హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: పేదల ఆకలి తీర్చుతూ.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న అమ్మా పరివార్ ఆశ్రమం

Peddapalli: పేదల ఆకలి తీర్చుతూ.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న అమ్మా పరివార్ ఆశ్రమం

X
అమ్మ

అమ్మ పరివార్

Peddapalli: ఒక మనిషికి అస్తి పాస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ చదువును ఇవ్వాలనే ఆశయంతో అమ్మపరివారును 2013లో స్థాపించారు. అప్పుడు 10 మంది పిల్లలతో మొదలైన ఆశ్రమం.. ఇప్పుడు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(సంతోష్, న్యూస్18, పెద్దపల్లి)

పెద్దపెల్లి జిల్లాఅన్నార్తుల ఆకలి తీరుస్తుంది అమ్మా పరివార్. సమాజంలో ఎన్నో ఇబ్బందులను కళ్ళారా చూసి ఆ కష్టాలను తన కష్టాలుగా భావించి అనేక సేవ కార్యక్రమాలతో మంద నాగరాజు ఎంతో మందికి అండగా నిలిచారు. ఆ తరువాత నుంచి అవగాహనా కార్యక్రమాల చేశారు. ఒక మనిషికి అస్తి పాస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ చదువును ఇవ్వాలనే ఆశయంతో అమ్మపరివారును 2013లో స్థాపించారు. అప్పుడు 10 మంది పిల్లలతో మొదలైన ఆశ్రమం.. ఇప్పుడు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఇప్పటి వరకు అమ్మ పరీవార్ ఆశ్రమ నీడలో ఎంతో మంది పిల్లల భవిష్యత్తుగా మారింది. ప్రతి ఒక్కరూ చదువు కోవలన్నదే నా ధ్యేయం... దేవుడు విధించిన ఓ వింత నాటకంలో అమ్మ నాన్నలు దూరమయి అల్లాడి పోతున్నపిల్లలను సొంత వారే దగ్గరకు తీయని ఈ రోజుల్లో ఎంతో మంది పిల్లలకు భవిష్యత్తుకు వెలుగు నింపుతున్నారు అమ్మ పారివార్ ఆశ్రమం నిర్వాహకులు మంద నాగరాజు.

Congress: రేవంత్, ఉత్తమ్ మధ్య తెరవెనుక అలాంటి కోల్డ్ వార్ నడుస్తోందా 

సుమారు 50 మందికి పైగా చదువుకు కృషి చేస్తున్నారు. వారికి ఆశ్రమం ఇవ్వటమే కాకుండా ప్రతి ఏటా బట్టలు, పుస్తకాలు చదువుకు కావాల్సిన అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తారు. ఆశ్రమంలో ఉన్నవారే కాకుండా వేరే ప్రాంతాలలో నివసించి చదుకునే వారికి కూడా పుస్తకాలు, బట్టలు అన్నీ సమకూరుస్తారు. జిల్లాలో ఎక్కడైనా చదువుకొనే వారు ఏమైనా ఇబ్బందులు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే చదివించటానికి అమ్మ పరివార్ సిద్దమని చెపుతున్నారు.

ప్రతి రోజు 100 మంది అన్నార్తులకు రెండు పూటలా భోజనం.

అయ్యా ఆకలి వేస్తుంది ఒక రూపాయి ఇవ్వమని అడిగితే మొహం చాటేసుకునే ఈరోజుల్లో అన్నార్తులకు ఆకలి తీర్చటంలో ఆనందం, సంతృప్తి ఇస్తుందని చెపుతున్నారు అమ్మ పరివార్ ఆశ్రమ నిర్వాహకులు. ప్రతి రోజు పరిసర ప్రాంతంలో అన్నార్తులుగా జీవించే వారిని చెర తీస్తుంది అమ్మ పరివార్. ప్రతి రోజూ మధ్యాహ్న, రాత్రి బోజనాలు అందిస్తున్నారు.

ఆ రెండు పార్టీల మధ్య వీధి కుక్కల పంచాయతీ.. ఎవరూ తగ్గట్లేదు మరి..

వికలాంగులకు తోడుగా...

జిల్లా పరిసర ప్రాంతాలలో నివసించే వికలాంగులకి ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమం ప్రతి యేట చేస్తారు. ప్రతి సంవత్సరం 5 ఐదుగురికి ట్రై సైకిల్ పంపిణీ చేస్తారు.

దాతలకు రుణపడి ఉంటాం..

అమ్మపరివార్ ప్రస్థానం మొదలైన అప్పటి నుంచి  వారి నిజాయితీ చూసి  సేవ కార్యక్రమాలకు స్ఫూర్తిగా తీసుకున్న వారంతా అమ్మ పరివార్ తోడుగా నిలుస్తున్నారు. పుట్టిన రోజు కార్యక్రమాలకు కానీ, ఇంకా ఇతర వేరే కార్యక్రమాలకు కానీ వారు అమ్మ పరివర్ ఆశ్రమానికి వచ్చి తోడుగా నిలుస్తున్నారు. అమ్మ పరివార ఆశ్రమానికి వెన్ను దన్నుగా ఉంటున్న దాతలకు రుణ పడి ఉంటామని నిర్వాహకులు కృతజ్ఞతలు చెప్తున్నారు.

First published:

Tags: Local News, Telangana

ఉత్తమ కథలు