Home /News /telangana /

PEDDAPALLI BULLET BIKE TURNED INTO MOBILE BARBECUE CHICKEN CENTER TWO PEDDAPALLI YOUTH MAKING GOOD BUSINESS PSE BRV ABH

Peddapalli: ఐడియా అదిరింది గురు: బుల్లెట్ బండిపై బార్బెక్యూ సెటప్ 

బుల్లెట్

బుల్లెట్ బైక్ వద్ద ఐటమ్స్ రెడీ చేస్తున్న నిహాల్, హాఫిజ్

తమ కాళ్లపై తాము నిలబడాలనే ప్రయత్నంగా చికెన్ స్నాక్స్ తయారు చేయడం మొదలు పెట్టి...ఆ ఏరియాలో ఒక ల్యాండ్ మార్క్‌గా తమ వ్యాపారాన్ని నిలిపారు ఆ యువకులు. బుల్లెట్ బండిపై బార్బెక్యూ సెటప్ ఏర్పాటు చేసి నాన్ వెజ్ స్నాక్స్ అమ్ముతూ వ్యాపారంలో సక్సెస్ అయ్యారు

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India
    E.Santosh, News 18, Peddapalli

    Peddapalli;మంచి ఆలోచనకు తోడు జీవితంలో ఎదగాలనే సంకల్పం ఉంటే మనల్ని ఆపేదెవరు. ఉద్యోగాలు రాలేదని, అవకాశాలు అందలేదని చేతులు నలుపుకుంటూ కూర్చోలేదు ఆ యువకులు. స్వయంగా అవకాశాలు సృష్టించుకుని తన కాళ్లపై తాను నిలబడాలని చిరు ప్రయత్నంగా చికెన్ స్నాక్స్ తయారు చేయడం మొదలు పెట్టి...ఆ ఏరియాలో ఒక ల్యాండ్ మార్క్‌గా తమ వ్యాపారాన్ని నిలిపారు ఆ యువకులు. బుల్లెట్ బండిపై బార్బెక్యూ సెటప్ ఏర్పాటు చేసి నాన్ వెజ్ స్నాక్స్ అమ్ముతూ వ్యాపారంలో సక్సెస్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యువకులు హాఫిజ్, ఎండీ నిహాల్ బుల్లెట్ బండిపై మొబైల్ బార్బెక్యూ(barbecue) ఏర్పాటు చేసి రుచికరమైన నాన్ - వెజ్ స్నాక్స్ అమ్ముతూ మంచి సంపాదనతో స్వయం ఉపాధి పొందుతున్నారు.

    వినూత్నంగా ఏదైనా చేయాలనే:
    ఏ వ్యాపారం చేద్దమన్న పోటీతత్వం ఎక్కువగానే ఉంటుంది. ఇది గ్రహించిన హాఫిజ్, ఎండీ నిహాల్ ఎదైన కొత్తగా చేస్తే బాగుంటదని ఆలోచన చేశారు. అదే సమయంలో.. విశాఖ(vizag) నగరానికి చెందిన యువకుడొకరు బుల్లెట్ బైక్ పై చికెన్ స్నాక్స్ అమ్ముతున్న వీడియోను యూట్యూబ్‌లో చూశారు. నాన్ వెజ్ ప్రియులను ఆకర్షిస్తూ ఎంతో రుచిగా చికెన్ స్నాక్స్ తయారు చేయడం కొత్తగా ఆనిపించింది. దీంతో తెలిసిన వారి ద్వారా బిజినెస్(bussiness) సంబంధిత వివరాలు, బైక్ ఖర్చు, బార్బెక్యూ సెటప్ వంటి వివరాలు తెలుసుకుని అక్కడే కొద్ది రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. అన్ని విషయాలపై పట్టు వచ్చాక గోదావరిఖనికి(Godavarikani) తిరిగి వచ్చిన యువకులు ఇలా బుల్లెట్ బార్బెక్యూ చికెన్ బిజినెస్ ప్రారంభించారు.

    సెటప్ ఎలా చేశారు?:
    బార్బెక్యూ బిజినెస్ ప్రారంభించేందుకు కొత్తగా ఒక బుల్లెట్ బైక్ కొన్న హాఫిజ్, ఎండీ నిహాల్... ఆ బైక్‌కి బార్బెక్యూ సెటప్ చేసేందుకు మోడలింగ్ చేయించారు. చూడగానే కొత్తగా ఫీల్ అయ్యేలా బండిని తయారు చేయించారు. కేవలం సాయంత్రం మాత్రమే బిజినెస్ సాగుతుంది కాబట్టి చీకట్లో లైటింగ్ ఎట్రాక్షన్ కనిపించేలా బైక్‌కి ఇన్వెర్టర్ బిగించి అద్భుతమైన లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇక వంట కోసం గ్యాస్ అవసరం లేకుండా మొత్తం బొగ్గుని ఉపయోగిస్తున్నారు. బొగ్గు నిప్పులపై చికెన్ కాల్చడం వలన మంచి రుచి కూడా వస్తున్నట్లు యువకులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇలా మొబైల్ బార్బెక్యూ ఏర్పాటు చేయడం కొంచం కొత్తగా ఉండటంతో ప్రారంభ దశ నుండే కస్టమర్లు వచ్చి బిజినెస్ బాగున్నట్లు యువకులు తెలిపారు. ఇక్కడికి వచ్చే కస్టమర్లు తమ చికెన్ స్నాక్స్ ఎంతో రుచిగా ఉన్నాయని చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉందని హాఫిజ్ అంటున్నాడు. ఇక్కడ తిన్నవారు తిరిగి పార్సెల్ ఆర్డర్లు కూడా తీసుకెళ్తున్నట్లు వివరించాడు.

    Read this also; Peddapalli: ఫాస్ట్​ఫుడ్ తింటున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..



    జాగ్రత్తగా ఇంటి వద్దే రెడీ చేస్తారు:
    ఇక్కడ లభించే చికెన్ ఐటమ్స్‌కి సంబంధించి ముడిపదార్ధాలు ఇంటి వద్దే ప్రిపేర్ చేసి రెఢీగా ఉంచుతామని, ఇక్కడికి వచ్చాక కస్టమర్స్ ఆర్డరుని బట్టి ఐటమ్స్ తయారు చేస్తున్నామని హాఫిజ్ వివరించాడు. చికెన్ ఐటమ్స్ క్రిస్పీగా, టేస్టీగా ఉండేందుకు కావాల్సిన పదార్థాలు వైజాగ్ నుండే కొనుగోలు చేసి తీసుకొస్తానని తెలిపాడు. ఇక్కడి స్నాక్ రుచి చేసిన కస్టమర్లు ఇక్కడ చికెన్ స్నాక్స్ చాలా బాగుటయాని చాలా రుచిగా ఉంటాయని తెలిపారు. వారాంతాల్లో ఫ్యామిలీతో పాటు వచ్చి స్నాక్స్ తింటామని కస్టమర్లు అంటున్నారు. బుల్లెట్ బార్బెక్యూ చికెన్ కావాలంటే +91-8790458589 నెంబర్‌కు కాల్ చేయవచ్చు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Food, Local News, Peddapalli, Telangana

    తదుపరి వార్తలు