E.Santosh, News18, Peddapalli
ప్రస్తుత రోజుల్లో ప్పాఠశాల చదువు ఖరీదైపోతుంది. ఒకటో తరగతికే రూ. వేలు, రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి విద్యాసంస్థలు. ఇంత చేసి విద్యార్థుల్లో పెరుగుతున్న గుణాలు ఏంటి?. ఈ పాఠశాలలోనైనా తల్లిదండ్రులు మొదట చూసేది స్కూల్ అవరణ శుభ్రత, స్కూల్లో ఉండే వసతులు. అందులోనూ అంగన్వాడి బడి అంటే తమ పిల్లలను పంపించటానికి తల్లిదండ్రులు కూడా ఇష్టపడరు. ఎందుకంటే అంగన్ వాడీల్లో సౌకర్యాలు సరిగా ఉండవని.. ముఖ్యంగా శుభ్రత పాటించరనే అపవాదు ఉండేది. పైగా అంగన్వాడీలు ప్రైవేట్ ప్లే స్కూళ్ల మాదిరిగా అందంగా లేకపోవడంతో పిల్లలు కూడా వెళ్లేందుకు ఆసక్తి చూపేవారుకాదు. దీంతో తల్లిదండ్రులు వేలకు వేలు ఫీజులు కట్టి వారిని ప్లే స్కూల్స్ కి పంపించేవారు.
అయితే రాను రాను ఈ పరిస్థితుల్లో మార్పు కన్పిస్తుంది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకొని అంగన్వాడి కేంద్రాలను అభివృద్ధి చేస్తుంది. అంగన్వాడీ పాఠశాలలో సౌకర్యాలు మెరుగు పరచడంతో పాటు చిన్నారులను ఆకట్టుకునేలా రంగులు, చిత్రాలతో రూపురేఖలు మార్చేశారు. దీంతో తల్లిదండ్రులు తమ చిన్నారులను కేంద్రాలలో చేర్పిస్తున్నరు.
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు
పిల్లల చదువులకు మంచి పునాది వేసేలా అంగన్వాడీ కేంద్రాలు సరికొత్తగా రూపుదిద్దుకున్నాయి. చదువుల నిలయం అంటే ఇలా ఉండాలి అన్న విధముగా తీర్చిదిద్దుతున్నారు. జిల్లాలో సుమారు 10 కేంద్రాలలో అంగన్వాడీ అభివృద్ధికి ఎంపిక కాగా కామన్పూర్ మండలంలో పూర్తయింది. ఒక్కో కేంద్రానికి రూ. 2 లక్షల వరకు నిధులు కేటాయించారు. గోడలకు రంగులు, బడి అవరణలో ఆకట్టుకునే బొమ్మలు, బడిలోపల రంగురంగుల బొమ్మలు వేశారు.
పిల్లలు చూడగానే ఆకట్టుకునేలా రంగుల బొమ్మలు వేశారు. కమాన్పూర్ అంగన్వాడీ కేంద్రాన్ని సరికొత్తగా తీర్చిదిద్దినా ఇంకా పలు సమస్యలు ఉన్నట్లు టీచర్ కృష్ణవేణి తెలిపింది. బడిలో కరెంట్, నీటి సౌకర్యం లేవని, పిల్లల కోసం ఒక ఆయను కూడా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana