(Santosh, News18, Peddapalli)
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో రాజస్థాన్ వాసులు తయారు చేస్తున్న బొమ్మలు ఇక్కడి ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఇందులో దేవుళ్ళ బొమ్మలు, వినాయకుడు, లాఫింగ్ బుద్ధ, శ్రీకృష్ణుడు, సీతారాముడు ఇలా ఎన్నో రకాల దేవుళ్ళ బొమ్మలు తయారు చేస్తుంటారు. ఐదేళ్లుగా ఇక్కడే బొమ్మలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు రాజస్థాన్ వాసులు. ఈ బొమ్మలు తయారు చేయడానికి మట్టి పిఓపి ఇన్ని ఉపయోగిస్తారు. వినాయక చవితి, దేవి మహా నవరాత్రుల ఉత్సవాలు సమయంలో ఇక్కడ తయారు చేసే విగ్రహాలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.
మిగతా సమయంలో ఇంటీరియర్ వస్తువులు తయారు చేస్తుంటారు. కావలసిన బొమ్మలు ఆర్డర్ పై తయారుచేసిస్తారు. ఒక్కో విగ్రహానికి రూ.200 నుండి రూ.8000 వరకు ధర గల విగ్రహాలు ఇక్కడ లభిస్థాయి. బొమ్మలకు తయారీకి కావలసినవి పిఓపిని సంవత్సరానికి సరిపడా ఒకేసారి తీసుకొచ్చి స్టోరేజ్ చేసుకుంటారు. దాంతో ప్రతిరోజు బొమ్మలు తయారుచేసి వాటికి అనుగుణంగా అందంగా ఉండే పెయింటింగ్ చేసి చూపర్లను ఆకట్టుకుంటున్నారు రాజస్థాన్ కళాకారులు.
రాజస్థాన్ నుండి వలస..
పొట్ట కూటి కోసం రాజస్థాన్ నుండి మంథనికి సుమారు 15 కుటుంబాలు వలస వచ్చి ఒక విశాలవంతమైన ప్రదేశంలో మున్సిపాలిటీ పర్మిషన్ తోరెండు షెడ్లు నిర్మాణం చేసుకుని అందులో బొమ్మలను తయారు చేస్తున్నారు రాజస్థాన్ కళాకారులు. వీరికి బొమ్మల తయారీ మాత్రమే ఉపాధి వ్యాపారం కాగా.. ఇది మంచిగా సాగితే లాభం లేదంటే నష్టమే. ఇలా వలస వచ్చి వ్యాపారాలు చేస్తూ కూటి కోసమే పొద్దున నుండి సాయంత్రం వరకు నిత్యం కుటుంబం మొత్తం పని చేస్తుంటారు.
వియానాయక చవితి, దుర్గా మాత వంటి సీజనల్ బిజినెస్ పర్వాలేదు అనిపించినా మిగితా సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు కళాకారులు. ప్రస్తుతానికి పొట్ట కూటి కోసం సరిపోయేంత వస్తుంది కానీ అది లేక పోతే పస్తులే ఉంటామని అంటున్నారు రాజస్థాన్ కళాకారులు. చదువు లేకపోయినా వారికి ఉన్న కళా నైపుణ్యంతో బొమ్మలు ఎంతో అందంగా తయారు చేస్తారు. ఆ అందమైన బొమ్మల వెనుక వారి జీవితాల్లో ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి. ఇలా ఈ కళపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలు.. పాఠశాలలకు దూరంగా వారి పిల్లలు పలకరించేవారు లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారు. కేవలం పొట్టకూటి కోసమే వలస వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతూ జీవితాన్ని గడుపుతుంటారు రాజస్థాన్ కళాకారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana