Home /News /telangana /

PEDDAPALLI CENTRAL GOVT NOT FUNDING FOR DRINKING WATER NEEDS OF PEDDAPALLY DISTRICT SNR PSE BRV

Peddapalli: రామగుండం నగరపాలక సంస్థ ఆశలు ఆవిరి: అమృత్ 2.0కి నిధులు ఇవ్వని కేంద్రం

(నీళ్ల నిధులు సంగతేంటి)

(నీళ్ల నిధులు సంగతేంటి)

Peddapally: రాయికల్, మంథని మునిసిపాలిటీలకు నిధులు మంజూరైనా రామగుండంకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. మొదటి విడతలో రూ.80కోట్లు మంజూరు కాగా, రెండవ విడతలో నిధులు మంజూరు కాలేదు. దీంతో రామగుండం నగరపాలక సంస్థ అధికారుల ఆశలు ఒక్కసారిగా గల్లంతయ్యాయి.

ఇంకా చదవండి ...
    (santosh,News18,Peddapalli)
    రామగుండం(Ramagundam)మున్సిపాలిటీ పరిధిలో మంచి నీటి సరఫరా వ్యవస్థ నిర్మాణం నిమిత్తం నగరపాలక సంస్థ పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో కేంద్రం నుంచి నిధులు వస్తాయని గంపెడు ఆశలు పెట్టుకున్న నగరపాలక సంస్థకు పెద్ద ఎదురు దెబ్బతగిలింది. దేశ వ్యాప్తంగా నగరాలూ, పట్టణాల్లో స్వచ్ఛమైన మంచి నీటి (త్రాగు నీరు) సరఫరా మరియు మురుగు నీరు నిర్వహణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం అమృత్ పధకాన్ని(Amrit scheme)ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అమృత్ మొదటి దశ పూర్తి కాగా, ప్రస్తుతం అమృత్ 2.0 ప్రారంభం అయింది. ఈక్రమంలో ఆయా నగర పాలికలు పంపిన ప్రతిపాదనల ప్రకారం కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది.ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలోని రాయికల్(Raikal), మంథని(Manthani) మునిసిపాలిటీలతో పాటు రామగుండంRamagundam, సుల్తానాబాద్(Sultanabad)మునిసిపాలిటీ అధికారులు సైతం అంచనా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.

    అదే కారణమా:
    అయితే రాయికల్, మంథని మునిసిపాలిటీలకు నిధులు మంజూరైనా రామగుండంకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. మొదటి విడతలో రూ.80కోట్లు మంజూరు కాగా, రెండవ విడతలో నిధులు మంజూరు కాలేదు. దీంతో రామగుండంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయాలన్న నగరపాలక సంస్థ అధికారుల ఆశలు ఒక్కసారిగా గల్లంతయ్యాయి. పట్టణీకరణలో భాగంగా మునిసిపాలిటీల్లో పరిసర గ్రామాల విలీనం, అనంతర పరిణామాలతో తొలగింపే అమృత్ 2.0కు ఎంపిక కాకపోవడానికి కారణంగా తెలుస్తుంది.

    రామగుండం ఏం పాపం చేసుకుంది:
    ఇదిలాఉంటే..అమృత్ 2.0లో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని మూడు ప్రధాన మున్సిపాలిటీలైన పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథనిలకు రూ.58 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం లేకుండా కేవలం నీటి పంపిణీ కోసం పైప్ లైన్ నిర్మాణం నిమిత్తం ఇక్కడ ప్రతిపాదనలు పంపగా ఆమేరకు నిధులు విడుదల అయ్యాయి. వీటిలో సుల్తానాబాద్ లో 25 కిలో మీటర్ల పైప్ లైన్ నిర్మాణానికి గానూ రూ.19కోట్లు, పెద్దపల్లిలో 33 కిలోమీటర్లకు గానూ రూ.26.5 కోట్లు, మంథనిలో 15 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ లైన్ కోసం రూ.12.5కోట్లు మంజూరయ్యాయి. కానీ రామగుండం నుంచి పంపిన ప్రతిపాదనలు మాత్రం తిరస్కరణకు గురయ్యాయి.

    BJP | TRS : మేం వస్తే భాగ్యనగరంగా మార్చేస్తాం .. ముందు అక్కడ మార్చి చూపించండి .."హైదరాబాద్‌ టైటిల్‌ ఫైట్ "



    రూ.100 కోట్లతో ఏం ప్రతిపాదనలు పంపారు?
    అమృత్ మొదటి విడతలో రామగుండం మునిసిపాలిటీకి రూ. 80 కోట్ల నిధులు ఇచ్చింది కేంద్రం. దీంతో అమృత్‌ 2.0లో అంతకు మించి నిధులు రాబట్టాలని అధికారులు యోచించారు. అందుకోసం ఎంతో ముందు చూపుతో వ్యవహరించి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం రామగుండం పరిధిలో ఉన్న నీటి పంపిణీ వ్యవస్థ మున్సిపాలిటీ ఏర్పడిన నాటిదని..పైప్ లైన్లు, పంపింగ్ మెయిన్లు పనికిరావని వాటి స్థానంలో కొత్తవి వేయాలని డీపీఆర్ లో ప్రతిపాదించారు. ప్రస్తుతమున్న హెచ్‌డీపీఈ (61కిమీ), ఏసీ పైప్‌లైన్‌ (115 కిమీ), పీవీసీ పైప్‌లైన్‌లు (68 కిమీ) దెబ్బతిన్నాయని, వాటి స్థానంలో 245 కిమీల డీఐ లైన్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. అంతేకాదు 2025 నాటికి మున్సిపాలిటీ పరిధిలో 74 వేలకు పైగా నివాస గృహాలు ఏర్పడతాయని అంచనా వేసిన నగరపాలక సంస్థ కొత్తగా 11,494 ఉచిత కనెక్షన్లు ఇస్తామని, అందుకోసం 55 కిమీల కొత్తలైన్లను అవసరమంటూ ప్రతిపాదనలు పంపింది నగరపాలక సంస్థ.

    ప్రశ్నార్ధకమేనా:
    అయితే ప్రతిపాదిత అంశాలపై ఎటువంటి సమాచారం, ప్రశ్నలు - జవాబులు ఇవ్వకుండానే కేంద్రానికి పంపించారు. అంతే కాదు.. అమృత్ 2.0లో ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ అభివృద్ధికి రామగుండం నగరపాలక సంస్థ పంపిన ప్రతిపాదనలు కల్లలుగానే మిగిలిపోయాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంకులు, డైవర్షన్లు, నిర్మాణం అంటూ పంపిన ప్రతిపాదనలు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో కార్పొరేషన్‌ వర్గాలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. పట్టణాభివృద్ధిలో భాగంగా అమృత్ 2.0 పధకంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూచించిన మార్గదర్శకాలకనుగుణంగా డీపీఆర్ ఉంటేనే నిధులు మంజూరు అవుతాయి. మరి రామగుండం నగరపాలక సంస్థ కొత్త డిపిఆర్ ను సిద్ధం చేసి నిధులు ఎన్నడూ రాబట్టేది ప్రశ్నర్ధకంగా మారింది.

    Rythu Bandhu 2022: రేపటి నుంచి తెలంగాణలోని ఆ రైతులకు రైతుబంధు.. నిధులు విడుదల


    Published by:Siva Nanduri
    First published:

    Tags: Local News, Peddapalli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు