సాంసృతిక కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. కళాకారుడుని కాబట్టి ముందు తరాన్ని ముందుగానే గుర్తించి కాస్ట్యూమ్స్ బిజినెస్ చేస్తున్నట్లుగా సతీష్ తెలిపాడు.
ఇక్కడ లభించేవి...
సతీష్ కాస్ట్యూమ్స్ షాప్స్‌లో లభించే వస్తువులు ఇవే.. కాస్ట్యూమ్స్, విగ్గులు, కళాకారుల కాస్ట్యూమ్స్, దేవుళ్ళ కాస్ట్యూమ్స్, మేకప్ కిట్టులు, పోలీసు, ఆర్మీ డ్రెస్సులు, ఖడ్గం, బాణాలు, ట్రెడిషనల్ షూట్ సంబంధించిన కాస్ట్యూమ్స్, ఇలా మనకు ఏ క్యారెక్టర్ కు కావలసిన కాస్ట్యూమ్స్ అయినా మేకప్ కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ లభిస్తాయి. సినిమాలతో సమానంగా యూట్యూబ్ కి ఆదరణ పెరుగుతున్న కారణంగా బిజినెస్ చాలా బాగా నడుస్తుందని సతీష్ అన్నారు. తమ వద్ద ఉన్నవి కాకుండా ఇంకా ఏ వెరైటీ కావాలన్నా ముందుగా బుక్ చేసుకున్న వారికి తెప్పించి ఇస్తామని కూడా చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli