Home /News /telangana /

PEDDAPALLI BROTHER DIED IN ACCIDENT WHILE SISTER WAITING FOR HIM TO TIE RAKHI IN PEDDAPALLI ABH BRV PSE

Peddapalli: రక్షాబంధన్ ఆనందాలు తీరకుండానే అన్న అనంతలోకాలకు: గుండెలవిసేలా రోదించిన చెల్లి

రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందిన సంకీర్త్ 

రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందిన సంకీర్త్ 

ఎంతో ఆశతో తన అన్నకు రాఖీ కట్టేందుకు ఆ చెల్లి ఎంతగానో ఎదురు చూసింది. అన్నతో కలిసి రక్షాబంధన్ ఆనందాలు పంచుకోవాలనుకుంది. అంతలోనే విధి తమ జీవితాలను తలకిందులు చేసింది. కరీంనగర్ జిల్లా మధీరనగర్ బొమ్మకల్‌కు చెందిన నగపూరి ప్రదీప్ కుమార్-స్వాత్విక దంపతులకు

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India
    (E.Santosh, News 18, Peddapalli)

    ఎంతో ఆశతో తన అన్నకు రాఖీ కట్టేందుకు ఆ చెల్లి ఎంతగానో ఎదురు చూసింది. అన్నతో కలిసి రక్షాబంధన్ ఆనందాలు పంచుకోవాలనుకుంది. అంతలోనే విధి తమ జీవితాలను తలకిందులు చేసింది. కరీంనగర్జిల్లా మధీరనగర్ బొమ్మకల్‌కు చెందిన నగపూరి ప్రదీప్ కుమార్-స్వాత్విక దంపతులకు కుమారుడు సంకీర్త్, కుమార్తె ఉపాసన సంతానం. గురువారం సంకీర్త్ తమ మిత్రులైన చీయజ్ ఓం, మల్యాల శివమణిలతో కలిసి పని నిమిత్తం ద్విచక్రవాహనంపై సుల్తానాబాద్ వెళ్లారు. ఈక్రమంలో వీరు కాట్నపల్లి గ్రామ శివారుకు చేరుకుంటుండగా వీరి బైక్‌ను ట్రాలీవ్యాన్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో సంకీర్త్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన ఓం, శివమణిలను స్థానికుల సహాయంతో పోలీసులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. రాఖీ పండుగకు ఒక రోజు ముందుగానే సోదరుడు మృతి చెందడంపై చెల్లి గుండలవిసేలా రోదించింది. సంకీర్త్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ ఎస్సై తెలిపారు.



    అప్పుల బాధతో రైతు ఆత్మహత్య:
    అప్పుల బాధ తట్టుకోలేక రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన రామడుగు మండలం పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై కె.అంజయ్య తెలిపిన వివరాలు ప్రకారం.. రామడుగు మండలం రంగశాయిపల్లికి చెందిన రైతు... పెద్ది రాజమల్లు మిర్చి పంట వేశాడు. మూడేళ్ళుగా పంటలు సరిగా పండక పోవడంతో రైతు కలత చెందాడు. వ్యవసాయం కోసం రూ. 4 లక్షలు అప్పు చేసిన రాజమల్లు.. అవి తీర్చే మార్గం కనిపించక...మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలో గురువారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన రాజమల్లు భార్య శారద...108 వాహనం ద్వారా భర్తను ఆసుపత్రికి తరలించింది. అప్పటికే రాజమల్లు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అంజయ్య తెలిపారు.

    దుప్పిని అటవీశాఖ అధికారులకు అప్పగింత:
    గ్రామంలోకి వచ్చిన దుప్పిని కుక్కలు తరుముతుండగా.. గ్రామస్థులు రక్షించి.. అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈఘటన బీర్ పూర్ మండలం కొల్వయి గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. కుక్కలు తరమడంతో భయపడిన దుప్పి..కొంత దూరం పరిగెత్తి.. నేలకొరిగింది. ఇది గమనించిన గ్రామస్తులు.. దుప్పిని రక్షించి అటవీశాఖ వారికీ సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు...దుప్పికి చికిత్స అందించి అనంతరం అడవిలో వదిలేశారు.

    Read This: Mulugu: యమపురికి ఎంట్రీ పాయింట్‌గా ఆ జాతీయ రహదారి: పట్టించుకునే నాథుడే లేడే !
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Peddapalli, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు