Home /News /telangana /

PEDDAPALLI ASH IS NOW BEING USED IN CONSTRUCTIONS DEMAND FOR NTPC COAL WASTE IS RISING SAVING CRORES PSE BRV PRV

Peddapalli: బూడిదే కదా అని తక్కువ అంచనా వేశారు.. ఇపుడదే బూడిద కోట్లను ఆదా చేస్తోంది..

నిర్మాణ

నిర్మాణ పనుల్లో ఇతర అవసరాలకు పనికొస్తున్న ఎన్టీపీసీ వ్యర్ధ బూడిద

సాధారణంగా రోడ్డు పనులలో లెవెలింగ్ నిమిత్తం ఎక్కువగా సుద్ద మట్టి, డస్ట్ ను ఉపయోగిస్తారు. భవన నిర్మాణాల్లోను మట్టితో లెవెలింగ్ చేసేవారు. కానీ రామగుండం పరిసర ప్రాంతాల్లో పరిస్థితి మారింది. మట్టి, ఇసుక స్థానంలో ఎన్టీపీసీ బూడిదను వినియోగిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    (E. Santhosh, News 18, Peddapalli)

    ఎంతో శ్రమపడి చేసిన ఒక పని.. అనుకోని విధంగా పూర్తి కాకపోతే ఆ శ్రమంతా "బూడిదలో పోసిన పన్నీరే" అనే నానుడి గురించి తరచూ వింటూనే ఉంటాం. బూడిద వలనకలిగే ప్రయోజనం శూన్యం అని తెలిపే విధంగా ఈ నానుడి ప్రచారంలో ఉంది. అయితే సృజనాత్మకతతో ఆలోచించాలేగాని ఎంతటి పనికిరాని వస్తువుతోనైనా అద్భుతాలు సృష్టించవచ్చు. అది బూడిదై (Ash)నా.. పన్నీరైనా. ఒకప్పుడు ఎందుకు పనికిరాని బూడిద ఇప్పుడు ఎంతో విలువైనదిగా మారింది.

    రామగుండం ఎన్టీపీసీ నుంచి బూడిద..

    పెద్దపల్లి (Peddapalli) జిల్లా రామగుండం ఎన్టీపీసీ (Ramagundam NTPC) ప్రాజెక్టులో 2,600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి గానూ నిత్యం 32 వేల టన్నుల బొగ్గును మండిస్తారు. ఫలితంగా దాదాపు 13 వేల టన్నుల బూడిద వెలువడుతుంది. ఇలా వ్యర్ధంగా బయటకొచ్చిన బూడిద (Ash)ను డంపింగ్ యార్డుకు తరలించేవారు ఎన్టీపీసీ యజమాన్యం. రానురాను డంపింగ్ కూడా కష్టతరంగా మారింది. దానికి తోడు ఎన్టీపీసీ నుంచి వెలువడే బూడిద కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని సమీప ప్రాంతాల ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేసేవారు. దీంతో ఆ బూడిద వ్యర్ధాలను స్థానికంగా ఓసీపీ తవ్వకాలు పూడ్చేందుకు తరలించేవారు. ఆ విధంగా కూడా కొంత మొత్తంలోనే ఈ వ్యర్ధ బూడిద తరలింపు సాగుతుండేది. ఈక్రమంలో స్థానికంగా కొందరు ప్రజలు ఎన్టీపీసీ డంపింగ్ యార్డులోని బూడిదని కొద్ది కొద్దిగా సేకరించి సిమెంట్ ఇటుక తయారీలో (Cement brick making) వినియోగించేవారు. కుటీర పరిశ్రమల వారు ఇలా బూడిదను సేకరించేవారు. అయితే ఎన్టీపీసీ వ్యర్ధ బూడిదను పరిశీలించిన కొందరు ఇంజినీర్లు ఈ బూడిదను నిర్మాణపనుల్లో (In construction work) ఇతర అవసరాలకు వినియోగించవచ్చని గ్రహించారు.

    నిర్మాణ పనుల్లో బూడిద వినియోగం..

    ఎందుకూ పనికిరాని బూడిద  (Ash) అంటూ ఎన్టీపీసీ ఈ బూడిదను చాలా తక్కువ ధరకే అవసరమైన వారికి అమ్ముతుండగా.. గత ఏడాది నుంచి పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు బూడిద అనేక రకాల్లో ఉపయోగంలోకి వచ్చింది. సాధారణంగా రోడ్డు పనులలో లెవెలింగ్ నిమిత్తం ఎక్కువగా సుద్ద మట్టి, డస్ట్‌ను ఉపయోగిస్తారు. భవన నిర్మాణాల్లోను మట్టితో లెవెలింగ్ చేసేవారు. కానీ రామగుండం పరిసర ప్రాంతాల్లో పరిస్థితి మారింది. మట్టి, ఇసుక స్థానంలో ఎన్టీపీసీ బూడిదను వినియోగిస్తున్నారు.

    భవన నిర్మాణానికి ఉపయోగించే ఇటుకను కూడా గతంలో సిమెంట్, డస్ట్‌తో తయారు చేసేవారు. కానీ ఇప్పుడు ఇటుక తయారీలో కూడా ఎన్టీపీసీ బూడిదను వినియోగిస్తున్నారు. ఇలా అన్ని నిర్మాణ పనులలో బూడిద కీలకంగా మారడంతో బూడిదకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. దీంతో ఈఏడాది బూడిద తరలింపు నిమిత్తం టెండర్లను పిలిచింది ఎన్టీపీసీ యాజమాన్యం. జీడీకే -1, 2, 2ఏ, వకీల్‌పల్లి గనుల నుంచి బూడిదను తరలించేందుకు ఇటీవల కొందరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విధంగా ఎన్టీపీసీకి కోట్ల  రూపాయలు ఆదా అవుతున్నాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Ashes, Local News, Peddapalli, Ramagundam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు