Home /News /telangana /

PEDDAPALLI BHAGAT IS A LIVING PROOF OF THE SAYING THAT PEOPLE CAN BECOME SAGES IF THEY WORK HARD BRV ABH PSE

Peddapalli: పనికిరాని వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తున్న యువకుడు: మీరే ఆశ్చర్యపోతారు

పనికిరాని వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తున్న యువకుడు:

పనికిరాని వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తున్న యువకుడు:

పనికి రాని వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు యువకుడు

 • News18 Telugu
 • Last Updated :
 • Peddapalle, India
  E.Santosh, News 18, Peddapalli

  కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాడు ఈ యువకుడు. చిన్ననాటి నుంచే సృజనాత్మకంగా, కొత్తగా ఏదైనా కనిపెట్టాలనే ఆలోచనతో తనలోని ప్రతిభను మెరుగు పరుచుకుంటూ పలు అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఆ యువకుడు. ముందుకూ వెనక్కూ నడిచే విద్యుత్ స్కూటర్, బైక్ ఇంజిన్ నుంచే టైర్లలో గాలి నింపుకునేలా ఎయిర్ పిస్టన్, టైర్ రోలర్ వంటి పలు పరికరాలు తయారీ చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన భగత్. సబ్బుతో జాతీయ జెండా, అగ్గి పెట్టె జాతీయ జెండా, రిమోట్ కంట్రోల్ జాతీయ జెండా, సెన్సార్ జాతీయ జెండాను తయారు చేశాడు. ప్లాస్టిక్ వినాయకుడు, మెకానిక్ సామగ్రితో వినాయకుడు, ఎలక్ట్రిక్ వైర్లతో వినాయకుడు తయారు చేసి తన అభిరుచిని చాటుకున్నాడు.

  రివర్స్ కూడా వెళ్లగలిగే స్కూటీ: 
  చిన్ననాటి నుండే ఎన్నో వినూత్న ఆలోచనలతో ఉండే భగత్ తన డిప్లొమా అనంతరం కొత్తగా ప్రాజెక్ట్‌లు చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచనల నుండి పుట్టుకొచ్చినవే ఎలక్ట్రికల్ స్కూటీ, ఎయిర్ పిస్టన్, టైర్ రోలర్. వీటిలో ఎలక్ట్రికల్ స్కూటీనీ తయరు చేయడం తనకు అనందని ఇచ్చిందని భగత్ న్యూస్ 18కు తెలిపాడు. మహిళలు, వికలాంగులను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటీనీ తయారు చేసినట్లు భగత్ తెలిపాడు. ఎలక్ట్రిక్ స్కూటీ తయరు చేద్దామని ఆలోచన రాగానే ఒక పాత స్కూటీని అతి తక్కువ ధరతో కొనుగోలు చేశాడు. దాంట్లోని పనికిరాని వస్తువులను తీసేసి ఎలక్ట్రిక్ మోటార్ బిగించాడు. ఛార్జింగ్ కోసం బ్యాటరీ బిగించి.. స్కూటీ 40 కిమీ స్పీడ్ నడిచేలా తయరు చేశాడు. అంతేకాదు మహిళలు, వికలాంగుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఆ స్కూటీ రివర్స్ కూడా వెళ్లేలా తయారు చేశాడు. దాని కోసం స్కూటీలో ప్రత్యేకంగా ఒక స్విచ్ ఏర్పాటు చేశాడు.

  టైర్లలో గాలి నింపేలా ఎయిర్ పిస్టన్: 
  నిత్యం బైక్ పై దూర ప్రాతాలకు ప్రయాణం చేసేవారు తరచూ పంక్చర్ గురవడం లేదా టైర్లలో గాలి లేక ఇబ్బంది పడుతుంటారు. అలంటి సమయంలో బైక్‌ను తోసుకుంటూ ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ద్విచక్రవాహనదారులు తరచూ ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు కాబట్టి చాల తేలికగా, బండి కవర్లో క్యారీ చేసుకునే విధంగా ఒక పరికరం తయారు చేయాలనే ఆలోచన వచ్చింది భగత్‌కు. పలు ప్రయోగాల అనంతరం ఎయిర్ పిస్టన్ అనే చిన్న పరికరం తయారు చేశాడు. బైక్ ఇంజిన్‌లో ఉండే స్పార్క్ ప్లగ్‌ను తీసి అందులో భగత్ తయారు చేసిన ఎయిర్ పిస్టన్ పెట్టి... కిక్ కొడితే.. ఇంజిన్‌లోని సిలిండర్ కదిలి గాలి ఉత్పత్తి అయి.. అది టైర్‌లోకి చేరుతుంది. అనంతరం స్పార్క్ ప్లగ్ బిగించి బైక్ ను యధావిధిగా స్టార్ట్ చేయొచ్చు. దీంతో ప్రజలు సులభంగా ప్రయాణం చేయొచ్చని భగత్ తెలిపాడు.

  టైర్ రోలర్:ఇప్పుడు కొత్తగా వస్తున్నా పెద్ద బైక్స్‌కి మధ్యలో ఉండే స్టాండ్ రావట్లేదు. దీంతో ఆ బైక్స్ పంక్చర్ అయినా, చైన్ సరిచేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇటువంటి సమస్య నుంచి వారికి ఉపశమనం కలిగించేలా టైర్ రోలర్ పరికరాన్ని తయారు చేశాడు భగత్. ఈ రోలర్ టైర్ కింద పెట్టి... టైర్‌ను సులభంగా తీపుకోవచ్చు.

  పలు అవార్డులు అందుకున్న భగత్:
  తన ప్రతిభతో ఇలా ఎన్నో అద్భుత పరికరాలు తయారు చేసిన భగత్...పలు అవార్డులు సైతం అందుకున్నాడు. మూడు సార్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఇన్నోవేషన్ అవార్డులు రాగ, ఎయిర్ పిస్టన్ తయారీకి గానూ రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. ఇంకా ఎగ్జిక్యూటివ్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్, హై రేంజ్ యంగ్ సైంటిస్ట్ వంటివి కూడా భగత్ అందుకున్నాడు. ఎలక్ట్రికల్ స్కూటీ, టైర్ రోలర్ ఆవిష్కరణకు గానూ స్వాతంత్ర దినోత్సవ కార్య్రక్రమంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఇన్నోవేషన్ అవార్డ్ అందుకున్నాడు. ఇలా వినూత్న పరికరాలను తయారు చేసి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న భగత్...ప్రభుత్వం సహకరిస్తే ప్రజలకు ఉపయోగపడే మరెన్నో పరికరాలను అతి తక్కువ ఖర్చుతో తయారు చేస్తానని అంటున్నాడు.

  భగత్ ఫోన్ నెంబర్: 8341904658
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Local News, Peddapalli, Telangana

  తదుపరి వార్తలు