E. Santosh, News18, Peddapalli
చనిపోయిన ఓ వ్యక్తి నుంచి సేకరించిన అవయవాల్ని 8 మందికి పునర్జన్మ ఇవ్వవచ్చు. ఆత్మ ఉన్నంతవరకే శరీరం శరీరంలా ఉంటుంది. ఒక్కసారి మరణిస్తే ఆ క్షణం నుంచి ఆ శరీరం పాడైపోతూనే ఉంటుంది. నిర్ణీత సమయంలో కళ్లు, కిడ్నీలు, లివర్ వంటి కీలక అవయవాల్ని సేకరించి.. ఇతర అవసరమైన, సత్ప్రవర్తన కలిగిన వారికి సెట్ చెయ్యడం ద్వారా మరో కొందరికి పునర్జన్మను ప్రసాదించవచ్చు అని తెలుసుకున్న ఆ గ్రామ ప్రజలు ఎవరూ చేయలేనంత గొప్పపని చేశారు. చనిపోయాక మనిషి తన శరీరంలోంచి అవయవాలను దానం (Organ Donation) చేయవచ్చు. కళ్ళు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్ద, చిన్నపేగులు, ఎముకలు, మూలుగను వంటివి దానం చేయవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున ఆరేడుగురికి బతుకు ఇవ్వొచ్చు అని సదశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు డా.భీష్మాచారి గత కొన్ని సంవత్సారాలుగా అవగాహన కల్పిస్తున్నారు.
ఓదెల గ్రామంలో కూడా అవయవ దాన కర్తలు
పెద్దపల్లి జిల్లా (Peddapalli District) ఒదెల అనే గ్రామo లో ప్రజలు చేసిన పని కి మెచ్చుకోవాల్సిందే ఎందుకు అంటే ఆ గ్రామం లో ప్రజలు ఎవరు చనిపోయినఅవయవ దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు ఆ గ్రామంలో 110 మంది అవయవ నేత్ర దానం చేశారు. రాష్ట్రం లోనే ఇంత మంది అవయవ దానం చేసిన మొదటి గ్రామంగా నిలిచింది.
Dr భీస్మా చారి మోటివేషన్ కి అపూర్వ స్పందన..
Dr భీస్మా చారి న్యూస్18 తో మాట్లాడుతూ మన సమాజంలో అవయవ, శరీర దానం అంటే అదో పెద్ద తప్పులా భావిస్తారు. అలాగే మూఢ నమ్మకాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. కిడ్నీ దానం చేస్తే వచ్చే జన్మలో కిడ్నీ లేకుండా, కళ్లు దానం చేస్తే కళ్లు లేకుండా వచ్చే జన్మలో పుడతారని నమ్ముతారు. ఇది సరైన ఆలోచన విధానం కాదు. శాస్త్రీయంగా ఆలోచించాలి. మనం చేసే ఒక మంచి పని మరొకరి నిండు ప్రాణం నిలబెడుతుంది. ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం, సదశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను చేసిన కృషిని ప్రజల్లో ఒక మంచి అవగాహన వచ్చింది భవిష్యత్తులో వీరిని ఈ గ్రామ ప్రజలు ఎన్నో గ్రామాలకు ఊర్లకు ఆదర్శంగా నిలవాలని అన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Organs, Peddapalli, Telangana