E.Santosh, News18, Peddapalli
ఈ ఇద్దరి మహిళలు అనేక సవాళ్లను అధిగమించి వ్యాపారంలో రాణిస్తున్నారు. మొదట్లో పొలం పనులకు పోయేది. డబ్బులు సరిగ్గా రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుటుంబం కూడా ఎన్నో బాధల మధ్య గడిచేది. సొంతంగా ఎదగాలనే ఆలోచనతో చిన్నగా ఇంటి ముందే చపాతి పాయింట్ పెట్టారు. ఒక్కసారి రంగంలోకి అడుగుపెట్టిన వాళ్లు నిరంతర శ్రమతో వేలాది హృదయాలను గెలిచారు. అత్యున్నత స్థితికి చేరుకున్నారు. పనిని ప్రేమిస్తే ఫలితం వరిస్తుందనే సూత్రంతోక్లిష్ట పరిస్థితుల్లోనూ కష్ట పడ్డారు. విజయాన్ని పొందారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే.. మరోవైపు వ్యాపారం సామ్రాజ్యంలో తమ నైపుణ్యాలతో శభాష్ అనిపించుకుంటున్నారు ఈ ఇద్దరు మహిళలు. పెద్దపల్లి జిల్లా (Peddapalli District) గోదావరి ఖనిలోని రమేష్ నగర్ కి చెందిన శ్యామల, స్వరూప ఇంటి ముందే చపాతి వ్యాపారం పెట్టి సక్సెస్ అయ్యారు.
చపాతి జీవితం గెలవడం ఎంటా అనుకుంటున్నారా.. ఎలానో చదివేయండి. వారి కుటుంబ నేపథ్యంఅంతంత మాత్రమే. కష్టపడితే కానీ ఒక రోజు గడవక పోయేది. అలాంటి పరిస్థితులకు ఎదుర్కునేందుకు ప్రతి రోజూ పొద్దున లేచి సద్ది కట్టుకొని పొలాల్లో వరి నాటుకి, పత్తి కోసేందుకు వెళ్ళేవారు. దాంతో వచ్చే డబ్బులు ఇంట్లో అవసరాలకు సరిపోయేవి కూడా కాదని ఆ మహిళలు ఇద్దరు తెలిపారు. కులీ డబ్బులు ఒక్కసారిగా రాకేపోయేదని.. అప్పుడు కొన్ని, ఇప్పుడు కొన్ని వచ్చేవి. అవికూడా అప్పటి ఖర్చులకు మాత్రమే సరిపోయేవి. ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుల కోసం వెళ్లే వారమని చెప్పారు.
ఎప్పుడైతే సొంతంగా చపాతి వ్యాపారం చేయాలని ఆలోచన చేశామో అప్పుడే ఇద్దరమూ కలిసి ఒక పావుకిలో పిండితోఅతి తక్కువ ఖర్చుతో మొదలు పెట్టాం. కొద్దీ కొద్దిగా పెంచుకుంటూ వచ్చాం.. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి రోజూ 30 కిలోల పిండితో వ్యాపార సామర్థ్యం పెరిగిందని మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిన్నగా ఒక వంద రూపాయలకు మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు నెలకు 60 వేల వరకు పెరిగిందని.. అన్నీ పోను ఇద్దరి మహిళలకు చెరో 30 వేల రూపాయలు సంపాదిస్తున్నారు.
వ్యాపారం లాభదాయకంగా ఉండటంతో అప్పుడున్న కష్టాలు అన్నీ కూడా తగ్గాయని.. ప్రస్తుతం మేమే కష్టాల్లో ఉన్న వారికి ఆదుకొనే స్థాయికి వచ్చామని అన్నారు. వ్యాపారం మొదట్లో 5 రూపాయలకి ఒక్కో చపాతి కాగా.. ఇప్పుడు కూడా అదే ధరతో అమ్మకం చేస్తున్నారు. ధరలు పెరిగినా కలిసి వచ్చిన పని కాబట్టి ధర పెంచకుండా అదే ధరకు అమ్ముతున్నమని అంటున్నారు మహిళలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana